Skip to main content

జనరల్ స్టడీస్...

కడప - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమప్రాంతంలోని నగరం. వైఎస్ఆర్ కడప జిల్లాకు ముఖ్య పట్టణం.

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి దక్షిణదిశగా 412 కి.మీ ( మైళ్ళ) దూరంలో పెన్నా నదికి 8 కి.మీ (5 మైళ్ళ) దూరంలో ఉంది. నగరానికి రెండు వైపులా నల్లమల అడవులు ఉండగా, ఒక వైపు పాలకొండలు గలవు. తిరుమల వెంకటేశ్వర స్వామికి గడప కావటంతో దీనికి ఆ పేరు సిద్ధించింది.

రామాయణం లోని నాల్గవ భాగమైన కిష్కింధకాండంఇక్కడికి 20 కి.మీ (12 మైళ్ళు) గల ఒంటిమిట్టలోజరిగినదని నమ్మకం. గండిలో కల ఆంజనేయ స్వామి గుడి కూడా రామాయణం లోని భాగమే అని నానుడి. రాముడు సీతని కనిపెట్టటంలో ఆంజనేయ స్వామియొక్క సహాయాన్ని అంగీకరిస్తూ, తన బాణం యొక్క మొనతో ఈ గుడిని కట్టినట్లు ప్రతీతి.

11 నుండి 14వ శతాబ్దాల వరకు కడప చోళ సామ్రాజ్యము లోని భాగం.14వ శతాబ్దపు ద్వితీయార్థంలో ఇది విజయనగర సామ్రాజ్యములోభాగమైంది. గండికోట నాయకుల పరిపాలనలో రెండు శతాబ్దాల వరకూ ఉంది. 1422 లో పెమ్మసాని నాయకుడైన పెమ్మసాని తిమ్మయ్య నాయుడు ఈ ప్రాంతంలో పలు దేవాలయాలను, నీటిని నిల్వ ఉంచే తొట్లని కట్టి అభివృద్ధి చేపట్టాడు. 1594 లో రెండవ మీర్ జుమ్లా ఈ ప్రాంతాన్ని ఆక్రమణ చేసి చిన్న తిమ్మయ్య నాయుడిని మోసంతో గెలవటంతో ఇది గోల్కొండ ముస్లిముల పరమైనది. 1800 లో బ్రిటీష్ సామ్రాజ్యంలోభాగమైంది. కడప నగరం పురాతనమైంది. అయిననూ కుతుబ్ షాహీపాలకుడైన నేక్ నాం ఖాన్ దీనిని విస్తరించి దీనిని నేక్నామాబాద్ గా వ్యవహరించాడు. కొంత కాలం ఇలా సాగినా తర్వాత ఇది పతనంవగా 18వ శతాబ్దపు రికార్డుల ప్రకారం ఇది నేక్నాం ఖాన్ కడప నవాబు అని తేలింది. 18వ శతాబ్దపు ప్రారంభాన్ని మినహాయిస్తే మయానా నవాబులు|మయాన నవాబులకి ఇది ముఖ్య కేంద్రంగా విలసిల్లింది. బ్రిటీషు పాలనలో సర్ థామస్ మున్రో క్రింద ఉన్న నాలుగు కలెక్టరేట్ లలో ఇది కూడా ఒకటైంది. 1830 లో కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాటి కడప స్థితిగతులను తన కాశీయాత్ర చరిత్రలో రికార్డు చేశాడు. దాని ప్రకారం అప్పటికి కడప మంచి స్థితిలోని పట్టణంగా చెప్పవచ్చు. అందరు పనివాళ్ళూ ఉన్నారని, జిల్లా కోర్టూ, కలక్టరు కచ్చేరీ కలదని వ్రాశాడు. ఆయా ఇలాకా ముసద్దీలు ఇళ్ళుకట్టుకుని పట్టణంలో కాపురమున్నారన్నారు. జలవనరులకై దగ్గరలో నది, ఊరినడుమ నీటిబుగ్గ ఉందని, ఇళ్ళు సంకుచితంగా ఉండేవని వర్ణించారు. ఊరివద్ద ఒక రెజిమెంటు ఉండేది, అందులో ఆ ప్రాంతపు దొరలు కాపురం ఉండేవారని తెలిపారు.[1] 2004 లో కడప మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తింపు పొందింది.


కడప పట్టణం భౌగోళికంగా 14°28′N 78°49′E / 14.47°N 78.82°E వద్ద ఉంది. 138 మీ (452 అడుగుల) సరాసరి ఎత్తు ఉంది. కడప జిల్లా వైశాల్యం 8723 చ.కి.మీ. తూర్పు కనుమలు జిల్లాని రెండుగా విడదీస్తాయి. ఈశాన్య, ఆగ్నేయ భాగాలు తక్కువ ఎత్తు గల పీఠభూమి కాగా, దక్షిణ, నైరుతి భాగాలు సముద్ర మట్టానికి 1500 నుండి 2,500 ఎత్తు గల భూమి. పశ్చిమం దిశగా బళ్ళారి నుండి అనంతపురం గుండా పారే పెన్నా నది ఇక్కడి నుండి తూర్పు భాగాన ఉన్న నెల్లూరు జిల్లా లోనికి ప్రవేశిస్తుంది. పరిమాణంలో ఈ నది పెద్దదిగా ఉండి, వర్షాకాలంలో బాగానే పారిననూ వేసవుల్లో మాత్రం చాలా భాగం ఎండిపోతుంది. దీని ప్రధాన ఉప నదులు కుందూ, సగిలేరు, చెయ్యేరుమరియు పాపాఘ్ని.

దర్శనీయ ప్రదేశాలు

దేవుని కడప (లేదా) పాత కడప

దేవుని కడప చెరువు

అమీన్ పీర్ దర్గా (ఆస్థాన్-ఎ-మగ్దూమ్-ఇలాహి దర్గా)

సి. పి. బ్రౌన్ గ్రంథాలయము

సెయింట్ మేరీస్ క్యాథెడ్ర చర్చ్, మరియాపురం

విజయదుర్గా దేవి గుడి, చిత్తూరు జాతీయరహదారి

కడప శిల్పారామం

వై ఎస్ ఆర్ క్రికెట్ స్టేడియం

పాలకొండలు

శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కడప సమీపంలో

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ