🌷 కేంద్రప్రభుత్వం 2020 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా హైదరాబాద్ మలక్‌పేటలోని నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయిని పద్మప్రియను ఎంపిక చేసింది.
🌷 దేశవ్యాప్తంగా 47 మందికి పురస్కారాలు ప్రకటించగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఆమె ఒక్కరే ఎంపిక కావడం విశేషం. ఆమె స్వస్థలం నల్గొండ జిల్లా.
🌷 ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ పాఠశాల ఉపాధ్యాయుడు అసపాన మధుబాబు కూడా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.
🔋 తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగానికి జలవిద్యుత్ ఆయువుపట్టు కాగా...ఆ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో శ్రీశైలం ప్రాజెక్టుదే ప్రధాన పాత్ర.
🔋 అత్యంత చౌకగా విద్యుత్‌ను అందిస్తున్న జలవిద్యుత్కేంద్రాలు ఏటా రూ.వందల కోట్లు ఆదా చేస్తూ ఎంతో ఆదుకుంటున్నాయి.
🔋 రాష్ట్రంలో 11 చోట్ల ఉన్న జలవిద్యుత్కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 2441.80 మెగావాట్లు.
🔋 ఇందులో శ్రీశైలం 900, నాగార్జునసాగర్ 815.60 మెగావాట్లతో 70.25 శాతం ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. 11 జలవిద్యుత్కేంద్రాలున్నా విద్యుదుత్పత్తి అధికంగా జరిగేది శ్రీశైలంలోనే.
🔋 రాష్ట్ర జలవిద్యుదుత్పత్తి సామర్థ్యంలో శ్రీశైలం కేంద్రం వాటా 36 శాతమే అయినా ఉత్పత్తిలో ఏటా అంతకుమించి ఉంటోంది.
🌗 చంద్రుడిపై పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గతేడాది ప్రతిష్ఠాత్మకంగా నింగిలోకి ప్రవేశపెట్టిన చంద్రయాన్-2 జాబిల్లి కక్ష్యలోకి చేరి ఏడాది పూర్తయింది.
🌗 అప్పట్లో చంద్రయాన్-2 ఉపగ్రహంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ మూడింటిని కలిపి కక్ష్యలోకి పంపారు.
🌗 గతేడాది సెప్టెంబరు 2న ల్యాండర్ నుంచి ఆర్బిటర్ విడిపోయింది. ఇప్పటికీ ఆర్బిటర్ సక్రమంగా పనిచేస్తోందని ఇస్రో వర్గాలు తెలిపాయి.
🌗 చంద్రయాన్-2లో అన్ని యంత్రాలు సక్రమంగా పనిచేస్తున్నట్లు వివరించింది. మరో ఏడేళ్లు నిర్విరామంగా పనిచేసేందుకు ఆర్బిటర్‌లో తగినంత ఆన్‌బోర్డు ఇంధనం ఉందని వివరించింది.
🌗 చంద్రుని ఉపరితలంపై విక్రమ్ (ల్యాండర్) సాఫ్ట్‌ల్యాండింగ్ విఫలమైనా ఆర్బిటర్ మాత్రం జాబిల్లి కక్ష్యలో విజయవంతంగా పనిచేస్తోంది.
🌗 ఇప్పటివరకు చంద్రుడి చుట్టూ 4,400 సార్లు ప్రదక్షిణలు చేసింది. చంద్రుడి ఉపరితలంపై పరిశోధన, ఖనిజాలు, నీటి జాడ కోసం చంద్రయాన్-2ను ఇస్రో ప్రయోగించింది.
🌗 ఇందుకోసం రోవర్‌తోపాటు ఆర్బిటర్‌లో ఎనిమిది అత్యాధునిక సాధనాలు, కెమెరాలను అమర్చారు. అవి డిజైన్ ప్రకారం పనిచేస్తున్నాయి.
🌗 ఆర్బిటర్ చంద్రుని కక్ష్య చుట్టూ పరిభ్రమిస్తూ అందించిన విలువైన సమాచారాన్ని ఈ ఏడాది చివరికల్లా విడుదల చేసేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.
D.Rajesh ✍️ ️:
👨💼 కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్‌కుమార్ నియమితులయ్యారు.
👨💼 అశోక్ లవాసా రాజీనామాతో ఈనెల 31 నుంచి ఖాళీ అయ్యే స్థానంలో రాజీవ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది.
👨💼 రాజీవ్‌కుమార్ 1984 ఝార్ఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారి. 1960 ఫిబ్రవరి 19న ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన ఈయన తనకు 65 ఏళ్లు వచ్చేంత వరకూ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారు.
👨💼 ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ప్రధానమంత్రి ముఖ్య నినాదమైన ఆర్థిక సమ్మిళిత విధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.
👨💼 ప్రధానమంత్రి జన్‌ధన్‌యోజన, ముద్రా యోజనల ద్వారా పేదలకు ద్రవ్య లభ్యత, ఉపాధి కల్పనలో చొరవ చూపారు.
👨💼 ఎంఎస్‌ఎంఈ రంగానికి 59 నిమిషాల్లో రుణం అన్న కొత్త పథకాన్ని అమలు చేశారు.
👨💼 డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా బ్యాంకుల విలీనంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, పెన్షన్ వ్యవస్థల పనితీరును పర్యవేక్షించారు.
🎖 రాజీవ్ ఖేల్‌రత్న పురస్కార గ్రహీతలు సాక్షి మలిక్ (రెజ్లింగ్), మీరాబాయ్ చాను (వెయిట్ లిఫ్టింగ్)లకు అర్జున అవార్డులు అందించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిరాకరించింది.
🎖 తొలిసారిగా అయిదుగురు క్రీడాకారులకు ఖేల్‌రత్న అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాలను క్రీడల శాఖ ప్రకటించింది.
🎖 టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా, పారాలింపియన్ తంగవేలు మరియప్పన్‌లు రాజీవ్ ఖేల్‌రత్న అవార్డులు గెలుచుకున్నారు.
🎖 అర్జున అవార్డుల కోసం సెలెక్షన్ కమిటీ సిఫార్సు చేసిన 29 మంది నుంచి సాక్షి, మీరాబాయ్‌లను తప్పించిన క్రీడల శాఖ మిగతా వారికి పచ్చజెండా ఊపింది.
🎖 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షికి అదే ఏడాది ఖేల్‌రత్న పురస్కారం లభించింది.
🎖 2017లో ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత మీరాబాయ్‌కు తర్వాతి ఏడాది ఖేల్‌రత్న అవార్డు దక్కింది. అయితే సాక్షి, మీరాబాయ్‌లు ఈ ఏడాది అర్జున అవార్డుకు దరఖాస్తు చేసుకోవడం.. సెలెక్షన్ కమిటీ వీరి పేర్లను సిఫార్సు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
🎖 తెలుగబ్బాయి రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజు అర్జున అవార్డు సొంతం చేసుకోగా.. తెలుగమ్మాయి ఉష (బాక్సింగ్)కు ధ్యాన్‌చంద్ పురస్కారం లభించింది.
🎖 ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున వర్చువల్‌గా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
🎖 సాధారణంగా రాష్ట్రపతి భవన్‌లో అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. కరోనా మహమ్మారి కారణంగా తొలిసారిగా వర్చువల్ పద్ధతిలో కార్యక్రమం నిర్వహించనున్నారు.
🎖 క్రీడాకారులు తమకు దగ్గరలోని సాయ్ కేంద్రాల్లో అవార్డును అందుకుంటారు.
🌷 ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డు విజేతల వివరాలు 🌷 :
🏅 ద్రోణాచార్య (లైఫ్‌టైమ్) : ధర్మేంద్ర తివారి (ఆర్చరీ), పురుషోత్తం (అథ్లెటిక్స్), శివ్ సింగ్ (బాక్సింగ్), రొమేశ్ (హాకీ), కృషన్‌కుమార్ (కబడ్డీ), విజయ్ బాలచంద్ర (పారా పవర్ లిఫ్టింగ్), నరేశ్‌కుమార్ (టెన్నిస్), ఓంప్రకాశ్ దహియా (రెజ్లింగ్); ద్రోణాచార్య (రెగ్యులర్): జూడ్ ఫెలిక్స్ (హాకీ), యోగేశ్ (మల్లఖంబ్), జస్పాల్ రాణా (షూటింగ్), కుల్దీప్‌కుమార్ (వుషు), గౌరవ్ ఖన్నా (పారా బ్యాడ్మింటన్);
🏅 ధ్యాన్‌చంద్: కుల్దీప్‌సింగ్ (అథ్లెటిక్స్), జిన్సీ ఫిలిప్స్ (అథ్లెటిక్స్), ప్రదీప్ శ్రీకృష్ణ (బ్యాడ్మింటన్), తృప్తి ముర్గుండే (బ్యాడ్మింటన్), ఉష (బాక్సింగ్), లఖాసింగ్ (బాక్సింగ్), సుఖ్విందర్‌సింగ్ (ఫుట్‌బాల్), అజిత్‌సింగ్ (హాకీ), మన్‌ప్రీత్ (కబడ్డీ), రంజిత్‌కుమార్ (పారా అథ్లెటిక్స్), సత్యప్రకాశ్ (పారా బ్యాడ్మింటన్), మంజీత్‌సింగ్ (రోయింగ్), సచిన్ నాగ్ (స్విమ్మింగ్), నందన్ (టెన్నిస్), నేతర్‌పల్ (రెజ్లింగ్)
🏅 క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) రోజు రికార్డు స్థాయిలో ఈసారి ఎనిమిదిమంది పారా అథ్లెట్లు అవార్డులు అందుకోనున్నారు.
🏅 ఈ పురస్కారాల్లో ఒక ఖేల్‌రత్నతోపాటు ఏడు ఇతర అవార్డులు ఉన్నాయి.
🏅 2016 రియో ఒలింపిక్స్‌లో హైజంప్‌లో స్వర్ణం గెలిచిన మరియప్పన్ తంగవేలుకు ఖేల్‌రత్న లభించింది.
🏅 సందీప్ చౌదరి (అథ్లెటిక్స్), మనీష్ (షూటింగ్), సూయాశ్ (స్విమ్మింగ్)లకు అర్జున దక్కగా, విజయ్ మునీశ్వర్ (పవర్ లిఫ్టింగ్, ద్రోణాచార్య జీవిత సాఫల్య), గౌరవ్ ఖన్నా (బ్యాడ్మింటన్, ద్రోణాచార్య), రంజిత్ కుమార్, సత్యప్రకాశ్ తివారి (బ్యాడ్మింటన్, ధ్యాన్‌చంద్)లకు ఈ పురస్కారాలు దక్కాయి.
🇦🇺 ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ కామెరూన్ వైట్ తన రెండు దశాబ్దాల క్రికెట్ కెరీర్‌కు తెరదించాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు అతను రిటైర్మెంట్ ప్రకటించాడు.
🇦🇺 కోచింగ్‌పై పూర్తి దృష్టి పెట్టేందుకే ఆటకు వీడ్కోలు పలికినట్లు తెలిపాడు.
Comments
Post a Comment