అడవిలో ఏ జంతువు అతి పెద్దది... ఏనుగు.
అడవిలో ఏ జంతువు ఎత్తైనది... జిరాఫీ.
అడవిలో ఏ జంతువు తెలివైనది... నక్క.
అడవిలో ఏ జంతువు వేగవంతమైనది... చిరుత.
ఈ అద్భుతమైన లక్షణాలేవీ సింహంలో లేవు.
అయినా అడవికి రాజెలా అయ్యింది?
సింహానికి తేజస్సు ఉంది
సింహానికి ధైర్యం ఉంది
సింహానికి సాహసం ఉంది
సింహం దేనికీ భయపడదు
సింహం సవాళ్లకు సిద్ధంగా ఉంటుంది
సింహం ఆత్మవిశ్వాసంతో నడుస్తుంది
తననెవరూ ఆపలేరని నమ్ముతుంది
రిస్క్ లకు సిద్ధంగా ఉంటుంది
వేటలో తన అవకాశాన్ని వదలదు
సింహం నుండి మనం ఏమి నేర్చుకోవాలి?
మీ కలలు నిజం కావడానికి,
గొప్పగా ఎదగటానికి
ఐశ్వర్యవంతులుగా పుట్టాల్సిన అవసరం లేదు
వేగంగా ఉండవలసిన అవసరం లేదు
తెలివైనవారు కానవసరం లేదు
మేధావి కానవసరం లేదు
మీకు కావలసిందల్లా
ధైర్యం
సాహసం
ప్రయత్నించడానికి సంకల్పం
అది సాధ్యమేనన్న విశ్వాసం
ఆగకుండా , ఆపకుండా ప్రయత్నించడం..
చివరిగా...
"శ్రమ నీ ఆయుధం అయితే
విజయం నీకు బానిస అవుతుంది".
శ్రమ
విజయం
శ్రమయేవ విజయతే.🚶🚶🚶🚶🚶🚶
Comments
Post a Comment