🌿మనిషికి ఉన్న అతి భయంకరమైన జబ్బుల్లో మోహమాటం అనేవది చాలా ప్రమాదకరమైనది. మీరు ఇవ్వటం వల్ల వచ్చే ఆనందంకన్నా, కోల్పోయే దాని వల్ల వచ్చే విషాదం ఎక్కువైతే మొహమాటం అంటారు.
👉కోల్పోయే దాని వల్ల వచ్చే విషాదం కన్నా, ఇచ్చే దాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువగా ఉన్నపుడే మీరు ఇచ్చినదానికి మీకు తృప్తి, అర్థం ఉంటుంది.
🌿అవతలివారు మనతో ఎలా ఉంటే బాగుంటుందో మనం చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది చెప్పండీ! ఇతరుల దగ్గర మొహమాటం ఎక్కువై మీకు నచ్చని వాటికి కూడా 'నో' చెప్పకపోతే, మిమ్మల్ని వారు కొంత దూరం చేసుకోవచ్చు. కానీ 'యెస్' చెప్పడం వల్ల మీవి మీకు దూరం అవ్వకూడదు కదా! ఇతరుల కోరికలకీ, మన ఇబ్బందులకీ మధ్య సరైన గీత గీసుకోగలిగితే మనవసంబంధాలు బాగానే ఉంటాయి.
👉ఒకే మనిషి అందరితో మంచి అనిపించుకోవడానికి చేసే ప్రయత్నం కూడా ఒకరకమైన మానసిక రోగమే నా దృష్టిలో. అందరూ మిమ్మల్ని మంచి అనుకోవాలంటే ఎలా?
🌿ప్రతిదానికి మొహమాటం పడి వాళ్ళేమనుకుంటారో వీళ్లేమానుకుంటారో అని ఎదుటివారి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే నష్టపోయేది మీరే... అయినా మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎల్లప్పుడూ నీ వైకల్యం గురించి, లేదా నీ మంచితంనం గురించి మాట్లాడుకుంటారు అనుకుంటే అది నీ మూర్ఖత్వం.
🌿ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న ఇతరుల గురించి ఆలోచించేది, తన సమయంలో పదో వంతు, అంటే సగటున నీ గురించి ఆలోచించేది రోజుకి 60 సెకన్లు మాత్రమే. కాబట్టి ఇతరుల దగ్గర అతి మొహమాటానికి పోయి మీ నుండి మీరు దూరం కాకండి.
👉ఈ అతి మొహమాటం అనే జబ్బుతో బాధ పడుతున్నవారు ఎవరైనా ఉంటే వీలైనంత త్వరగా బయట పడండీ, లేదంటే మీరే నష్టపోతారు...
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Comments
Post a Comment