🔎సంఘటనలు🔍
🌸1582: పోప్ గ్రెగరీ-13 గ్రెగరియన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అప్పటిదాకా అందరూ అనుసరిస్తున్న జూలియన్ క్యాలెండర్ ప్రకారం అంతకు ముందురోజు అక్టోబరు 4. కొత్త గణన ప్రకారం ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తర్వాత రోజును అక్టోబరు 15గా చర్చి ప్రకటించింది. ఆ రకంగా మధ్యలో పదిరోజులను కావాలనే తప్పించడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న క్యాలెండర్ ఇదే.
🌸2009 :ఎబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగు టివి ఛానెల్ ప్రారంభమైంది. ఎ.బి.ఎన్ అంటే ఆమోద బ్రాడ్కాస్టింగ్ నెట్‌వర్క్..
🌸1932: దేశంలో తొలి వాణిజ్య విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ('టాటా సన్స్ లిమిటెడ్') ప్రారంభమైంది.
🌸1949: బనారస్ సంస్థానం, త్రిపుర, మణిపూర్ భారత్‌లో విలీనమయ్యాయి.
🌸1992: ఎయిర్ ఇండియా విమానం: కనిష్క పేల్చివేతకు సూత్రధారి తల్వీందర్ సింగ్ పర్మార్ ను భద్రతా దళాలు పంజాబులో కాల్చి చంపాయి.
🌸1997: ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి గాను రచయిత్రి అరుంధతి రాయ్కు బ్రిటన్ అత్యున్నత సాహితీ పురస్కారం 'బుకర్స్ ప్రైజ్' లభించింది.
🌼జననాలు🌼
💞1881: పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (మ.1975)
💞1889: సర్దార్ దండు నారాయణ రాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1944)
💞1920: మారియో పుజో, గాడ్‌ఫాదర్ నవలతో ప్రపంచానికి మాఫియా గురించి తెలియజెప్పిన అద్భుత నవలా రచయిత. (మ. 1999)
💞1908: జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్, ఆర్థికవేత్త. (జ.2006)
💞1920: భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (మ.2002)
💞1926: మిషెల్ ఫూకొ, ఫ్రెంచ్ తత్వవేత్త (మ.1984)
💞1927: పర్దుమన్ సింగ్ బ్రార్, షాట్‌పుట్, డిస్కస్ త్రో క్రీడాంశాలలో ఆసియా క్రీడలలలో మనదేశానికి పతకాలు సాధించిన క్రీడాకారుడు. (మ.2007)
💞1931: ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి. (మ.2015)
💞1953: మాగుంట శ్రీనివాసులురెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు.
💞1964: పేడాడ పరమేశ్వరరావు, ప్రముఖ రచయిత, భాషావేత్త, పాత్రికేయుడు, విద్యావేత్త.
💞1987: సాయి ధరమ్ తేజ్, తెలుగు నటుడు, "మెగాస్టార్" చిరంజీవికి మేనల్లుడు.
💐మరణాలు💐
🍁1918: షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (జ.1835)
🍁1937: నెమిలి పట్టాభి రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్. (జ.1862)
🍁1982: నిడుదవోలు వేంకటరావు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1903)
🍁2014: తురగా జానకీరాణి, రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (జ.1936)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 ప్రపంచ విద్యార్థుల దినోత్సవం.
👉 అంతర్జాతీయ అంధుల ఆసరా దినం.
👉 ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం.
Comments
Post a Comment