🪐కృష్ణ ద్రవ్యము (Dark Matter) అంటే ఏమిటి❓
🌸జవాబు: ఈ విశాల విశ్వంలో, బ్రహ్మాండాలను (గెలాక్సీలను) ఒకటిగా ఉంచడానికి, అవి గుంపులుగా కదలడానికి ఎంత ద్రవ్యరాశి (Matter)కావాలో గణనలు చేయడం ద్వారా శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. కానీ.. వారు గమనించిన ద్రవ్యం, విశ్వంలో ఉన్న ద్రవ్యంలో 4 శాతం మాత్రమే. కాబట్టి.. ఆ కనిపించని, వెలుగునీయని ద్రవ్యాన్ని డార్క్‌మేటర్ (కృష్ణ ద్రవ్యము) అంటారు. ఈ ద్రవ్యము నల్లని మేఘాలు, ధూళి లేక కాలం తీరిన నక్షత్రాల (Dead Stars) రూపంలో ఉందనుకోవడం సరికాదు.
👉 అతి నల్లని ద్రవ్యాన్ని కనుగొనే శాస్త్ర పరికరాలున్నప్పటకీ, ఈ కృష్ణ ద్రవ్యాన్ని కనుగొనడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మహా విస్ఫొటనం (బిగ్ బ్యాంగ్) తర్వాత జరిగిన కేంద్రక చర్యల (Nuclear reaction) ఆధారంగా విశ్వంలో ఎంత ద్రవ్యం ఉందనేదాన్ని శాస్త్రజ్ఞులు కచ్చితంగా లెక్కకట్టగలరు. ఈ లెక్కల వల్ల తేలిందేమంటే, ఇప్పుడు విశ్వంలో ఉన్న మొత్తం ప్రోటాన్ల, న్యూట్రాన్ల ద్రవ్యరాశి, మొత్తం విశ్వంలో ఉండాల్సిన ద్రవ్యరాశి కన్నా అతి తక్కువ అని. ఈ తప్పిపోయిన ద్రవ్యాన్వేషణ విశ్వజ్ఞాన శాస్త్రజ్ఞుల (Cosmolodist)ను కణభౌతిక శాస్త్రజ్ఞులను ఒక చోటికి చేర్చింది.
👉 ఈ కృష్ణ ద్రవ్యరచన న్యూట్రాన్లు, న్యూట్రినోలు, పెక్సియన్ కణాలతో జరిగి ఉండొచ్చని శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు. కాని వాటి ఉనికిని ఇంతవరకు కనిపెట్టలేదు. కారణం ఈ మూడు రకాల కణాలలో విద్యుదావేశం శూన్యం కాబట్టి, అవి వాటిపై పడే కాంతిని శోషణం (absorb) చేయడం కాని, పరావర్తనం (reflection) చేయడంగాని చేయలేవు. అందువల్లనే ఆ కణాలతో నిర్మితమైన ఆ ద్రవ్యం కనిపించదు. కానీ కృష్ణద్రవ్యం మహా విస్ఫోటన ధాటికి తట్టుకుని విశ్వంలో నిశ్చలంగా ఉంది.
Comments
Post a Comment