Skip to main content

ఇండియా అనే పేరు ఎలా వచ్చింది...?

'సింధునది' పేరు మీదుగా ఇండియా అనే పేరు వచ్చింది. భారతదేశం ఆసియా ఖండంలో దక్షిణ భాగాన ఉంది. భారతదేశం ఉత్తరార్ధగోళంలో 8º4' - 37º6' ఉత్తర అక్షాంశాలు, 68º7' - 97º25' తూర్పురేఖాంశాల మధ్యవిస్తరించి ఉంది.
*ఇండియా ఉత్తర - దక్షిణాల మధ్య పొడవు 3200 కి.మీ.
*తూర్పు - పడమరల మధ్య పొడవు 3000 కి.మీ.
* భారతదేశ భూభాగ సరిహద్దు పొడవు 15,200కి.మీ
*భారతదేశ తీరరేఖపొడవు 6,100 కి.మీ.
* భారతదేశ వైశాల్యం 3.28 మిలియన్ చ.కి.మీ.
*అండమాన్ నికోబార్ దీవుల వైశాల్యం 8,248 చ.కి.మీ.
* లక్షదీవుల వైశాల్యం 32 చ.కి.మీ.
*ప్రపంచంలో వైశాల్యంలో ఇండియా 7వ స్థానం, జనాభాలో 2వస్థానంలో ఉంది.
* భారత్ లో మొదట సూర్యోదయాన్ని చూసే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఈ ప్రదేశం కంటే గుజరాత్‌లోని ద్వారక వద్ద 2 గంటలు ఆలస్యంగా సూర్యోదయమవుతుంది.
కారణం: ఇండియా అక్షాంశ,రేఖాంశాల పరంగా 30º పొడవు విస్తరించడం.
* గ్రీనిచ్ కాలంతో పోలిస్తే భారత ప్రామాణిక కాలం 5½ గంటలు ముందు ఉంటుంది.
* భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82½º తూర్పు రేఖాంశం. ఈ రేఖాంశం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మీదుగా పోతుంది.
* కర్కటరేఖ భారతదేశంలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, త్రిపుర, మిజోరం, గుజరాత్ రాష్ట్రాలమీదుగాపోతుంది.
భూపరివేష్ఠితరాష్ట్రాలు:అంతర్జాతీయ సరిహద్దుగాని, తీరరేఖగాని లేని రాష్ట్రాలు. అవి జార్ఖండ్,ఛత్తీస్‌గఢ్,హర్యానా,మధ్యప్రదేశ్,తెలంగాణ.
తీరరేఖ: భారతదేశంలోతీరరేఖ ఉన్న రాష్ట్రాల సంఖ్య 9. ఎక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రాలు వరుసగా గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 974 కి.మీ.
చిన్నతీరరేఖ ఉన్న రాష్ట్రం గోవా. 3 సముద్రాల కలయికజరిగే రాష్ట్రం - తమిళనాడు
సరిహద్దు రేఖలు :
* భారత్ - చైనా ---> మెక్‌మోహన్ రేఖ
* భారత్ - ఆప్ఘనిస్థాన్ ---> డ్యూరాండ్ రేఖ
* భారత్ -పాకిస్థాన్ ---> రాడ్‌క్లిఫ్, 24º అక్షాంశం
* భారత్ - శ్రీలంక ---> పాక్ జలసంధి, మన్నార్ సింధుశాఖ.
దీవులు:
* భారతదేశంలోని మొత్తం దీవుల సంఖ్య 247.
* బంగాళాఖాతంలోనిదీవుల సంఖ్య 204.
* బంగాళాఖాతంలోని దీవులను అండమాన్ నికోబార్దీవులని,అరేబియాసముద్రపు దీవులను లక్షదీవులని అంటారు.
* అండమాన్ నికోబార్ దీవులు 10º-14º ఉత్తరఅక్షాంశాల మధ్యవిస్తరించి ఉంటే, లక్షదీవులు 8º-11º ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించాయి.
* లక్ష దీవులు పగడపు దీవులు.
* లక్షదీవులలోని మిన్‌కాయ్ దీవి ద్వారా వెళ్లే ఛానల్ - 8º ఛానల్. మిన్‌కాయ్దీవిమాల్దీవులను, లక్షదీవులను వేరుచేస్తుంది.
* భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే భారత దీవి గ్రేట్‌నికోబార్.
* భారత్ - శ్రీలంకల మధ్య ఉండే దీవి పంబన్‌దీవి.
ఇండియా - చిట్టచివరిప్రాంతాలు
* ఉత్తరం:కిలక్‌దావన్ కనుమ (జమ్మూ-కాశ్మీర్)
*దక్షిణం:ఇందిరాపాయింట్ (అండమాన్‌నికోబార్)
*తూర్పు:పూర్వాంచల్ పర్వతాలు (అరుణాచల్ ప్రదేశ్)
*పడమర:రాణ్ఆఫ్ కచ్ (గుజరాత్)
*భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య 29
* కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7.
చివరిగాఏర్పడినరాష్ట్రాలు: ఛత్తీస్‌గఢ్(26వది),ఉత్తరాంచల్(27వది),జార్ఖండ్(28వది),(2000 నవంబరు నెల),తెలంగాణ (29వది)(2014, జూన్ 2న)
కేంద్రపాలిత ప్రాంతాలు - రాజధానులు
1. చండీగఢ్ - చండీగఢ్
2. ఢిల్లీ - ఢిల్లీ
3. పాండిచ్చేరి - పాండిచ్చేరి
4. దాద్రానగర్‌హవేలి - సిల్వస్సా
5. లక్షదీవులు - కవరత్తి
6. అండమాన్ నికోబార్ దీవులు - పోర్ట్‌బ్లెయిర్
7. డయ్యూ, డామన్ - డామన్.
పొరుగుదేశాలతో సరిహద్దులున్న రాష్ట్రాలు:
దేశం సరిహద్దు రాష్ట్రాలు
1. పాకిస్థాన్ - పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్
2. చైనా- జమ్మూకాశ్మీర్, ఉత్తరాంచల్, సిక్కిం, హిమచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్
3. ఆప్ఘనిస్థాన్- జమ్మూకాశ్మీర్
4.నేపాల్- పశ్చిమబెంగాల్,బీహార్,ఉత్తరాంచల్,ఉత్తరప్రదేశ్, సిక్కిం
5. భూటాన్- అరుణాచల్‌ప్రదేశ్,సిక్కిం,అసోం,పశ్చిమబెంగాల్
6. బంగ్లాదేశ్ - అసోం, పశ్చిమబెంగాల్, మిజోరం, మేఘాలయ, త్రిపుర
7. మయన్మార్ - మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్
* భారతదేశంతో పొడవైన సరిహద్దు ఉన్న దేశం - బంగ్లాదేశ్, 2వ దేశం - చైనా
* తక్కువ సరిహద్దుఉన్న దేశం- ఆప్ఘనిస్థాన్


తెలంగాణ :-
31 జిల్లాలు,68 రెవెన్యూ డివిజన్లు, 584 రెవెన్యూ మండలాలు, 10,434 గ్రామాలతో రాష్ట్రం. భౌగోళికంగా ద్వీపకల్ప (దక్కన్) పీఠభూమి మధ్యభాగంలో ఇమిడి ఉంది. వేడిగా,
పొడిగా ఉన్నవాతావరణంతో అర్ధశుష్క శీతోష్ణస్థితి లక్షణాలు ఉన్న రాష్ట్రం. 2014, జూన్ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు దీని విస్తీర్ణం 1,14,840 చదరపు
కిలోమీటర్లు.. అయితే 2014 జులై 17న ఖమ్మం జిల్లాలోని 7మండలాల్లోని 327 గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ.ల.
వైశాల్యం పరంగా తెలంగాణ రాష్ట్రం దేశంలో 12వ స్థానం ఆక్రమించింది.జనాభాపరంగా కూడా దేశంలో 12వ స్థానంలోనే ఉంది.
క్షేత్రీయ అమరిక
1948, సెప్టెంబరు 17న తెలంగాణ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి చెంది హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది.అప్పటికి హైదరాబాద్ రాష్ట్రంలో 8 జిల్లాలు ఉండేవి.
1956లో ఖమ్మం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో 10 జిల్లాలున్నాయి. భారతదేశ మొత్తం విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం 3.40 శాతం.
తెలంగాణ భారతదేశంలో 15º 46' ఉత్తర అక్షాంశాల నుంచి 19º 47' ఉత్తర అక్షాంశాల వరకూ, 77º 16' తూర్పు రేఖాంశం నుంచి 81º 43' తూర్పు రేఖాంశం వరకూ విస్తరించి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు 7మండలాలు
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యస్థీకరణ బిల్లు 2014 (సంఖ్య 6) ప్రకారం తెలంగాణను కొత్త రాష్ట్రంగా రాష్ట్రపతి ఆమోదించారు. ఇందులోని సంఖ్య 19 ప్రకారం తెలంగాణలోని ఖమ్మం
జిల్లాలోని పోలవరం ప్రాజెక్టువరదముంపునకు గురికాబోతున్న 7 మండలాలను 2014, జులై 17న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. అవి..
1. వేలేరుపాడు 2. కుక్కనూరు 3. చింతూరు 4.వి.ఆర్. పురం 5.కూనవరం 6. బూర్గంపాడులో కొంతభాగం 7. భద్రాచలంలో కొంతభాగం.

రాష్ట్ర పక్షి: పాలపిట్ట(శాస్త్రీయనామం - కొరాషియస్ బెంగాలెన్సిస్)
రాష్ట్ర జంతువు:మచ్చల జింక (శాస్త్రీయనామం - ఆక్సిస్ ఆక్సిస్)
రాష్ట్ర వృక్షం:జమ్మిచెట్టు (శాస్త్రీయనామం-ప్రోసోఫిస్‌సినరేరియా)
రాష్ట్ర పుష్పం: తంగేడు (శాస్త్రీయనామం- కేసియా అరిక్యులేటా)
రాష్ట్రపండు: సీతాఫలం (శాస్త్రీయనామం- అనోనా స్కామోజా)
రాష్ట్ర చిహ్నం: కాకతీయ కళాతోరణం కింద చార్మినార్, కాకతీయ కళాతోరణంపై సింహతలాటం, చుట్టూ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూభాషల్లో తెలంగాణ ప్రభుత్వం,సత్యమేవజయతే ఉన్నాయి.

రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించిన చిత్రకారుడు - ఏలె లక్ష్మణ్ (నల్లగొండ జిల్లా, ఆత్మకూరు మండలం, కదిరేనిగూడెం వ్యక్తి)
రాష్ట్ర అధికారిక మాసపత్రిక - తెలంగాణ
రాష్ట్ర అధికారిక చానల్ - యాదగిరి
రాష్ట్ర అధికారిక పండుగలు: బతుకమ్మ, బోనాలు
బోనంలో ఉండే ఆహారం - పెరుగన్నం
లష్కర్ బోనాలు (సికింద్రాబాద్ మహంకాళి బోనాలు), హైదరాబాద్ బోనాలు.
పాలపిట్ట ఒడిశా, బీహార్‌లకు కూడా రాష్ట్ర పక్షే
జమ్మి చెట్టు ఆకులను దసరా పండుగ సమయంలో బంగారం అంటారు. సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా బంగారం అని బెల్లంను పిలుస్తారు.
తంగేడు పూలనుబతుకమ్మను పేర్చడంలో ఉపయోగిస్తారు.
తెలంగాణ ప్రజల ప్రధాన ఆహారం - గటుక (జొన్న సంకటి), ప్రస్తుత ఆహారం (వరి అన్నం).


ఆంధ్ర ప్రదేశ్ :
ఆవిర్భావం :నవంబర్ 1, 1956 (1 వ సారి ) జూన్ 2, 2014 (2 వ సారి పునర్వ్యవస్థీకరణ)
ఆంధ్ర ప్రదేశ్ 12 ° 41 'నుంచి 19.07 ° ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 77 ° మరియు 84 ° 40'ఏతూర్పురేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఉత్తరాన తెలంగాణ, ఛత్తీస్గఢ్,
ఒరిస్సా సరిహద్దులుగా, తూర్పున బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు మరియు పశ్చిమాన కర్నాటక ఉన్నాయి.

విస్తీర్ణం: 1,60,200 km²
జన సాంద్రత : 308 km²
2011 జనాభా లెక్కల ప్రకారం 4,93,86,799 కోట్ల
రాష్ట్ర చిహ్నం :పూర్ణ కుంభం
రాష్ట్రం జంతువు : కృష్ణ జింక
రాష్ట్రంపక్షి : పాల పిట్ట
రాష్ట్రం వృక్షం: వేప
రాష్ట్రం పుష్పం : నీటి కలువ
రాష్ట్ర ఫలం : మామిడి
రాష్ట్ర క్రీడ : కబడ్డి
అక్షరాస్యత రేటు : 67.41%
స్త్రీ,పురుష నిష్పత్తి : 996
గ్రామపంచాయీతీలు:12918
MLA's స్థానాలు :175
MLC's స్థానాలు :50
పార్లమెంటరీ నియోజకవర్గాలు : 25
రాజ్య సభ స్థానాలు :10
జిల్లాలు : 13
మండలాలు :670
గ్రామాలు :17363

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺