Skip to main content

నేటి మోటివేషన్... ఎమోషన్‌తో రియాక్ట్ కావడం కాకుండా అర్థం చేసుకుని కామ్ గా ఉండటం చాలా శ్రేయస్కరం.


ఒక వ్యక్తి పట్ల మనం వ్యక్తపరిచే ప్రతీ ఎమోషన్ చుట్టూ అనేక ఇతర నెగిటివ్ ఎమోషన్స్ చుట్టుముట్టి ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు చెబుతాను.

వరుణ్ అనే ఓ ఫ్రెండ్ మీకు ఉన్నాడు అనుకుందాం. ఏదో ఒక సందర్భంలో మనసు గాయపడి ఈ విధంగా మీరు అనుకుని ఉండొచ్చు.. "వరుణ్ చాలా స్వార్థపరుడు, ఇక మీదట దూరంగా ఉండాలి".

ఇలా మీరు అనుకున్న వెంటనే ఖచ్చితంగా ప్రతీ మనిషిలో దాగి ఉండే విమర్శకుడు తనని తాను విమర్శించుకుంటూ ఇలా రెస్పాండ్ అవుతాడు.

"వరుణ్ పట్ల అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు, నేను మంచి స్నేహితుడిని కాదు" - ఇది ఒక వ్యక్తి తనని తాను అవమానించుకోవడం అవుతుంది.

ఈ ఆలోచన వచ్చిన వెంటనే దానికి అనుబంధంగా మరో ఆలోచన వస్తుంది.

" అసలు నేను ఎవరికీ మంచి ఫ్రెండ్‌గా ఉండలేను. ఎవరూ నన్ను పెద్దగా ఇష్టపడరు" అనే థాట్ వస్తుంది. దాంతోపాటే ఇతరులు మిమ్మలను దూరంగా పెట్టిన కొన్ని జ్ఞాపకాలు అప్పటికప్పుడు స్ఫురణకు వస్తాయి. ఇది డిప్రెషన్ కి సంబంధించిన థాట్ ప్రాసెస్.

చివరిగా.. " నేను ఈ బాధను తట్టుకోలేను, అసలు ఇలాంటి మనుషులకు దూరంగా ఉంటే బెటర్.." అనుకుంటూ వేరే వ్యాపకంలో పడడం! - ఇది ఎస్కేపిజానికి సంబంధించిన భావజాలం.

కొన్నిసార్లు కొంతమంది మళ్లీ మళ్లీ అదే ఆలోచిస్తూ డిప్రెషన్ స్థితిలోకి కూరుకుపోతారు. ఒక చిన్న నెగిటివ్ ఎమోషన్ వలన, ఒక వ్యక్తి పట్ల మనం వెళ్లగక్కే ఓ చిన్న ఎమోషన్ వల్ల ఇవన్నీ కలిసి మనల్ని కుంగదీస్తాయి. ఇలాంటి కొన్ని వందల సంఘటనలు ప్రతీరోజు చాలామందికి ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి నెగిటివ్ థాట్స్ మళ్లీ మళ్లీ మన ఆలోచనలను హైజాక్ చేస్తూ పూర్తిగా మన వ్యక్తిత్వాన్ని మార్చివేస్తాయి.

దీనికి పరిష్కారంగా ఉన్న పరిస్థితిని ఉన్నది ఉన్నట్లు ప్రాక్టికల్ గా ఆలోచించడం, ఎమోషన్‌తో రియాక్ట్ కావడం కాకుండా అర్థం చేసుకుని కామ్ గా ఉండటం చాలా శ్రేయస్కరం.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺