🌴మంచి ఆలోచనా తీరు..
🌴బద్దకం వదిలించండి.
🌴భయాన్ని జయించండి.
🌴మంచి మాట తీరు అలవరచుకోండి.
🌴అనుకుంటే సరిపోదు-- ఆచరించాలి.
🌴కొంచెం ఆలోచించండి.🍁
🍁మంచి ఆలోచనా తీరు అంటే.🍁
🌿మనం చదివే పుస్తకాలే మన అలవాట్లకు, మన ఆలోచనలకు, మన కోరికలకు పునాదులు వేస్తాయి.
🌿ఆఫిల్ పండు కింద పడడం చూసిన న్యూటన్ భూమ్యాకర్షణ శక్తిని కనుగొన్నాడు.
🌿రైట్ బ్రదర్స్ విమానం కనుకున్నారన్నా,
గ్రహం బెల్ టెలిఫోన్ కనుకొన్నాడన్నా,
థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బు కనుకున్నాడన్నా,
👉అందుకు వారి పూర్వజన్మసుకృతం కారణం కాదు, వారి ఆలోచనలే ఈ అద్భుతసృష్టికి కారణం.
🍁బద్దకం వదిలించండి
🌿వాడని ఇనుము తుప్పుపడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది.
🌿బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. (వాఖ్య- లియోనార్డ్ డావింసీ).
🌿ఎప్పటి పని అప్పుడే చేయాలి.
🌿జీవితంలో ప్రతిపనిని దానికి నిర్డేశించిన సమయంలో చేసెయ్యాలి.
🌿రెండోఅవకాశం కొరకు వాయిదా వెయ్యద్దు.
🌿నీ జీవితం నీది. దానిని నీకు దేవుడు ఇచ్చాడు.
👉దానిని చెడగొట్టుకోవడం, బాగుచేసుకోవడం నీ ఇష్టం.
🌿చెడగొట్టుకుంటే దాని ఫలితం నువ్వే అనుభవించాలి.
🍁భయాన్ని జయించండి
🌿పిరికివాళ్ళు మరణానికి ముందు అనేకమార్లు మరణిస్తారు.
🌿ధైర్యవంతులు చావును ఒక్కమారే రుచి చూస్తారు. (వాఖ్య-విలియం).
🌿ఒక అలవాటును వదిలించుకోవాలన్నా, అలవరచుకోవాలన్నా, మూడువారాలపాటు బుద్ధిపూర్వకంగా, విడవకుండా చెయ్యాలి.
🌿చేయగలిగిన పనిని ఆచరించండి, హాని కలిగించే చెడుని విసర్జించండి, ఇలాచేస్తూ పోతే అదే ఒక అలవాటుగా మారుతుంది.
🍁మంచి మాట తీరు
🌴మంచి అలవాట్లను నేర్చుకోవడం కష్టం, కానీ అవి జీవితాన్ని సుగమం చేస్తాయి.
🌴చెడు అలవాట్లు సులభంగా అలవాడతాయి. కానీ జీవితంలో కష్టాలను కొనితెస్తాయి....
🍁అనుకుంటే సరిపోదు-- ఆచరించాలి.
🌿అలవాటనేది మొదట బలహీనంగా మొదలై చివరకు బలమైనదిగా తయారౌతుంది.
🌿ఎక్కువమంది ప్రకృతి వైపరీత్యాలకంటే అనుచితమైన మాటలవల్లే బాధపడతారు.
🌿 ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడకండి. మాటలను ఎంచుకుని మరీ మాట్లాడండి.
🌿వివేకానికీ మూర్ఖతకీ తేడా అక్కడే ఉంది.
🍁కొంచెం ఆలోచించండి
🌴మనం మరణించినప్పుడు ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామే అని లోకం మనకోసం ఏడవాలి.
🌴ఇది జరగాలంటే మన జీవన నడవడిక ఎలా ఉండాలి ?
🌴ఎప్పుడూ నిజాన్ని చెప్పే వ్యక్తి అబద్ధం చెప్పిన మొదటిసారే పట్టుబడిపోతాడు.
🌴అలాగే ఎప్పుడూ అబద్దాలు చెప్పేవ్యక్తి మొదటిసారి నిజం చెబితే ఎవరూ నమ్మరు.
Comments
Post a Comment