సమస్యకి నువ్వెప్పుడు తల వంచ్చకు
ఎవరో ఏదో అన్నారని ఎప్పుడు బాధ పడకు
కాలం కలిసి రాలేదని నిందింస్తూ కూర్చోకూ
నష్టపోయా మోసపోయా అంటూ దిగులు పడకు
అందరూ అవమానిస్తూ హేళన చేస్తున్నారని కృంగిపోకు
నిన్నటి వరకు నీతో నడిచిన వాళ్ళు ఈ రోజు లేరని
ఆలోచించకు
ఇదొక అనుభవం అనుకో , జీవితంలో ఎదగడానికి
బాగున్నప్పుడు మావాడే అని చప్పట్లు కొట్టేవారికంటే
నీ కష్టంలో నేనున్నా అంటూ ధైర్యం చెప్పేవారే నీవారు
అనుకో
శిల ఉలి దెబ్బలు తింటేనే శిల్పంగా రూపు దిద్దు
కునేది
కొలిమిలో కాలితేనే బంగారంకి మెరుగు వచ్చేది
మట్టిలో పోరాడితేనే విత్తు మొలకెత్తేది
చెట్టు ఆకు రాలిందని దిగులు చెందితే కొత్త చిగురు
తొడుగుద్దా
పువ్వు ఒకరోజులో రాలిపోతా ఎందుకు అనుకుంటే
మరో పువ్వు పూస్తుందా
ఇదో రంగుల ప్రపంచ అని మర్చి పోకు ఇక్కడ
నటించ గలరు కానీ జీవించ్చ లేరు
కాబట్టి విమర్శలను లెక్క చేయకు నువ్వో ప్రభంజనం
గా మారే సమయాన ఇవన్నీ మాములే మిత్రమా
ఈనాడు నీతో లేని వారు కూడా నువ్వు ఎదిగిన
నాడు మావాడే అంటూ నీ చుట్టూ చేరతారు చూడు
ఆ రోజు మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకో .......
Comments
Post a Comment