Skip to main content

నేటి మోటివేషన్... positive attitude తో ఉండండి...



పందెం గెలిచిన గుర్రాన్ని అమ్మడానికి వేటగాడు సంతకు వెళ్ళాడు. బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. బూట్లిచ్చేమో టోపి తీసుకున్నాడు. ..ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యోపాపం అని బాధపడ్డారు. "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు. పెళ్ళాంతో బడితపూజ " తప్పదన్నాడింకోకడు." నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువులు వేటగాడింటికి వెళ్ళారు. 

వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా! వచ్చినావా అంది ఆప్యాయంగా, వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు.

భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు

"వేటగాడు : "ఆవు కూడా గాడిదకు మారకం వేశా"

భార్య : "కట్టెలు అడివినుంచి మోసుకు వస్తుందిలే" అంది తృప్తిగా.

వేటగాడు : "గాడిదను అమ్మేసి చెప్పులు తీసుకొన్నా"..

భార్య : "అడవుల్లో రాళ్లు, రప్పలు తగలకుండా ఉంటుందిలే మావా"వేటగాడు : "అవి కూడా ఉంచుకో లేక టోపీకి మారకం వేసినా"

భార్య : "సరేలే మావా ఆ టోపితో అందంగా ఉంటావు"

వేటగాడు : "కానీ వస్తావుంటే నేను వంతెన మీద పడితే టోపి జారి నీళ్లలో పడ్డది"..

భార్య : "పోతే పోయిందిలే మావా! నీవు పడిపోకుండా వున్నావు, అంతా అడవి తల్లి దయ" అని తృప్తిగా ముద్దు పెట్టుకుంది. 

నేడు ఇలాంటి సంభాషణ వినగలమా! "ప్రస్తుతం మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార బంధాలే " 

కన్ను చెదిరితే, గురి మాత్రమే తప్పుతుంది.. మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పు తుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రు లకు కృతజ్ఞతలు చెప్పు  నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు  చెప్పు ఏ ఓక్కరిని తోందర పడి ఎం అనకండి మనల్ని ఎగతాళి చేసేవారికి కాలం సమాధానం చేప్పే తీరతుంది..కరుగుతున్న క్షణానికి జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే ‌. "మంచితనం" అదే మనకు ఆభరణం .

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🍀🍀🍀🍀

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...

చేయూత వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది వారితో కలిసి... జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం... గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా... ఈ ఏడాది కూడా... ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది... వివరాల్లోకి వెళితే... ఇద్దరు ఒంటరి మహిళలు.. ఇద్దరు వితంతువులు... ఇద్దరిది చిన్న వయసు... ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ... అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ... ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు... మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి... ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే.... మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు.. వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు... ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం... ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది... ఒకరుగా చేయలేం... కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే... ఒకటిగా చేయగలం... ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపా...

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...