Skip to main content

నేటి మోటివేషన్... అమ్మాయిని బతకనిస్తే !! !! అమ్మను గౌరవించినట్లే !



"' ఆడ '" కూతురు ..
ఓ చిన్న ఆర్టికల్ ...
చాలా బాగుంటుంది ...
తన కూతురును ప్రేమించే ప్రతి తండ్రి చదవాల్సిన అధ్బత కధనం, తప్పకుండా మీరు చదవండి ..

అమ్మాయి పెళ్ళి నిశ్చయ అయింది, తాంబూలాలు పుచ్చుకున్నారు, అది కూడా ఓ గొప్పింటి సంబంధం కావడంతో కుటుంబంలో అందరూ ఎంతో సంతోషించారు, తండ్రి కూడా ఎంతగనో ఆనందించాడు..

పిల్లవాడు మరియు అతని తల్లిదండ్రులు చాల మంచివారు, దాంతో పెళ్ళికూతురు తండ్రికి ఎంతో భారం తగ్గినట్లనిపించింది .. 

పెళ్ళికి ముందే, ఓ రోజు పెళ్ళికూతురు తండ్రికి, వియ్యంకుడు వాళ్ళింటికి వెళ్ళలసివస్తుంది, ఆరోజు పెళ్ళికూతురు తండ్రికి, ఆరోగ్యం బాగాలేదు, కానీ మొదటిసారి కావడంతో కాదనలేకపోయారు, వరుని ఇంటికి వెళ్ళినప్పుడు, వరుని తరపువాళ్ళు, ఎంతో సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించారు ..

కొద్దిసేపు వచ్చినపని విషయమై మాట్లాడుతుండగానే తేనీరు వచ్చింది, పెళ్ళికూతురు తండ్రికి, మధుమేహం ఉండడంతో చక్కెర పదార్ధాలకు దూరంగా ఉంటున్నారు, అయితే మగపెళ్ళి వారింటిలో మొహమాటంతోనే ఇచ్చిన టీ కప్పును చేతిలోనికి తీసుకున్నారు ..

మొదటి గుటక వేస్తూనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు, అందులో పంచదార లేదు సరికదా, తనకిష్టమైన యాలకుల పొడి వేశారు ..

తన ఇంటిలో చేసిన పధ్ధతిలోనే, టీని వరుని ఇంటిలో తాగుతున్నట్లు అనిపించింది, మధ్యాహ్నం భోజనం చేశారు, అదీ కూడా అచ్చు తమ ఇంటిలో వంటకాలు వండే విధంగానే ఉంది ..

ఆ తరువాత, మీరు ఇప్పుడే ఏం బయలుదేరుతారండి, కొంచెం విశ్రాంతి తీసుకోండి, అంటూ పడకగదికి తీసుకెళ్ళారు, అక్కడ తను కప్పుకునే పలచటి దుప్పటి లాంటి దుప్పటి ఉంది, కునుకుతీసి నిద్ర లేచేసరికి రాగి చెంబులో నీరిచ్చారు తాగడానికి ..

బయలుదేరేముందు ఇక అడగకుండా ఉండలేకపోయేరు పెళ్ళికూతురు తండ్రి ...

నేను ఏం తింటాను ..
ఎలా తాగుతాను ..
నా ఆరోగ్యానికి ఏది మంచిది ..
ఇవన్నీ మీకెలా తెలుసు .. ?

అమ్మాయి అత్తగారు ఇలా అంది ..
నిన్న రాత్రి మీ అమ్మాయి ఫోన్ చేసి మీ గురించి అన్నీ చెప్పిందండి, మా నాన్నగారు మొహమాట పడతారు, వారి గురించి మీరే శ్రధ్ధ తీసుకోవాలని కోరింది ..

పెళ్ళికూతురు తండ్రి కళ్ళల్లో నీరు తిరిగాయి, ఇంటికి రావడంతోనే భార్యను పిలిచి ఇలా అన్నారు, మా అమ్మ ఇంకా బతికే ఉంది ..

ఏమిటండీ మీరు మాటాడుతున్నది, అవును, నన్ను కంటికి రెప్పలా చూసుకొనే, నా తల్లి బతికే ఉంది, నా కూతురు రూపంలో బతికే ఉంది, అని, జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు పెళ్ళికూతురు తండ్రి తన భార్యతో, కన్నీరు నిండిన కళ్ళతో ..

అమ్మాయి 'ఆడ' పిల్ల అనుకొంటాము, మన ఇల్లు వదిలి పోతుందని, తను ఎక్కడికీ పోదు, తలిదండ్రులను తన హృదయాలలోనే ఉంచుకుంటుంది, తన మనస్సులో తనవారి జ్ఞాపకాలను నింపుకొని ..

!! అమ్మాయిని బతకనిస్తే !!
!! అమ్మను గౌరవించినట్లే !!

💎💎💎✨💎💎💎
.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺