Skip to main content

మోటివేషన్... మంచి కథ..... సంతృప్తి కథ

ఆఫీస్ కు రెండు రోజులు సెలవు రావడంతో అమ్మా, నాన్నలతో గడపడానికి మా ఊరికి బయలుదేరాను.

 బస్టాండ్ కు చేరుకున్న నేను, అప్పుడే వచ్చిన బస్ ఎక్కాను.

 పరిస్థితి చూస్తే కూర్చోడానికి సీటు దొరికేలా లేదు. 

 అప్పుడే.. ఒకతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి, అతను వేరే దగ్గరకి వెళ్ళి నిలుచున్నాడు.
 హమ్మయ్య.. అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి అక్కడ కూర్చున్నాను.
నాకు సీటు ఇచ్చిన అతనికి పక్కనే ఒక అతను లేవడంతో అతను ఆ సీట్లో కూర్చోవడం జరిగింది.
ఇంతలో వేరే అతను బస్సు ఎక్కడంతో అతను లేచి నిలబడి మళ్లీ అతని సీటు ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు.
ఇలా అతను తరువాత నాలుగు అయిదు స్టాపులలో అందరికీ అలాగనే అతను కూర్చున్న సీటు ఇవ్వడం చేస్తూ ఉన్నాడు.
ఇదంతా గమనిస్తున్న నేను, చివరి స్టేజీలో బస్సు దిగబోయే ముందు అతనితో మాట్లాడాను.
‘’నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటు వేరే వాళ్లకు ఎందుకిస్తున్నావు?” అని అడిగాను.
అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘’నేను ఏమి చదువుకోలేదు, డబ్బున్నవాణ్ణి కూడ కాదు. కూలి పనులు చేసుకునే వాణ్ణి. ఏ విధంగానూ ఎవరికీ ఏమి ఇవ్వలేక పోయాను. అందువలన నేను రోజూ ఈపని చేస్తున్నాను. ఈ పని తేలిక కూడ” అన్నాడు.
"కూలి చేసుకునే నాకు నిలబడడం కష్టం కాదు. నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు కృతజ్ఞతలు చెప్తారు.
ఎవరికీ ఏమీ ఇవ్వలేని నాకు, ఈ తృప్తి చాలు.
ఆ తృప్తితో నాకు సుఖంగా నిద్రపడుతుంది” అన్నాడు...

      నాకు నోటంట మాట లేదు. ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది వారికి గిఫ్ట్ తో సమానమే...

 ఎదుటివాళ్లకు ఇవ్వాలంటే మన దగ్గర ఏమీలేకపోయిన ఇవ్వచ్చు అని అతన్ని చూచి తెలుసుకొన్నాను.
మనం ధనవంతులం, స్థితిమంతులం ఐతేనే ఒకళ్లకు ఇవ్వగలం అనుకోవటం తప్పు.
 ఇచ్చే మనసున్న ఎవరైన "ధనవంతుడే" అని అతన్ని చూశాక తెలుసుకున్నాను.
 ఒకరికి ఇవ్వడంలో గల "సంతృప్తి", మరెందులోనూ రాదని అర్థమైంది
 మిత్రులారా దయచేసి
 సేవాగుణాన్ని , సంతృప్తిని పిల్లలలో అలవరచండి.
 మనం కూడా అలవరచుకునే ప్రయత్నం చేద్దాం.! 
 "మానవసేవే మాధవసేవగా తరిద్దాము." 🙏🏻

సేకరణ. మానస సరోవరం


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺