అవును వాసన వస్తున్నది అని మేక చెప్పగానే
ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరే ఇలా చెప్తావు అని చంపేసింది మేకను సింహం
వెంటనే అక్కడే ఉన్న జింకను పిలిచి నువ్వు చెప్పు దుర్వాసన వస్తుందా అని అడిగింది సింహం
జింక అస్సలు లేదు అని చెప్పడంతో
నా దగ్గరే అబద్ధం చెప్తావా అని జింకను చంపేసింది సింహం
ఇదంతా గమనిస్తున్న నక్క ఇక తన వంతని తెలుసుకుంది
నక్కను పిలిచింది సింహం
వాసన వస్తుందా లేదా అని అడగగానే నక్క
రాజా నాకు రెండ్రోజులుగా జలుబు చేసింది వాసన ఏవి రావడం లేదు
నా ముక్కు పసిగట్టలేకపోతుంది అని చెప్పింది
సింహం సరే అని వదిలేసింది
సమయానికి తగ్గట్టు సందర్భాన్ని బట్టి మాటలు ఉంటేనే మనం ఈలోకంలో బతకగలుగుతున్నాం
ఇదే సింహం వయసులో ఉన్నప్పుడు ఇలా గంబీరంగా ఉంటుంది
ఎంత అడవికి రాజైనా సత్తా లేకపోతే చీమకు కూడా చులకన అయిపోతాం
వేటాడే సత్తా తగ్గిపోయాక
ఒంట్లో పరిగెత్తే శక్తి లేక నీరసించి పోతుంది సింహం
కొన్ని నెలలు ఆహారం లేక బక్కచిక్కిపోతుందు
వేటకు వెళ్లడం మానేసి ఒక చోట ఉండిపోతుంది
ఏవైనా జంతువులు తిని వదిలేసినవి తింటూ కాలాన్ని గడుపుతుంది
తోడేళ్లను ఏదిరించే శక్తి కూడా లేకుండా పోయి వాటికి బలైపోతాయి అడవికి రాజు అనే సింహం కూడా
ఇదే జీవితం
కాలం ఎప్పుడూ మనల్ని ఒకే స్థితిలో ఉంచదు
మారుస్తూ మార్చేస్తూ తలకిందులు చేసి పడేస్తుంది కాలం
అందుకే మనకు మంచి జరుగుతుందో లేదో తెలియదు కాని మనం మాత్రం ఎవరికీ చెడు చేయకుండా ఉంటే చాలు
ఎవరికి సంజాయిషీ ఇచ్చే పరిస్థితి కంటే దారుణమైంది
మన మనసు అడిగే ప్రశ్నలకు సంజాయిషీ ఇవ్వడం
ఆ పరిస్థితికి మాత్రం ఒక్కరోజు కూడా రాకూడదు
Comments
Post a Comment