Skip to main content

లేటెస్ట్ కరెంట్ అఫైర్స్....



💉 ప్రాణాంతక కొవిడ్‌ మహమ్మారిపై పోరాడే కీలక ఆయుధాన్ని రష్యా ఆవిష్కరించింది.

💉 ఈ మహమ్మారి నివారణకు మొట్టమొదటిసారిగా టీకాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు.

💉 1957లో సోవియట్‌ యూనియన్‌ ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరిట ఈ టీకాకు ‘స్పుత్నిక్‌-వి’ అని నామకరణం చేశారు.

💉 స్పుత్నిక్‌-వి టీకాను గమలేయా పరిశోధన సంస్థ, బినోఫార్మ్‌ ఉత్పత్తి చేస్తాయని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్‌ మురాష్కో తెలిపారు.

💉  ఈ టీకా 2021 జనవరి 1 నుంచి పౌరులకు అందుబాటులోకి వస్తుందని రష్యా ‘స్టేట్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌’ వెబ్‌సైట్‌ పేర్కొంది.

💉 ఈ టీకాను గామలేయ పరిశోధన సంస్థ, రష్యా రక్షణ మంత్రిత్వశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

💉 రెండేళ్ల వరకూ కరోనా నుంచి రక్షణ లభిస్తుందని రష్యా ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

👨‍⚖ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తులకు కుమారులతో పాటు కుమార్తెలు కూడా సమాన హక్కుదారులేనని సుప్రీంకోర్టు విస్పష్టం చేసింది.

👨‍⚖ హిందూ వారసత్వ (సవరణ) చట్టం-2005’ అమల్లోకి రావడానికి ముందు నుంచీ ఇది వర్తిస్తుందని తీర్పునిచ్చింది. 

👨‍⚖ 2005, సెప్టెంబరు 9కి ముందు పుట్టిన కుమార్తెలూ అవిభాజ్య కుటుంబ ఆస్తులకు సమాన హక్కుదారులేనని పేర్కొంది.

👨‍⚖ అవిభక్త హిందూ కుటుంబంలో జన్మించిన కుమార్తెలకు పూర్వీకుల ఆస్తుల్లో సమానత్వ హక్కును కల్పిస్తూ... 1956 నాటి హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌-6కు 2005లో ప్రభుత్వం సవరణలు చేపట్టింది

👨‍⚖ కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ‘‘కుమారులతో పాటు కుమార్తెలకూ వారసత్వ ఆస్తిలో సమాన హక్కులను ప్రభుత్వం కల్పించింది. ఈ విషయంలో వారిని దూరం చేయడం వివక్షకు, అణచివేతకు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు దరితీస్తుంది. పుట్టుక ద్వారా కుమార్తెలకు వారసత్వ హక్కు లభించవచ్చు. కానీ, వారసత్వ హక్కు అనేది జన్మహక్కు’’ అని ఆయన పేర్కొన్నారు.

💧 తెలంగాణలో గతంలో భారీ, మధ్యతరహా, చిన్న తరహా, ఐడీసీ లాంటి వివిధ విభాగాల కింద ఉన్న నీటి పారుదల శాఖ ఇకపై జల వనరుల శాఖగా మాత్రమే కొనసాగనుంది.

💧 మెదక్‌ జిల్లాలోని ఘనపూర్‌ ఆనకట్టకు వనదుర్గ ప్రాజెక్టుగా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

💸 ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో అగ్రగామి 100 కంపెనీల్లోకి చేరింది

💸 2020 సంవత్సర ర్యాంకుల్లో కంపెనీ 96వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో ఏ భారత కంపెనీకైనా ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం గమనార్హం.

💸 2012లో రిలయన్స్‌ తొలి సారిగా టాప్‌-100లోకి చేరింది. అపుడు కంపెనీ 99వ ర్యాంకు సాధించింది.

💸 ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) 34 స్థానాలు తగ్గి 151వ ర్యాంకుకు; ఓఎన్‌జీసీ 30 ర్యాంకులు కోల్పోయి 190వ స్థానానికి పరిమితమయ్యాయి

💸 ఇక ఎస్‌బీఐ మాత్రం 21 స్థానాలు మెరుగుపరచుకుని 221వ ర్యాంకును సాధించింది

💸 రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనింగ్‌, పెట్రో రసాయనాల వ్యాపారంలో వాటాను 1500 కోట్ల డాలర్లతో కొనుగోలు చేయడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు సౌదీ ఆరామ్‌కో ప్రకటించింది.

🎞  చిత్రం:  గుంజన్‌ సక్సేనా:ది కార్గిల్‌ గర్ల్‌

🎞 నటీనటులు: జాన్వీ కపూర్‌, పంకజ్‌ త్రిపాఠి

🎞 ది కార్గిల్‌ గర్ల్‌గా పేరొందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కినది ఈ చిత్రం.

🎞 దర్శకత్వం : శరణ్‌ శర్మ

🛩 సుఖోయ్‌ యుద్ధ విమానాల పేరుచెబితే శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి..అలాంటి ప్రతిష్ఠాత్మక యుద్ధవిమానాలకి.. వెపన్‌సిస్టమ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపడుతోంది తేజస్విని.

🛩 ఇదేమంత తేలికైన బాధ్యత కాదు. ఇంతవరకూ అమెరికా, బ్రిటన్‌వంటి దేశాలు మాత్రమే మహిళలని ఈ స్థాయిలో ఆఫీసర్‌గా నియమించాయి

🛩 ఆ తర్వాత మనదేశం నుంచి ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్న మొదటి మహిళ తేజస్వినీ రంగారావు. ఆమె స్వస్థలం చెన్నై.

🛩 సుఖోయ్‌ వంటి యుద్ధవిమానాలు చేసే యుద్ధవిన్యాసాలని నిర్వహించేందుకు పైలట్లు కాకుండా ప్రత్యేకంగా వెపన్‌ సిస్టమ్‌ అధికారులు ఉంటారు. వాళ్లనే విజో అంటారు..

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...

చేయూత వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది వారితో కలిసి... జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం... గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా... ఈ ఏడాది కూడా... ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది... వివరాల్లోకి వెళితే... ఇద్దరు ఒంటరి మహిళలు.. ఇద్దరు వితంతువులు... ఇద్దరిది చిన్న వయసు... ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ... అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ... ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు... మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి... ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే.... మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు.. వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు... ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం... ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది... ఒకరుగా చేయలేం... కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే... ఒకటిగా చేయగలం... ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపా...

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...