🌸ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 24న నిర్వహించబడుతుంది. అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనల విషయంలో ప్రపంచదేశాలు ఒకరికొకరు తోడ్పాటును అందించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.
👉జరుపుకొనేవారు : ప్రపంచవ్యాప్తంగా
👉 రకం : ఐక్యరాజ్య సమితి
👉 జరుపుకొనే రోజు : అక్టోబరు 24
👉 సంబంధిత పండుగ : ఐక్యరాజ్యసమితి దినోత్సవం
👉 ఆవృత్తి : వార్షికం
👉 అనుకూలనం : ప్రతి సంవత్సరం ఇదే రోజు
💐చరిత్ర💐
🌸1972, అక్టోబరు 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. 1970లో ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం అంతర్జాతీయ అభివృద్ధి వ్యూహాన్ని స్వీకరించిన తేదీకి గుర్తుగా ఈ రోజు గుర్తించబడింది.
👉 1972, మే 17న ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి సమావేశం సమాచార వ్యాప్తికి, వాణిజ్య, అభివృద్ధి సమస్యలకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను సమీకరించటానికి వివిధ కార్యక్రమాలను ప్రతిపాదించింది. ఈ తీర్మానాన్ని 3038 (XXVII) గా పిలుస్తారు, దీనిని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1972, డిసెంబరు 19న ఆమోదించింది. అభివృద్ధి సమాచారాన్ని పంచుకోవడానికి ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని ప్రవేశపెట్టాలని ఈ తీర్మానం పిలుపునిచ్చింది. ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం మొట్టమొదటసారిగా 1973, అక్టోబరు 24న జరుపబడింది.
🌼లక్ష్యం🌼
👉 ప్రతి సంవత్సరం అభివృద్ధి సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం, వాటి పరిష్కరానికి అంతర్జాతీయ సంస్థలు సహకారాన్ని అందించడం
🌺కార్యక్రమాలు🌺
👉 వివిధ రంగాలలో అభివృద్ధి సాధించేందుకు కావలసిన అవకాశాలు, నైపుణ్యాల గురించి అవగాహన కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేయడం
Comments
Post a Comment