✳దుకాణాల్లో ప్రకాశవంతమైన వెలుగునిచ్చే బల్బులు (Incadescent Light bulbs), ఫ్లోరోసెంటు ట్యూబులు కాంతిని వెదజల్లుతుంటాయి. దుకాణాల బయట ఉండేది సూర్యకాంతి. ఈ కాంతులన్నీ మనకు తెల్లని కాంతిలాగా అనిపించినా, వాటి తరంగదైర్ఘ్యాలు (wavelengths) అంటే రంగులు వేర్వేరుగా ఉంటాయి. ఒక కాంతి పక్కన మరొక కాంతిని ఉంచి నిశితంగా పరిశీలిస్తే గాని ఆ విషయం తెలియదు.
భౌతిక శాస్త్రవేత్తలు ఒకో కాంతికి ఒకో 'వర్ణ ఉష్ణోగ్రత' (colour temparature)ను నిర్ణయిస్తారు. ఇన్‌కాండిసెంటు బల్బులు 'వెచ్చని కాంతి'ని వెలువరిస్తే, ఫ్లోరోసెంటు ట్యూబులు 'చల్లని కాంతి'ని ఇస్తాయి. సూర్యకాంతిని 'తటస్థకాంతి'గా నిర్ధరించారు. ఈ వివిధ కాంతుల తరంగాలు వస్త్రాలపై పడినప్పుడు వాటిలో కొన్ని పరావర్తనం (reflection) చెంది మన కంటికి చేరుతాయి. కంటిని చేరుకునే కాంతి వర్ణపటం (spectrum) ఆ వస్త్రంపై పడే కాంతిజనకం (light source) యొక్క కాంతిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వివిధ రంగుల కాంతులతో చూసిన వస్త్రాల రంగులు వేర్వేరుగా ఉంటాయి. కానీ సూర్యకాంతిలో చూసిన వస్త్రాల రంగులు ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ఉంటాయి.
Comments
Post a Comment