Skip to main content

ఈ నంబర్లు, అక్షరాలకు అర్థం ఏమిటో తెలుసా..?

రైలు బోగీలపై, లోపల ఉండే ఈ నంబర్లు, అక్షరాలకు అర్థం ఏమిటో తెలుసా..?

భారతీయ రైల్వే అంటే ఎంత పెద్ద ప్రజా రవాణా వ్యవస్థో అందరికీ తెలిసిందే. నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు.  దేశవ్యాప్తంగా అనేక ట్రెయిన్లు నిత్యం నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉంటాయి. అయితే, ఎప్పుడు ట్రెయిన్ ఎక్కినా మనం వెళ్లాల్సిన ట్రెయిన్ నంబర్‌, అది వచ్చే ప్లాట్‌ఫాం, మన దగ్గర టిక్కెట్ ఉందా, లేదా. ఇదిగో ఇవే విషయాలను మనం గమనిస్తాం. కానీ.. బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు మరికొన్ని విషయాలు తెలుస్తాయి. అవేమిటంటే.

ట్రెయిన్ బోగీలపై మీరెప్పుడైనా నంబర్లను చూశారా..? చూసే ఉంటారు కానీ వాటి గురించి అంతగా పట్టించుకుని ఉండరు.

బోగీ లోపల కూడా ఇంతకు ముందు చెప్పిన లాగానే అంకెలు కాకుండా అక్షరాలు ఉంటాయి.

అయితే ఈ రెండింటి వల్ల మనకు పలు విషయాలు తెలుస్తాయి.

మొదట 98337 అనే నంబర్ బోగీపై ఉంది. దీని అర్థం ఏమిటంటే. ముందు ఉన్న రెండు నంబర్లు ఆ బోగీ తయారైన సంవత్సరాన్ని సూచిస్తాయి. అంటే అందులో 98ని తీసుకుంటే ఆ బోగీ 1998లో తయారైందని అర్థం.

అలాగే 8439 అని ఉందనుకోండి, అప్పుడు ఆ బోగీ 1984లో తయారైందని తెలుసుకోవాలి. సాధారణంగా ఈ సంఖ్యలు 4, 5 లేదా 6 నంబర్లను కలిగి ఉంటాయి. ఎన్ని నంబర్లు ఉన్నా మొదటి రెండు అంకెలు మాత్రం ఆ బోగీ తయారైన సంవత్సరాన్నే తెలియజేస్తాయి. అయితే రాజధాని వంటి కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నంబర్లు ఇలా ఉండవు. 2951/2 అని ఉంటాయి.

 ఇక పైన చెప్పిన 98337 అనే నంబర్‌లోని చివరి మూడు అంకెలకు కింది కోడ్ ఉంటుంది.

పైన తెలిపిన నంబర్‌లోని చివరి మూడు అంకెలు 001 నుంచి 025 మధ్యలో ఉంటే ఆ బోగీ ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీ అని తెలుసుకోవాలి.

025 - 050 మధ్య ఉంటే : Composite 1st AC +AC-2T (ఏసీ 2 టైర్‌)

050-100 అయితే : AC 2T

101-150 మధ్య ఉంటే : AC 3T (ఏసీ 3 టైర్‌)

151-200 మధ్య అయితే : AC Chair Car

201-400 అయితే : Sleeper 2nd Class

401-600 అయితే : General Second Class

601-700 మధ్య అయితే : 2L Sitting Jan ShatabdI chair

701-800 మధ్య అయితే : Sitting Cum Luggage Rake

అంటే పైన చెప్పిన 98337 అనే నంబర్‌లో 98 అనే నంబర్ల ద్వారా ఆ బోగీ 1998లో తయారైనట్టు తెలిస్తే, ఇక 337 అనే నంబర్ల ప్రకారం ఆ బోగీ పైన పట్టిక ప్రకారం స్లీపర్ సెకండ్ క్లాస్ అని తెలుస్తుంది.


*ఇక WGSCN అనే కోడ్ అర్థం ఏమిటంటే*

W అంటే - prefix సిరీస్ ప్రారంభ అక్షరం

G అంటే - Self-generating (lighting by axle generators) - స్వయం చాలిత బోగీ

S అంటే - సెకండ్ క్లాస్ (Second Class)

CN అంటే: 3-tier sleeper coach (3 టైర్ స్లీపర్ కోచ్‌)

అయితే ఇక్కడ WGSCNలో చివరన ఉన్న రెండు అక్షరాలు (CN) బోగీని బట్టి మారుతాయి. అవేమిటంటే.

CN అంటే - 3-tier sleeper coach

CW - 2-tier sleeper coach

CB - Pantry/kitchen car/buffet car

CL - Kitchen car

CR - State saloon

CT - Tourist car (first class) (includes bathrooms, kitchen, and sitting and sleeping compartments)

CTS - Tourist car (second class) (includes bathrooms, kitchen, and sitting and sleeping compartments)

C - (except as above) With Coupe

D - Double-decker

Y - (not as prefix) With Ladies' compartment (usually 6-berth compartment with locking door)

AC - Air-conditioned

ఇక 96241 అనే నంబర్ గురించి... ఆ బోగీ 1996లో తయారైందని, 241 అంటే ఆ బోగీ స్లీపర్ సెకండ్ క్లాస్ అని తెలుస్తుంది.

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺