Skip to main content

ఈరోజు కరెంట్ అఫైర్స్ - 19.08.2020

                  
👨‍🏫 కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన అటల్‌ ర్యాంకింగ్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆన్‌ ఇన్నోవేషన్‌ అచీవ్‌మెంట్స్‌ (ఏఆర్‌ఐఐఏ)లో ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ -మద్రాస్‌’(ఐఐటీఎం)కు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం దక్కింది.

👨‍🏫 ఐఐటీ బాంబే రెండో స్థానంలో..ఐఐటీ దిల్లీ మూడో స్థానంలో నిలిచాయి.

👨‍🏫 తెలంగాణలోని 30 విద్యాసంస్థలకు కూడా స్థానం దక్కింది.

👨‍🏫 జాతీయ ప్రాధాన్యమున్న విద్యాసంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల   విభాగంలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) 10వ ర్యాంకు సాధించింది.

👨‍🏫 ప్రభుత్వ, ప్రభుత్వ సాయంతో నడిచే యూనివర్సిటీల్లో 1st : ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ-మహారాష్ట్ర

👨‍🏫 ప్రభుత్వం, ప్రభుత్వ సాయంతో నడిచే కళాశాలలు/ సంస్థలు 1st : కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ పుణే- మహారాష్ట్ర

👨‍🏫 ప్రైవేట్‌/సెల్ఫ్‌ ఫైనాన్స్డ్‌ కాలేజ్‌/ఇన్‌స్టిట్యూట్స్‌ 1st : ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల- తెలంగాణ

👨‍🏫 ప్రైవేటు/సెల్ఫ్‌ ఫైనాన్స్డ్‌ యూనివర్సిటీ 1st : కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఒడిశా

👉 తెలంగాణకు ఎరువుల కోటాను పెంచాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

🇮🇳 పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు.

🇮🇳 దేశ విభజన జరిగినప్పుడు హిందువులు ఎక్కువగా ఉన్న ఈ సరిహద్దు జిల్లాను బ్రిటిష్‌ ప్రభుత్వం పాకిస్థాన్‌లో కలిపింది.

🇮🇳 దానిపై ఆందోళనలు చెలరేగడంతో 1947 ఆగస్టు 18న తిరిగి భారత్‌లో కలిపారు. ఆరోజునే వారు స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నారు.

🇲🇱 పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో సైనికులు తిరుగుబాటు చేశారు. అధ్యక్షుడు ఇబ్రహీం బూబకర్‌ కైత నివాసాన్ని చుట్టుముట్టి ఆయనను, ప్రధాని బూబూ సిస్సేను బంధించారు.

🇲🇱 ఇబ్రహీం అధికారం నుంచి వైదొలగాలని దేశంలో కొన్ని నెలలుగా ప్రజాందోళనలు జరుగుతున్నాయి.

🇲🇱 మాలి రాజధాని బమాకోకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక పట్టణమైన కతిలో అశాంతి రగులుకుంది.

👨‍💼 కేంద్ర ఎన్నికల కమిషన్‌లో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసా రాజీనామా చేశారు.

👨‍💼 ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆయన వచ్చే నెలలో ఆ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు.

👨‍💼 రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు తన రాజీనామా సమర్పించారు.

👨‍💼 ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సునీల్‌ అరోడా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేసిన తర్వాత ఆ బాధ్యలు  చేపట్టే అవకాశం లవాసాకు ఉన్నప్పటికీ ఆయన ఆ అవకాశాన్ని వదులుకున్నారు.

👨‍💼 దీంతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న సుశీల్‌ చంద్రకు సునీల్‌ అరోడా తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కింది.

👨‍💼 2022 అక్టోబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా పదవీ విరమణ చేసే అవకాశం ఉన్నప్పటికీ అశోక్‌ లవాసా ముందే పదవీత్యాగం చేసి గడువు ముగియకముందే పదవి వదులుకున్న రెండో కమిషనర్‌గా రికార్డులకెక్కారు.

👨‍💼 1973లో కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నాగేంద్రసింగ్‌ ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌లో న్యాయమూర్తిగా నియమితులు కావడంతో ముందే తన పదవికి రాజీనామా చేశారు.

👨‍💼 అశోక్‌లవాసా కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత 2018 జనవరిలో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు.

🎖 క్రీడాకారుల పంట పండింది. ఊహించని విధంగా అత్యధిక మందికి ఈసారి అవార్డులు సొంతం కానున్నాయి.

🎖 అసాధారణ రీతిలో ఐదుగురు ఖేల్‌రత్నకు ఎంపికయ్యారు.

🎖 సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి ముకుందకం శర్మ నేతృత్వంలోని పన్నెండు మంది సభ్యుల కమిటీ.. రోహిత్‌శర్మ (క్రికెట్‌), వినేశ్‌ ఫొగాట్‌ (రెజ్లింగ్‌), రాణి రాంపాల్‌ (హాకీ), మనిక బాత్రా (టీటీ), మరియప్పన్‌ తంగవేలు (పారాలింపిక్స్‌) పేర్లను ప్రతిపాదించింది.

🎖 మిగతా అవార్డులకు ఎక్కువ మంది పేర్లను సిఫార్సు చేసింది.

🎖 ఖేల్‌రత్న కోసం సాధారణంగా ఏడాదికి ఒకరిని లేదా ఇద్దరిని మాత్రమే ఎంపిక చేస్తారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ తర్వాత ముగ్గురికి, 2016 రియో ఒలింపిక్స్‌ తర్వాత అత్యధికంగా నలుగురికి ఖేల్‌రత్న దక్కింది.

🎖 స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌శర్మ, రెజ్లింగ్‌ ఛాంప్‌ వినేశ్‌ ఫొగాట్‌, మహిళల హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌, టీటీ కెరటం మనిక బాత్రా, రియో పారాలింపిక్స్‌లో హైజంప్‌లో పసిడి గెలిచిన మరియప్పన్‌ తంగవేలు క్రీడల శాఖకు అందజేసిన జాబితాలో ఉన్నారు.

🎖 మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌సింగ్‌, మాజీ పారా అథ్లెట్‌ దీపా మలిక్‌ తదితరులు కమిటీలో సభ్యులు. అర్జున అవార్డు కోసం 29 మంది క్రీడాకారులతో కమిటీ జాబితాను సిద్ధం చేసింది. ద్రోణాచార్యను 13 మందికి, ధ్యాన్‌చంద్‌

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Teachers day

https://drive.google.com/file/d/1j6D1j7NedC_wcJPP3HBEHfoppXrRE8la/view?usp=drivesdk https://drive.google.com/file/d/1kKNR6ew3Xlaapsy5FRfibB5iiCW0SCDw/view?usp=drivesdk https://drive.google.com/file/d/1m9J50vHSuDwNBhi5NBvJv_p40i5Ri1ww/view?usp=drivesdk https://drive.google.com/file/d/1u2HW7U8pxyM38lFL--pr_nfz0L0UHuZO/view?usp=drivesdk https://drive.google.com/file/d/1cdpTBMQMFFGroWtx9h7jY1tToGNrt099/view?usp=drivesdk Lakshya Educational Groups

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...