Skip to main content

కరెంట్ అఫైర్స్ - 20.08.2020 తెలుగులో..


✍ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో విప్లవాత్మక సంస్కరణకు ఎన్డీయే సర్కారు నడుం బిగించింది.

✍ ఒకే దేశం - ఒకే పరీక్ష అనే రీతిలో కేంద్రంలోని వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీ కోసం ‘జాతీయ నియామకాల సంస్థ’ (నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ- ఎన్‌ఆర్‌ఏ)ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది.

✍ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది.

✍ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి - జితేంద్రసింగ్‌

✍ ఎన్‌ఆర్‌ఏ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వంలోని 20 నియామక సంస్థలను తీసుకొస్తారు.

✍ ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించే స్కోర్‌ మూడేళ్లు చెల్లుబాటవుతుంది. స్కోర్‌ పెంచుకోవడానికి అభ్యర్థులు మళ్లీమళ్లీ పరీక్షలు రాయొచ్చు. అత్యుత్తమ స్కోర్‌నే పరిగణనలో తీసుకుంటారు.

✍ ఎన్‌ఆర్‌ఏను స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేస్తారు. ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారి ఉంటారు. పాలకమండలిలో ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

✍ అన్ని ప్రాథమిక పరీక్షలకూ ఒకే సిలబస్‌ ఉంటుంది.ఉమ్మడి రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తారు.

✍ ప్రస్తుతం 12 భాషల్లో పరీక్ష జరుగుతుంది. తర్వాత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న భారతీయ భాషలన్నింటిలో నిర్వహిస్తారు.

📃 కొవిడ్‌ సంక్షోభం కారణంగా జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాదిలోనే జరగనుంది.

📃 ఈ ఏడాది ఇళ్లు, కట్టడాలు, కుటుంబ వివరాలతో ‘జాతీయ జనాభా రిజిస్టర్‌’(ఎన్‌పీఆర్‌) నమోదు పూర్తిచేయాల్సి ఉంది.

📃 కానీ, లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్‌పీఆర్‌ నమోదులో భాగంగా దేశంలోని అన్ని జననివాస ప్రాంతాలను గతేడాది(2019) డిసెంబరు 31 నాటికి జనాభా లెక్కల విభాగం అధికారికంగా గుర్తించింది.

👨‍💼 సీఐసీ లేదా కమిషనర్‌గా నియమితులైన వారు ఐదేళ్లపాటు ఆ పదవిలో ఉంటారు. ఈలోగానే వారికి 65 ఏళ్లు నిండితే పదవీ విరమణ చేయాలి.

👨‍💼 రాజా సదారాం తెలంగాణ సీఐసీగా నియమితులై మూడేళ్లే అయినప్పటికీ ఆయనకు ఈ నెల 24తో 65 ఏళ్లు నిండుతున్నందున పదవీ విరమణ చేయనున్నారు.

👨‍💼 సీఐసీ పోస్టు కోసం పలువురు విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, అధికార పార్టీ నేతలు, ప్రముఖులు పోటీపడుతున్నారు.

👨‍💼 సహ చట్టం కింద 9 మంది కమిషనర్లను, సీఐసీని నియమించాలి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ మొత్తం పోస్టులు ఎప్పుడూ భర్తీచేయలేదు.

👨‍💼 రాష్ట్రం ఏర్పడ్డాక రెండేళ్లకు సదారాంను సీఐసీగా బుద్దా మురళిని కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.

🇺🇸 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్‌ను డెమోక్రాట్లు అధికారికంగా నిర్ణయించారు.

🇺🇸 ఆ పార్టీకి చెందిన అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జిమ్మీ కార్టర్‌తో పాటు విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి జాన్‌ కెర్రీ, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కొలిన్‌ పావెల్‌ తదితరులు బైడెన్‌కు మద్దతు తెలిపారు.

🇺🇸 77 ఏళ్ల బైడెన్‌ నవంబరు 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తలపడతారు.

🇺🇸 ట్రంప్‌ను తమ అభ్యర్థిగా  రిపబ్లికన్‌ పార్టీ త్వరలో లాంఛనప్రాయంగా ప్రకటించనుంది.

🇺🇸 2016 జనగణన ప్రకారం అమెరికాలో హిందువుల జనాభా ఒక శాతంగా ఉంది.

🇺🇸 మత స్వేచ్ఛకున్న అవరోధాలను తొలగిస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ శిబిరం వాగ్దానం చేస్తుండగా.. భారత దేశ మూలాలున్న కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థినిగా ప్రకటించి హిందువులకు దగ్గరయ్యేందుకు బైడెన్‌ వర్గం యత్నిస్తోంది.

🇺🇸 ధార్మిక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేస్తామని హామీ ఇస్తోంది.

👉 టెక్‌ దిగ్గజం యాపిల్‌ చరిత్ర సృష్టించింది. 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన మొట్టమొదటి అమెరికా సంస్థగా అవతరించింది.

👉 లక్ష కోట్ల డాలర్ల సంస్థగా మారిన రెండేళ్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ ఏడాదిలో యాపిల్‌ షేర్లు దాదాపు 60 శాతం దూసుకెళ్లడమే దీనికి ప్రధాన కారణం.

👉 2019 డిసెంబరులో పబ్లిక్‌ కంపెనీగా మారిన కొద్ది రోజుల్లోనే సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ అరామ్‌కో 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువను సాధించింది.

✈️ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని జయపుర, గువాహటి, తిరువనంతపురం ఎయిర్‌పోర్టులను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు 50 ఏళ్లకాలానికి లీజుకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

✈️ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోద ముద్ర వేసింది.

✈️ ఇప్పటికే ఆ సంస్థకు అప్పగించిన అహ్మదాబాద్‌, లఖ్‌నవూ, మంగళూరులతో కలిపితే తొలిదశలో ప్రైవేటీకరించిన ఆరు ఎయిర్‌పోర్టులూ అదానీకే దక్కినట్లయింది.

🌷 ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టై) హైదరాబాద్  విభాగం అతి పెద్ద వర్చువల్‌ ప్రపంచ సదస్సును నిర్వహించబోతోంది.

🌷 డిసెంబరు 8 నుంచి 10 వరకూ జరిగే ఈ సదస్సును భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది.

🌷 కెనడా, యూకే తదితర దేశాల ప్రధానులు హాజరవుతారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20వేల మంది పారిశ్రామికవేత్తలు, రెండు వందలకు పైగా పెట్టుబడిదారులు, పది మంది ప్రపంచ నాయకులు, 50 మందికి పైగా ప్రముఖ వక్తలు, క్రీడాకారులు, ఆధ్యాత్మిక, ఆరోగ్య గురువులు ఈ సదస్సులో మాట్లాడనున్నారు.

🌷 అమెరికా, ఐరోపా, భారత్‌, ఆసియా ఫసిఫిక్‌ దేశాల నుంచి మొత్తం 25 టై విభాగాలు ఇందులో పాల్గొంటాయి.

🌷 కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌ ద్వారా ‘టై గ్లోబల్‌ సమ్మిట్‌ 2020’ని టై నిర్వహిస్తోంది. ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ 360’ అనే భావనతో తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్న ఈ సదస్సు హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతుంది.

🏏 ఫాంటసీ గేమింగ్‌ వేదిక డ్రీమ్‌ 11 ఈ ఏడాదికి ఐపీఎల్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

🏏 రూ.222 కోట్ల బిడ్‌తో నాలుగు నెలల 13 రోజులకు డ్రీమ్‌ 11 ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులను గెలుచుకుంది.

🏏 సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో 2020 సంవత్సరానికి టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని వివో, బీసీసీఐ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లించేది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...

చేయూత వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది వారితో కలిసి... జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం... గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా... ఈ ఏడాది కూడా... ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది... వివరాల్లోకి వెళితే... ఇద్దరు ఒంటరి మహిళలు.. ఇద్దరు వితంతువులు... ఇద్దరిది చిన్న వయసు... ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ... అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ... ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు... మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి... ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే.... మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు.. వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు... ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం... ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది... ఒకరుగా చేయలేం... కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే... ఒకటిగా చేయగలం... ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపా...

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...