Skip to main content

నేటి మోటివేషన్... తెలుసా నీకు ఆ ఒక్క క్షణం ఎంత విలువైనదో...

ఈ క్షణం సాక్షిగా… 


ఈ క్షణం మరుక్షణంతో ఆక్రమించేయబడుతుంది… అలాగని అది తన ఉనికిని కోల్పోదు…  ఓ ఆలోచనో, భావనో, నిర్ణయమో మరుసటి క్షణానికి మోసుకెళ్లడం ద్వారా అది సజీవంగానే ఉంటుంది..

సంవత్సరాల ప్రమాణంలో జీవితాన్నీ, వయస్సునీ కొలవడం మానేసి క్షణాల మెజర్‌మెంట్‌లో పరిగణనలోకి తీసుకుంటే జీవిత గమనంపై పూర్తి నియంత్రణ మనకు దక్కుతుంది.

ఈ క్షణాన్ని భారంగా మార్చేసిన గతించిన క్షణాలూ.. రాబోయే క్షణాల్ని కబళించే ఈ క్షణపు ఆలోచనలూ… ఈ ఘర్షణలో శుష్కించిపోతున్న ప్రస్తుత క్షణపు నిస్సహాయతా… ఇదే మనం అనుకుంటున్న వందేళ్ల జీవితం 🙂

జీవితాన్ని అర్థం చేసుకోవడానికీ… సరిచేసుకోవడానికీ స్థూల (macro level) దృష్టే కాదు… కొన్ని సందర్భాల్లో సూక్ష్మ (micro level) దృష్టీ చాలా అవసరం.. "ఆ ఏముందిలే.." అని దులపరించుకుని వేరే ఆలోచనలోకి వెళ్లిపోయిన ఎన్నో సంఘటనలు స్పష్టంగా మన "ఈ క్షణాన్ని" ప్రభావితం చేస్తున్నాయని ఒక్కోసారి గ్రహింపుకీ వస్తుంది…. అలా అన్పించినప్పుడు "ఆలోచించలేకపోయానే" అనే ఓ చిన్న గిల్టీఫీల్‌తో సాగిపోతాం తప్ప అక్కడైనా ఒక్క క్షణం ఆగి ఆలోచించడానికి తీరిక చేసుకోం.

ఇప్పుడు లైఫ్ అంటే 50 ఏళ్లల్లో సాధించాల్సినవన్నీ ఇరవై, పాతికేళ్లలోపు ఫోర్లతో, సిక్సర్లతో దక్కించుకోవడం.

ఈ వేగంలో "క్షణం" అనేది కొట్టుకుపోయింది… పది నిముషాలు తెలుగు కూడబలుక్కుని ఇదంతా చదవాలన్నా "బోర్" వచ్చేస్తుంది 🙂

క్షణం వృధా కాకూడదు… క్షణం తీరిక లేదు.. జీవితం గురించి ఏవేవో ఆలోచనలు అస్సలు అవసరం లేదు… లైఫ్ గోల్స్ సాధించడానికి అవసరం అయిన ఆలోచనలు మాత్రమే చాలు…  ఇది మన స్ట్రేటజీ!! కొంతవరకూ ఇది మంచి ఫలితాలే ఇస్తుంది…

అయితే ఈ క్షణం ఓపిక పట్టలేకపోయినందువల్లా, ఈ క్షణం ఆగి ఆలోచించలేకపోయినందు వల్లా, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయినందు వల్లా, పరుగులు పెడుతూ పోతున్నందువల్లా… ఏర్పడే నష్టాలు, వచ్చే కష్టాలూ కూడా ఈ మన జీవితంలో అనుభవించవలసినవే. సాధించినంతసేపూ అంతా బానే ఉంటుంది. ఒంటరిగా, దిగాలుగా, శూన్యంగా కూర్చున్నప్పుడే క్షణం ఎంత ముఖ్యమో స్ఫురణకు వస్తుంది.

క్షణం నిర్వీర్యం కాకూడదు… క్షణం ఓవర్‌లుక్ చేయబడకూడదు.. క్షణం ఏదోలా గడిపేయబడకూడదు… క్షణకాలంలో ఎదుటి వ్యక్తి కళ్లల్లో కన్పించే ఆప్యాయత మెమరీలో నుండి చెరిపేయబడకూడదు..

ప్రేమైనా, అభిమానమైనా, ఆత్మీయతైనా full extent ఆ ఒక్క క్షణంలోనే మనల్ని మైమరిపింపజేస్తాయి… ఆ క్షణపు అనుభూతి మెల్లగా డైల్యూట్ అయిన మరుక్షణం లాజిక్ ఆ అనుభూతిని ఎనలైజ్ చేయడం మొదలెడుతుంది. లాజిక్‌నీ, ఆ క్షణిక అనుభూతుల్నీ వేరుచేసి ఆస్వాదించే నేర్పు కొరవడినప్పుడు జీవితం చప్పగా ఉంటుంది.

అందుకే క్షణాలతో జీవితాల్ని నిర్మించుకోవాలి తప్ప… ప్రతీ క్షణాన్నీ, ఆ క్షణపు ఆలోచనల్నీ, మానసిక స్థితినీ ఓ కంట కనిపెడుతూ సాగుతుండాలి తప్ప… మనది కాని జీవితాన్ని ఏదోలా బ్రతికేస్తూ పోతున్నట్లు క్షణాల్ని గంటలుగా, రోజులుగా, సంవత్సరాలుగా మార్చేసి ముగించేసేది కాదు జీవితం.

గమనిక: ఇది ఎవరికైనా ఆలోచన రేకెత్తిస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

Ap government 2025 job calendar...

Click here to get job calendar  లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము...  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺