Skip to main content

తెలుసుకుందాం

🥚కుళ్లిన కోడి గుడ్డు నీటిలో ఎందుకు తేలుతుంది❓
🌸జవాబు: పాడైన గుడ్లు మాత్రమే కాదు, ఉడకబెట్టిన గుడ్లు కూడా నీటిలో తేలుతాయి. ఒక మామూలు గుడ్డుకు, కుళ్లిపోయిన గుడ్డుకు సాంద్రతలో తేడా రావడమే దానికి ప్రధాన కారణం. సాధారణంగా ఒక మంచి కోడిగుడ్డు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా అది నీటిలో మునుగుతుంది. కుళ్లిపోయిన గుడ్డు కూడా అదే పరిమాణంలో ఉన్నప్పటికీ దానిలో నుంచి కొన్ని బిందువులు గుడ్డు పెంకుకి ఉండే సూక్ష్మమైన రంధ్రాల గుండా బయటకి వెళ్లిపోతాయి. దాంతో గుడ్డు ద్రవ్యరాశి తగ్గిపోతుంది. 

ఏదైనా ఒక వస్తువు ఘన పరిమాణం తగ్గకుండా, దాని ద్రవ్యరాశి మాత్రం తగ్గిందీ అంటే దానర్థం.. ఆ వస్తువు సాంద్రత తగ్గిపోయిందనే.
ఉదాహరణకు.. ఒక లీటరు పాలు పట్టే పాత్రలో ఓ పదికోట్ల గాలి కణాలు బంధించామనుకుందాం. అప్పుడు ఆ పాత్రలో సాంద్రత కేవలం 5-6 కోట్ల గాలి కణాలు మాత్రమే ఉంటాయ్. పాత్ర అలాగే ఉన్నప్పటికీ, లోపలి గాలి తీసేస్తే.. ద్రవ్యరాశి తగ్గిపోవడం వల్ల పాత్ర సాంద్రత ఆ మేరకు తగ్గిపోతుంది. కుళ్లిన గుడ్డు విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. ఆ గుడ్డు సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండటం వల్ల అది తేలుతుంది.
ఈ సందర్భంగా మనం మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తించాలి. ఒకవేళ కోడిగుడ్డును చిక్కని ఉప్పునీటిలో వేసినట్లైతే గుడ్డు కన్నా ఉప్పు నీటి సాంద్రత ఎక్కువగా ఉన్నందున.. ఆ నీటిలో వేసిన గుడ్డు మంచిదైనా, పాడైనదైనా తేలుతుంది.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...