Skip to main content

నేటి మోటివేషన్.... పిల్లలతో పెద్దల ప్రవర్తన....

తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించకూడదు. 

పదే పదే వారికి ఒకటే విషయం చెప్పి విసిగించడం వంటివి చేయకూడదు. 

పిల్లలకు ఏ విషయం చెప్పదలచుకున్నా ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే చెప్పాలి. పదేపదే న్యాగింగ్ చేస్తే పిల్లలు తల్లిదండ్రులను లెక్కచెయ్యరు. 

పిల్లల్లోని లోపాలను ఎత్తి చూపడం కన్నా, వారిలోని స్కిల్స్‌ను గుర్తించి అభినందించండి. ఇతరుల ముందు మీ పిల్లల్ని తక్కువచేసి మాట్లాడకండి. దీనివల్ల వారు మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. 

పిల్లలు తప్పుచేసినప్పుడు ‘మీ నాన్నరానీ చెబుతాను’ అనో లేదా ‘మీ అమ్మతో చెబుతాను నీ సంగతి’ అని పిల్లల్ని ఎప్పుడూ బెదిరించకూడదు. దీనివల్ల వారికి తల్లిదండ్రుల పట్ల ప్రేమ బదులు భయం ఏర్పడుతుంది.

 తల్లిదండ్రులు పిల్లలు అమలుపరచలేని రూల్సు మాట్లాడి పరువు తీసుకోకూడదు.

మీరు ఒక తప్పును చేస్తూ పిల్లలను ఆ తప్పు చేయకూడదని చెప్పకూడదు. దీనివల్ల తల్లిదండ్రులే నవ్వులపాలు అవుతారు.

 చంపేస్తాను, చీల్చేస్తాను, నరికేస్తాను వంటి పదాలను పిల్లల ముందు మాట్లాడకూడదు. ఎందుకంటే అవి మీరు ఎలాగూ చేయలేరు.. అలాంటప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు?

 పిల్లలు ఎప్పుడు నిద్ర లేవాలో, ఎప్పుడు చదవాలో, ఎప్పుడు పడుకోవాలో నేర్పించి, వాటిని అమలుచేసేలా ప్రోత్సాహం అందించాలి.

 ఇతరుల పిల్లలతో ఎట్టి పరిస్థితులలోనూ పిల్లలను పోల్చకూడదు. దానివల్ల తనంటే మీకు ఇష్టం లేదని పిల్లలు అనుకునే ప్రమాదం ఉంది.

 వారానికొకసారి పిల్లలతో సరదాగా ఒక సినిమాకి లేదా ఫంక్షన్‌కి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

 ఆప్యాయతనందించే చుట్టాలను కలుస్తూ ఉండాలి. 

పిల్లల పరీక్షల సమయంలో మీరు టీవీ సీరియల్స్ చూస్తూ పిల్లలను చదువుకోమంటే వారు చదవరు. కాబట్టి మీరు టీవీ చూడటం మానేయాలి.

ఇతర పిల్లల పట్ల అసూయ పెంచుకున్న పిల్లలను దగ్గరికి తీసుకుని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కౌనె్సలింగ్ చేయాలి. 

పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు తిడుతూ టీవీ ఆఫ్ చేయడం కన్నా ‘ఇప్పుడు చదువుతావా? పది నిముషాల తర్వాత చదువుతావా? ’ అని అడిగి ఛాయిస్ ఇవ్వాలి. దాంతో వారే అర్థం చేసుకుని కాసేపు టీవీ చూసి తరువాత చదువుకుంటారు.

 పిల్లలకు పాఠశాలలో ర్యాంకు వచ్చినా, ఏదైనా పోటీల్లో నెగ్గినా ప్రత్యేకంగా అభినందించాలి.

 పిల్లల స్కూల్ ఫంక్షన్లకి వెళుతూ ఉండాలి.

 ఎప్పటికప్పుడు చెత్తను, చెత్త బుట్టలో వేయడం, ఇంట్లో ఎక్కడైనా పనికిరాని పేపర్లు, చాక్‌లెట్ కాగితాలు కనబడితే చెత్తబుట్టలో వేయడం వంటివి పిల్లలకు నేర్పాలి. 

అడపాదడపా గుడులకు తీసుకెళ్ళడం, అనాథ శరణాలయాలకు తీసుకెళ్లడం, మానవతా విలువల గురించి చెప్పడం చేయాలి. 

 పిల్లలకు మహనీయుల చరిత్రలు చెప్పాలి.

 పిల్లలు చెప్పే మాటలను శ్రద్ధగా వినాలి. 

ఇంట్లో స్థలం ఉంటే మొక్కలు వేయాలి. మీతో పాటు పిల్లలు కూడా గార్డెనింగ్ చేసేలా ప్రోత్సహించాలి. 

పిల్లలకు ఐక్యూ పెరిగేలాగా ఇంట్లో మంచి పుస్తకాలను కొనాలి. 

మీకు తెలిసిన మంచి విషయాలను పిల్లలకు చెబితే వారు చాలా మంచి వ్యక్తుల్లా తయారై, ఉన్నత విలువలను కలిగి ఉంటారు...

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

English Tips Vocabulary 2

📙clandestine /klanˈdɛstɪn/ meaning: secret , undercover 👉Romeo & juliet had a clandestine meeting under her balcony because their parents did not approve of their romance. 👉the police sometimes use clandestine sting operations in order to reduce criminal activity. 👉she deserved better than these clandestine meetings. 📗synonyms: secret -covert 📗antonyms:open 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ