Skip to main content

తెలుసుకుందాం అంతరిక్ష నౌకలు ఉల్కల్లా మండిపోవేం?

రోదసిలోని శూన్యం గుండా ఉల్కలు (meteors) భూ వాతావరణంలోకి గంటకు వేలకొద్దీ కిలోమీటర్ల వేగంతో ప్రవేశిస్తాయి. అలా వచ్చే ఉల్క వాతావరణాన్ని ఢీకొనగానే అక్కడున్న గాలి అత్యంత ఒత్తిడికి గురవుతుంది. అందువల్ల అక్కడి గాలి ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది. ఆ ఉష్ణం వల్ల అతిగా వేడెక్కిన ఉల్క వెలుగులు చిమ్ముతూ పూర్తిగా ఏమీ మిగలకుండా మండిపోతుంది. అలా వాతావరణంలోకి ప్రవేశించిన ఉల్క ఉష్ణోగ్రత దాదాపు 1650 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు చేరుకుంటుంది. 

అలాగే అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి వచ్చినప్పుడు కూడా ఇంతటి ఘర్షణ ఏర్పడుతుంది. అయితే అది ఉల్కలా మండిపోకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. అంతరిక్ష నౌక ఉపరితలంపై సిలికా, సిలికాన్‌డై ఆక్సైడ్‌ పూతపూసిన పలకలను అమరుస్తారు. ఈ పలకలు 93 శాతం వరకు సచ్చిద్రత (porosity) అంటే అతి సన్నని రంధ్రాలను కలిగి ఉంటాయి. అందువల్ల అంతరిక్ష నౌక వాతావరణంలోకి ప్రవేశించినపుడు జనించే అత్యధిక ఉష్ణశక్తి, ఆ పలకల్లో ఒక భాగం నుంచి మరో భాగానికి ప్రవహించదు. సిలికాన్‌ ఉష్ణ వ్యాకోచ ధర్మం (thermal expansion), ఉష్ణ వాహకత్వం (thermal conduction) అతి తక్కువ. అందువల్ల సిలికా పలకలు సంపూర్ణ అధమ వాహకాలు(perfect insulators) గా పనిచేస్తాయి. 

సిలికా పలక అంచులను రెండు చేతులతో పట్టుకుని దాని మధ్య ప్రదేశాన్ని ఎర్రని వెలుగు వచ్చే వరకు వేడి చేసినా, ఆ ఉష్ణం పలకను పట్టుకున్న వ్యక్తి చేతులకు సోకదు. అంటే ఆ ఉష్ణశక్తి పలకల అంచులకు చేరుకోదన్నమాట. వీటివల్లనే అంతరిక్ష నౌకలు క్షేమంగా భూమి పైకి చేరుకోగలుగుతాయి.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

🎯 GENERAL ELECTIONS – ఓట్ల రకాలు పోటీ పరీక్షల ప్రత్యేక అధ్యయన మెటీరియల్ ముఖ్యమైన మల్టీపుల్ ఛాయస్ బిట్స్ తో పాటు.

భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. అర్హత, విధులు, ఎన్నికల నియమాలను బట్టి ఈ పద్ధతులు మారుతాయి. 📌 1. ఎన్నికల్లో ముఖ్యమైన ఓట్ల రకాలు 1️⃣ Ordinary Vote – సాధారణ ఓటు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే సాధారణ విధానం. ప్రస్తుతం సాధారణంగా EVM ద్వారా ఓటు నమోదు చేస్తారు. 2️⃣ Postal Ballot – పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల నియమాల ప్రకారం అర్హత పొందిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును నమోదు చేసే విధానం. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు, అర్హులైన సర్వీస్ ఓటర్లు, నిబంధనలకు లోబడిన ఇతర వర్గాలకు ఈ సదుపాయం ఉంటుంది. 3️⃣ EDC – Election Duty Certificate ఎన్నికల విధుల్లో ఉన్న అర్హుడైన ఉద్యోగి, తాను ఓటరుగా నమోదైన నియోజకవర్గంలోనే విధులు నిర్వహిస్తున్నప్పుడు, వర్తించే నిబంధనల ప్రకారం EDC ద్వారా ఓటు వేయవచ్చు. 4️⃣ Service Vote – సర్వీస్ ఓటు సాయుధ దళాలు, వర్తించే చట్టాల పరిధిలోని బలగాలు, భారతదేశం వెలుపల పనిచేస్తున్న అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు వంటి నిర్దిష్ట వర్గాలకు చెందిన సర్వీస్ ఓటర్లు వినియోగించుకునే ఓటు హక్కు. వర్తించ...

APPSC సూపర్‌వైజర్ గ్రేడ్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విద్యార్హతలు కలిగిన మహిళా అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అర్హులైన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఉద్యోగ వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టు పేరు సూపర్‌వైజర్ గ్రేడ్-1. మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం 29 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్హతలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అర్హత కలిగిన విద్యా విభాగాలు: - ఫుడ్ సైన్స్ ...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺