Skip to main content

నేటి మోటివేషన్... ఎవరితో మీ conflict

మనకు వ్యక్తులతో conflict.. ఇతరుల్ని అనుమానంగా, శత్రువుల్లా, ఇన్‌సెక్యూర్డ్‌గా చూస్తుంటాం.

ఆలోచనలతో conflict.. మన ఆలోచనలు మాత్రమే కరెక్ట్, మిగతా వారివి తప్పు అనే బలమైన నమ్మకం... సంఘర్షణ, నిరంతరం అశాంతి.

జెండర్‌తో conflict.. మన జెండర్ మాత్రమే అన్ని ఇబ్బందులూ పడుతోంది.. రెండో, మూడో జెండర్‌లు జస్ట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాయి అనే భావన... ఇంకా చాలా ఇష్యూస్.

కులమతప్రాంతాలు, దేశాలతో ఎటూ conflict.. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ఈ పని చెయ్యాలా.. ఆ పని చెయ్యాలా అన్న నిర్ణయాల విషయంలోనూ conflict..

నేనొకటి చెబితే అది నీకు సబబు అన్పించదు.. నువ్వొకటి చెబితే అది నాకు సబబు అన్పించదు.. అదో రకమైన conflict.

నా బిహేవియర్ నీకు నచ్చదు.. చోద్యం చూస్తుంటావు... నిన్ను నేనూ అలాగే చూస్తుంటాను.

మైండ్ ఒక గొప్ప మేథమెటీషియన్. తన దగ్గర ఉన్న డేటాతో రఫ్‌గా లెక్కలూ, ఎక్కాలూ వేసి.. ఎవరు గొప్ప, ఎవరి ఆలోచనలు గొప్ప, ఎవరి జీవితం గొప్ప, ఎవరి కులం, మతం, ప్రాంతం గొప్ప అన్నది ఎవరికి వారికి ఓ గ్రౌండ్ రిపోర్ట్ చక్కగా plot చేసి ఇస్తుంది. దాన్ని పట్టుకుని ఇక జీవితాంతం పైన చెప్పబడిన అన్ని conflictలను మరింత పెద్దవి చేసుకుంటూ ఉంటాము. మన మైండ్‌లో ఉండే ప్రతీ conflict చాలా మెంటల్ రిసోర్సెస్ డిమాండ్ చేస్తుంది.

ఎవడినో చూడగానే "వాడి ఆలోచనలు కరెక్ట్‌గా లేవు.. అర్జెంట్గా మార్చాలనిపిస్తుంది". మన చేతిలో ఉన్నదైతే ఈజీగా ఎగ్జిక్యూట్ చేసి పెడుతుంది మైండ్. కానీ ఆ మైండే conflict క్రియేట్ చేసినప్పటికీ.. తన చేతిలో లేని విషయాన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలో, ఎదురుగా ఉన్న వ్యక్తిని, వాడి ఆలోచనలను, వ్యవస్థని ఎలా మార్చాలో అర్థం కాక రకరకాల థాట్ ప్రాసెస్ థ్రెడ్‌లు రన్ అయి మైండ్ హీటెక్కి.. శరీరంలో టాక్సిక్ న్యూరోకెమికల్స్ రిలీజై, మెటబాలిజం ప్రభావితం చెంది.. సైకోసోమాటిక్ డిసీజెస్‌కి దారితీసేలా పరిస్థితి తయాలరవుతుంది.

సో ఇక్కడ విశ్వమానవులుగా ఉండగల అపరిమితమైన ప్రేమ, దయ కలిగిన వ్యక్తులం... చదువుకున్నాక, నాలెడ్జ్ పెరిగాక ఆ మెటీరియలిస్టిక్ నాలెడ్జ్‌తో ఆలోచనలు, కులాలు, మతాలు, ప్రాంతాలూ, జెండర్ వంటి ప్రతీ విషయంలోనూ సంఘర్షణ సృష్టించుకుని.. మన హృదయంలో ప్రేమ అనేది ఒకటి ఉందనే విషయాన్నే మర్చిపోయి.. ప్రతీదీ very first instance రిజెస్ట్ చేసే ఇన్‌సెక్యూర్డ్, conflicted మైండ్ సెట్‌‌లోకి వెళ్లిపోయాం.

Accumulated నాలెడ్జ్ వల్ల క్రియేట్ అయిన ఈ కన్‌ఫ్యూజన్, ఈ లెక్కలు, ఎవరు గొప్ప ఎవరు తక్కువ వంటి పోలికలు, అనుభవాల నుండి వచ్చే బాధలు, భవిష్యత్ గురించి వచ్చే భయాలూ వంటి అన్ని పైపొరలూ పక్కకు తొలగిపోతేనే హృదయంలో నిశ్చలంగా ఉన్న ఓ విశ్వజనీయమైన ప్రేమని మనం అనుభూతి చెందగలుగుతాం. అప్పటి వరకూ ప్రేమ అనే పదం వినడానికి బాగుంటుంది గానీ అనుభూతి చెందేటంత అదృష్టం అందరికీ ఉండదు. నువ్వు బాధలో, అసంతృప్తిలో, సంఘర్షణలో ఉన్నంత కాలం నీకు ప్రేమ అర్థం కాదు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺