Skip to main content

నేటి మోటివేషన్... ఎప్పుడు డబ్బులు ,అసూయ స్వార్థం ఇవే కాదు జీవితమంటే...


ఎప్పుడు డబ్బులు ,అసూయ స్వార్థం ఇవే కాదు జీవితమంటే..

కాస్త ప్రేమ కూడా జీవితమే
భార్య భర్తలు విడిపోతున్నారు కదా అని
పెళ్లి చేసుకోకుండా ఉండలేం కదా..
ప్రేమ లో పడి మోసపోతున్నారు అని
ప్రేమ నే పక్కన పెట్టలేం గా..🙂
బంధం అనే పదం లోనే రెండు అర్థాలు ఉన్నాయి
కాబట్టి negative గా ఎప్పుడు థింక్ 
చెయ్యకూడదు
థింక్_Positive 
ప్రతి బంధం లోను మూడవ మనిషి 
జోక్యం వల్లనే బంధాలు వీక్ అవుతూ ఉంటాయి
ఆ జోక్యం రానంత వరకు హాయిగా
ఆనందం గా ఉంటారు..
ప్రేమిస్తే స్వర్గం లా ఉంటుంది
ప్రేమ గురించి తెలియని వాళ్ళకి 
ఒక punishment లా కనబడుతూ ఉంటుంది
భార్య భర్తలు కూడా అంతే..
మూడవ మనిషి జోక్యం వలనే
మంచి వాళ్ళని కోల్పోతూ ఉంటారు..
ఎప్పుడు చిన్న చిన్న మనస్పర్థలు వస్తూనే ఉంటాయి
అంత మాత్రాన భార్య భర్త లు #ego కి పోయి
వేరే వాళ్ళని involve చేస్తారు..
అప్పుడు.... వాళ్లకి చెప్పే మాటలు వాళ్లకి
వీళ్ళకి చెప్పే మాటలు వీళ్ళకి... చెబుతూ
మధ్యలో ఈ మూడవ వ్యక్తి లాంటి వాళ్ళు
 ఆనంద పడుతూ ఉంటారు..
ఇది అంత ఎందుకు చెబుతున్నా అంటే..
ఒక_వారం_పది_రోజుల_నుంచి 
Couples కానివ్వండి 
Lovers కానివ్వండి
వీళ్ళ లైఫ్ లోకి ఇంకొకరు జోక్యం 
చేసుకోవడం వల్ల 
జీవితాలే పోతున్నాయి..
వీళ్లూ చేసే తప్పేంటి అంటే..
చిన్న చిన్న గొడవలు వచ్చినపుడు
 వేరే వాళ్ళతో బాధని పంచుకుంటారు.. 
అప్పుడు ఎమోషన్ లో కనెక్ట్ అయిపోతారు
సరే వీళ్లూ కలుపుతారా అంటే కలపరు
వీళ్ళ ఆనందం కోసం విడగొడతారు
ఇలా ఎంత మంది జీవితాలు పోతున్నాయి..
ఇంట్లో సంసారం బయటకి అసలు వెళ్ళకూడదు
అని తెలుసు..
తెలిసి తెలిసి మరీ తప్పు చేస్తారు..
ఒక relation అంటే నమ్మకం ప్రేమ ఉండాలి..
ఒక్కోసారి ఇంట్లో పేరెంట్స్ కూడా
కొడుకుని , కూతుర్ని అసలు నమ్మరు
ఎవరో చెప్పింది వింటారు..🙄
అలా వింటూనే ఉంటారు.. 
మన వాళ్ల మీద మనకు నమ్మకం ఉండదు
పక్క వాళ్ల మీద బాగా నమ్మకం ఉంటుంది..
ఏ బంధం అయినా సరే.. పక్కన_వాళ్ళు 
చెబితే వెంటనే నమ్ముతారు గాని
అసలు ఎందుకు చెబుతున్నారు , 
అది నిజమా అబద్దమా.. 
అని ఆలోచించరు
అనేక సందర్భాల్లో ఎప్పుడైనా మనతో 
మాట్లాడుతూ ఉంటున్నపుడు వాళ్ళు చెప్పేవి
నిజాలా అబద్ధాలా అని ఆలోచించాలి..
వాళ్ల మీద అంత over_confidence పనికిరాదు
వాళ్ళు చెప్పిందే విని 
నువ్వు ఒక decision కి రాకూడదు
నీకంటూ ఒక charecter ఉండాలి..
ఎప్పుడు తప్పు చేయరు కదా అని
ఓవర్ గా నమ్మాల్సిన పని లేదు.. 
తప్పు చేసినా తప్పు చేయకున్నా
నువ్వు మాత్రం correct a wrong a
అని ఆలోచించి తీరాల్సిందే..
పక్కన ఉండే వాళ్ళు 
నీకు వంద చెబుతారు
అవి అన్నీ విన్నావా ఇక అంతే..
పక్కన వాళ్ళు చెబుతున్న విషయాలు 
నువ్వు ఎప్పుడు అయితే నమ్మి
నీ బంధానికి విలువ ఇవ్వకుండా పోతావో
అప్పుడే దారం తెగిపోతుంది..
నీ బంధానికి విలువ ఇవ్వకుండా 
పక్కన వాళ్లకి ఎప్పుడు అయితే విలువ 
ఇస్థున్నావు అని అర్థం అయినా చాలు
దారం తెగిపోతుంది
తెగిపోయిన బంధం శాశ్వతంగా వెళ్ళిపోతుంది
కాబట్టి 
భార్య కి భర్త 
భర్త కి భార్య మాత్రమే జీవితాంతం ఉంటారు..
ఎవ్వరూ ఉండరు రారు కూడా..
ఎవరయినా కొన్ని రోజులు మాత్రమే ఉంటారు
ఈ కొన్ని రోజుల ఉండే బంధం కోసం
జీవితాంతం మీకు తోడు గా ఉన్న వాళ్ళని
దయచేసి దూరం చేసుకోకండి..
ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి గాని
పెట్టట్లేదు.. 
నా పక్కనే తిరుగుతున్న మా ఫ్రెండ్స్ వాళ్ల ఫ్రెండ్స్ 
జీవితాల్లో జరిగిన విషయాలు..
రోజు వాళ్ల బాధలని చూస్తున్నాము...

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

TET and DSC Very important topics...

Lakshya Educational Groups