ఉన్నంతకాలం సంతోషంగా బ్రతకాలి అని..
ఎలాగండి అన్నాను.
సమాధానం చెప్పలేదు.
ప్రస్తుతం సంతోషంగా అంటే విచ్చలవిడిగా తిరిగినా ఎవరు ఏమనకుండా ఉంటే సంతోషం.. పోనీ ఎల్లకాలం ఉంటుందా అంటే ఎప్పుడూ ఏదో ఒక వికారం, అశాంతి, అనారోగ్యం. మరి సంతోషం ఎక్కడుంది?
సంతోషం బయట ప్రపంచ వ్యవహారాలలో లేదు. నీలోనే ఉంది అంతరాత్మలో..
జననం అంటే రావడం.
చనిపోవడం అంటే చని=వెళ్లి , పోవడం.. వెళ్లిపోవడం.
ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్లడం? ఎక్కడో చోట ఉండబట్టే ఇక్కడికి వచ్చాము కదా. ఆ ఎక్కడో ఎక్కడ? ఇది తెలుసుకుంటే మనం ఇక్కడికి ఎందుకొచ్చామో అర్థమవుతుంది. ఆనందం మిగులుతుంది మినగా బయటి ప్రపంచంలో ఎన్ని వ్యవహారాలు చక్కదిద్దినా మరొకటి ఉంటూనే ఉంటుంది. ఎన్ని కోర్కెలు తీర్చుకున్న ఏదో ఒక కోరిక పుడుతూనే ఉంటుంది? వీటిని తీర్చుకుంటూ పోవడమేనా సంతోషం అంటే!
నువ్ ఇక్కడికి ఓ పనిమీద వచ్చావ్.అది ఏదో తెలుసుకోవాలి. తెలుసుకొని పూర్తి చేయాలి. ఇది తెలుసుకోవడానికి ఉన్న అడ్డంకులు తొలగించి ముందుకుసాగాలి. ఇది జీవిత పరమార్థం.. నువ్వేమి అనామకుడివి అర్భకుడివి కాదు. మహత్తరమైన శక్తివి. దానిని తెలుసుకో.. వచ్చిన కార్యం ముగించుము.
Nice..
ReplyDeleteNice..
ReplyDelete