Skip to main content

మద్రాసు దినోత్సవం



💐మద్రాసు నగరంలో నిర్వహించే వేడుకల్లోని ఒక దినోత్సవ రోజు మద్రాసు దినోత్సవం, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరం మద్రాసు. మద్రాస్ డేను ప్రతి సంవత్సరం ఆగస్టు 22 న జరుపుకుంటారు. ఒకప్పటి అచ్చ తెలుగు పట్టణం అయిన చెన్నపట్నం దక్షిణ భారత దేశానికి సింహద్వారం వంటిది. ఈ చెన్నపట్నం వాడుకలో మద్రాసుగా పిలవబడింది, కొన్ని సంవత్సరాల క్రితం మద్రాసుకు చెన్నై అనే పేరును అధికారిక పేరుగా నిర్ణయించారు. ఈ చెన్నపురి పురుడు పోసుకొని ఇప్పటికి   (22-08-2014) 375,  వసంతాలు పూర్తి చేసుకొంది.  22-08-1639, లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డే అప్పటి చంద్రగిరి రాజు శ్రీరంగరాయల ఏలుబడిలో శ్రీకాళహస్తి దీవాన్ గా ఉన్న "ముద్దు వెంకటప్ప నాయకుడి" నుంచి ఇప్పటి చెన్నైలోని కూవం నది పక్కన ఉన్న కొంత ప్రాంతాన్ని కప్పం చెల్లించి కొన్నారు. ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో నిర్మించబోయే ఊరికి తన తండ్రి "చెన్నప్ప నాయని" పేరు పెట్టాలని బ్రిటిష్ వారిని వెంకటప్ప నాయకుడు కోరారు. అలా ఈ పట్టణం చెన్నపట్టణం పేరుతో ఆవిర్భవించింది. చెన్నపట్నం ఆవిర్భవించిన తర్వాత ఏడాది 1640లో బ్రిటీష్ వారు ఇక్కడ సెయింట్ జార్జి కోటను నిర్మించి తమ ఈస్ట్ ఇండియా కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకూ ఈ ప్రాంతం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఈ వేడకలు మద్రాసులో వారం నుంచి నెల రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా చెన్నై నగర చరిత్రను తెలియజేసే ఫొటో ప్రదర్శనలు, చారిత్రక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు

చెన్నపట్నానికి సంబంధించి కొన్ని విశేషాలు

ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి కోటలో మద్రాసు ప్రాంతాన్ని బ్రిటీషు పాలకులకు అప్పగించే ఒప్పందం కుదిరింది.

1917లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాసుపై ఎండెన్ అనే జర్మనీ నౌక బాంబుల వర్షం కురిపించింది.

ఆధునిక భారతదేశంలోని తొలి నగరం ఇదే. కోల్‌కతా కన్నా 50 సంవత్సరాల తర్వాత, ముంబై కన్నా 35 సంవత్సరాల తర్వాత మద్రాసు అభివృద్ధి చెందింది.

చెన్నై నగరం మొట్టమొదట "చెన్నప్ప నాయకన్"గా అని పిలవబడేదట. ఆ తర్వాత కాలక్రమంలో అది చెన్నపట్నంగా, మద్రాస్‌గా మారి నేడు చెన్నై అనే పేరుతో స్థిరపడింది.

1996లో ఈ నగరం పేరును అధికారికంగా మద్రాసు నుంచి చెన్నైగా మార్చారు.

ప్రపంచంలోనే రెండో అతిపొడవైన మెరీనా బీచ్ ఈ చెన్నపట్నంలోనే ఉంది.

బాలీవుడ్‌కు దీటైన తమిళ సినీపరిశ్రమ ఇక్కడే ఉంది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺