Skip to main content

నేటి మోటివేషన్... నువ్వేం చేస్తే అదే నీకు తిరిగివస్తుంది


ఒక రాజు..తన ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రులను పిలిపించి..వారికి ఒక్కొక్క ఖాళీ గోనె బస్తా బ్యాగ్ లను చేతికిచ్చి..అరణ్యంలోనికెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు,ఫలాలను అందులో నింపి..సాయంత్రం లోపు తీసుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు...

ముగ్గురూ అరణ్యం లోనికెళ్లారు....

మొదటి మంత్రి ఆలోచించాడు...
రాజు గారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండిఉండాలి,కనుక మంచి పండ్లు తీసుకు వెళ్ళాలి,
అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు.

రెండో మంత్రి ఆలోచన
రాజు గారికి పండ్లకి కొదవ లేదు...
అయినా మాకు పంపారు..
సరే ఏదోలా బస్తా నింపేస్తే చాలు.
.అనుకుంటూ కంటికి కనిపించిన పండ్లు తాజా,వాడిన,పుచ్చిన భేదభావం లేకుండా నింపసాగాడు.

ఇక మూడో మంత్రిచాలా చతురంగాఆలోచించాడు..
రాజు గారికి చాలా పనులు..
పండ్ల అవసరం అతనికి లేదు.,
పై పైన చూస్తే చూడొచ్చు.బస్తా ఖాళీచేసి చూసే సమయం కూడా ఉండదు..
చూడనిదానికి కష్టపడి అడివంతా తిరగాల్సిన అవసరం ఏముంది..
అనుకుంటూ ఆకులు అలములతో బస్తానింపి..పైన కొన్ని పండ్లతో అలంకరించేసాడు..

సాయంత్రం ముగ్గురూ పండ్ల బస్తాలు తీసుకుని రాజుగారి ముందు హాజరయ్యారు.

మూడో మంత్రి ఊహించినట్లే..
రాజు గారు చాలా పనుల్లో తలమునకలై ఉన్నారు..
కనీసం బస్తాలు వంక చూడనైనా చూడకుండా సైనికులను ఆదేశించారు.
"ఈ ముగ్గురినీ చెరసాలలో నెల రోజుల పాటు వారి పండ్ల బస్తాలతో పాటు బంధించండి.
తినడానికి ఏమి ఇయ్యరాదు..
వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం"

ముగ్గురిని చెరసాలలో బంధించారు..

మొదటి మంత్రి.. చక్కని తాజా పండ్లు మూలంగా ఎలాంటి ఆకలిబాధలు లేకుండా శిక్షాకాలం పూర్తిచేసి తిరిగి ఆస్థానానికి చేరుకున్నాడు.

రెండవ మంత్రి.. కొన్నిరోజుల వరకు బాగానే తిన్నా..కుళ్ళిన,వాడిన పండ్లు మిగతా రోజుల్లో తిని తీవ్ర అస్వస్థతకు గురై మంచాన పడ్డాడు..శాశ్వతంగా.

మూడవ మంత్రి.. పైపైన అలంకరించిన పండ్లతో 2 రోజులు గడిపి..ఆకులు,
అలములు తో మరో వారం పాటు మాత్రమే గడిపి..పైలోక యాత్రకు వెళ్ళిపోయాడు శిక్షాకాలం ముగిసే లో....

కర్మ :మనం చేసిన పనులకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది..
మంచి కర్మలకి మంచి,
చెడు/పాప కర్మలకు చెడు పర్యవసానాలు తప్పవు...

1000 గోవుల మంద ఉన్నా..
దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా పోగలదో..
మంచి,చెడు కర్మలు కూడా అలానే మనల్ని వెదుక్కుంటూ వచ్చేస్తాయి.

కర్మ సిద్ధాంతం పనిచేసే తీరు ఇదే....

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Teachers day

https://drive.google.com/file/d/1j6D1j7NedC_wcJPP3HBEHfoppXrRE8la/view?usp=drivesdk https://drive.google.com/file/d/1kKNR6ew3Xlaapsy5FRfibB5iiCW0SCDw/view?usp=drivesdk https://drive.google.com/file/d/1m9J50vHSuDwNBhi5NBvJv_p40i5Ri1ww/view?usp=drivesdk https://drive.google.com/file/d/1u2HW7U8pxyM38lFL--pr_nfz0L0UHuZO/view?usp=drivesdk https://drive.google.com/file/d/1cdpTBMQMFFGroWtx9h7jY1tToGNrt099/view?usp=drivesdk Lakshya Educational Groups

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...