Skip to main content

చరిత్రలో ఈరోజు... అక్టోబర్ 1

అక్టోబరు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 274వ రోజు (లీపు సంవత్సరములో 275వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 91 రోజులు మిగిలినవి.
సంఘటనలు 
1953: కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ.
1958: భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబర్ 1958 న ప్రవేశ పెట్టారు. డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్) ) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.
1982 తొలి CD ప్లేయర్ ను సోని లాంచ్ చేసింది.
1984 : బజరంగ్ దళ్ అనేది ఒక హిందూ మత సంస్థ. బజరంగ్ దళ్ స్థాపన.
1997: జనరల్ వి.పి. మాలిక్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
2000: జనరల్ ఎస్.ఆర్. పద్మనాభన్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

జననాలు 
1847: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933)
1862: రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939)
1890: అంకితం వెంకట భానోజీరావు, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కింగ్ జార్జి ఆసుపత్రుల నిర్మాణానికి భూమిని దానం చేసిన వితరణశీలి.
1908: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974)
1915: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (మ.2013)
1921: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (మ.1974)
1922: అల్లు రామలింగయ్య, హాస్య నటుడు. (మ.2004)
1934: భువన్ చంద్ర ఖండూరి, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
1934: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్త. (మ.2014)
1939: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015)
1942: బోయ జంగయ్య, రచయిత. (మ.2016)
1951: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (మ.2002)
1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు
1901: ప్రతాప్ సింగ్ ఖైరాన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.

మరణాలు
ఆదుర్తి సుబ్బారావు
1939: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (జ.1784)
1946: గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. (జ.1902)
1975: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత. (జ.1912)
1979: పి.వి.రాజమన్నార్, న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (జ.1901)

పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచ శాఖాహార దినోత్సవం
ప్రపంచ వృద్ధుల దినోత్సవం .
జాతీయ రక్తదాన దినోత్సవం.
సైప్రస్, నైజీరియా, తువాలు, పలౌ స్వాతంత్య్ర దినోత్సవం.
ప్రపంచ ఆవాస దినోత్సవం.
స్వచ్ఛంద రక్తదాన దినం.
అంతర్జాతీయ సంగీత దినం.

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...

చేయూత వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది వారితో కలిసి... జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం... గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా... ఈ ఏడాది కూడా... ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది... వివరాల్లోకి వెళితే... ఇద్దరు ఒంటరి మహిళలు.. ఇద్దరు వితంతువులు... ఇద్దరిది చిన్న వయసు... ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ... అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ... ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు... మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి... ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే.... మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు.. వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు... ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం... ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది... ఒకరుగా చేయలేం... కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే... ఒకటిగా చేయగలం... ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపా...

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...