Skip to main content

తెలుసుకుందాం

🔝భూమ్యాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది❓
🌸జవాబు: వైజ్ఞానిక పరిభాషలో బలానికి, శక్తికి తేడా ఉంది. బలమున్నా శక్తి ప్రమేయంలేని సంఘటనలూ ఉన్నాయి. కానీ బలం లేకుండా శక్తి ప్రమేయం లేదు. కాబట్టి భూమ్యాకర్షణ శక్తి అనడం కన్నా భూమ్యాకర్షణ బలం భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుందనే విధంగానే మనం చెప్పుకోవాలి. భూమ్యాకర్షణ బలం భూమి నుంచి అనంత దూరం వరకు విస్తరించి ఉంటుంది. శాస్త్రీయంగా అది అనంత దూరం దగ్గర శూన్యం అవుతుంది. భూమ్యాకర్షణ ప్రభావాన్ని మరో ఇతర వస్తువు మీద బలం రూపేణా చూడాలి. ఆ బలాన్ని గెలీలియన్‌ గురుత్వ బలంగా పరిగణిస్తారు. ఈ బలపు విలువ భూమికి ఆయా వస్తువుకు ఉన్న దూరపు వర్గానికి విలోమాను పాతం గానూ, ఆయా వస్తువుకున్న ద్రవ్యరాశికి అనులోమాను పాతంగానూ ఉంటుంది. సుమారు లక్షన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుణ్ణి కూడా తన చుట్టూ తిప్పుకోగలిగినంత బలాన్ని ఇదే భూమి ఉపయోగిస్తుండగా, కొన్ని వేల కిలోమీటర్లు దాటిన వెంటనే వ్యోమశకటంలో ఉన్న వ్యోమగాములు గురుత్వ బలం సరిగా లేక శకటంలో దూదిపింజల్లా వేలాడుతుండటం చూస్తుంటాం. ఈ వైవిధ్యానికి కారణం చంద్రుడి విషయంలో దూరం కన్నా చంద్రుడి ద్రవ్యరాశి ప్రభావం అధికం కావడము, వ్యోమగాముల విషయంలో వారి దూరం కన్నా వారికున్న ద్రవ్యరాశి ప్రభావం తక్కువగా ఉండడం. భూమి లాంటి గ్రహం అయినా, సూర్యుడి లాంటి నక్షత్రం అయినా, చంద్రుడి లాంటి ఉపగ్రహం అయినా లేదా మరేదైనా చిన్నా చితకా ఖగోళ వస్తువు అయినా అది ఇతర వస్తువు మీద కలిగించే బలాన్ని ఆయా ఖగోళ వస్తువుకున్న గురుత్వ త్వరణం ద్వారా ఆరా తీయగలం. ఈ విలువ ఆయా ఖగోళ వస్తువు నుంచి దూరపు వర్గానికి విలోమంగా ఉంటుంది. దూరం రెట్టింపయితే బలం నాలుగురెట్లు తగ్గుతుంది. అందుకే బలాల్ని ఆయా ఖగోళ వస్తువుల ఉపరితలం మీద ఎంత ఉందన్నదే ప్రామాణికంగా చూపుతారు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺