🥛ఏ పాలు మనం తాగవచ్చు? ఎలాంటి పాలు హానికరం❓
🌸జవాబు: పాలు జంతువుల నుంచి, కొన్ని చెట్ల నుంచి లభిస్తాయి. జంతువు ఏదైనా పాలు వాటి శిశువులకు పోషణ ఇచ్చేందుకే ప్రకృతి సిద్ధంగా క్షీరదాలలో ఉన్న ప్రక్రియ. క్షీరదం ఏదైనా దాని ప్రతి కదలికకు, జీవన చర్యలకు కావాల్సింది గ్లూకోజు మాత్రమే! మనలాగే వాటికీ పెరుగుతున్న దశలో కాల్షియం వంటి లవణాలతో పాటు చక్కెరలు, పోషక విలువలున్న ఆహారం అవసరం. అది పాల ద్వారా శిశు దశలో లభిస్తుంది. కాబట్టి ఏ జంతువు పాలూ మనకు విషతుల్యం కాదు. పచ్చిపాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవి గేదె పాలయినా, ఆవు పాలయినా, గాడిద పాలు, మేక పాలు అయినా... మరగబెట్టి తాగితేనే ఆరోగ్యానికి మంచిది. జిల్లేడు పాలు, మర్రిచెట్టు పాలు, రబ్బరు పాలు, రావి చెట్టు పాలు, గన్నేరు చెట్టు పాలు పోషక విలువలున్న పాలు కావు. ఆ పాలు ఆయా చెట్లకు రక్షణనిచ్చే విష ద్రవాలు. తెల్లనివన్నీ పాలు కావన్న సామెత ఇక్కడే అమలవుతుంది. చెట్ల పాలు తాగకూడదు కానీ జంతువుల పాలు వేడి చేసుకుని తాగితే ఏదీ హానికరం కాదు.
Best information about Drinking Milk.
ReplyDelete