Skip to main content

నేటి మోటివేషన్... దేవుడున్నాడు... అన్నిటికి



ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు.
అతను సామాన్య మానవుల వలె దేవుడిని నమ్మేవాడు...
అంటే పూలు, పళ్ళు, దీపం ధూపం, నైవేద్యం, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మేవాడు..
అతనికి అలా ఏమీ లభించలేదు దానితో కొంచెం అసంతృప్తి మనసులో ఉండేది.
ఒకసారి ఒక గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు.
ఏదైనా మంత్రజపం సద్గురువు ద్వారా దీక్ష తీసుకుని చేయాలని ఎవరో చెప్పగా అతను విన్నాడు..
ఆ జ్ఞాని వచ్చారని తెలియగానే ఎంతో ఆశగా వెళ్ళి , దర్శనం చేసుకుని , తన కోరిక వెల్లడించాడు.....
సాధువు అంతా శాంతంగా విని, " నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను కానీ నీ తపన చూస్తుంటే.........." 
భక్తుడు ఆనందభరితుడై సాష్టాంగ నమస్కారం చేసాడు..
 
" కానీ జప  విధానం  కొంచెం కష్టం. నీవు చేయగలవో...........
లేదో...." 
" ఎంత కష్టమైనా నేను చేయగలను.. మంత్రం ఫలిస్తే
చాలు " అన్నాడు భక్తుడు ఆనందంగా....
" అయితే విను ... నేను చెప్పే మంత్రం పఠించ నవసరం లేదు కానీ రోజుకి తొమ్మిది సార్లు ఎవరితోనైనా అనాలి .... అలా తొమ్మిది రోజులు.....
ఆ పంచాక్షరీ మంత్రం ఏమిటంటే........
".  దేవుడున్నాడు " 
----------------------------
 భక్తుడు అయోమయంగా చూసాడు.. సాధువు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు....ఇన్ని లక్షల,...కోట్ల జపం విన్నాడు కానీ ఇదేమిటి ?????
పైగా పంచాక్షరీ మంత్రంట ఏమిటది !!!!!!!
దేవుడున్నాడనే కదా రోజూ పూజలు చేస్తున్నది ...
మళ్ళీ ప్రత్యేకంగా  చెప్పేదేమిటి....???? అదీ ఇంకొకరితో ....తనను పిచ్చివాడి  క్రింద జమ కడ్తారేమో!!!!!!
సాధువు ఒకటే మాట చెప్పాడు
" నన్నేమీ ప్రశ్నించ వద్దు...
మంత్రం ఫలించాలంటే తొమ్మిది రోజులు నేను చెప్పినట్లు చేసి ,
ఆపై నాకు కనిపించు ..."
 భక్తుడు విచారంగా ఇంటికి వెళ్ళాడు...సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా 
 " దేవుడున్నాడు "  అని ఎలా అనటం ?????
 ఇంతలో అతని భార్య వచ్చి,
పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్పబోయింది.
ఇతను అప్రయత్నంగా అన్నాడు.... " దేవుడున్నాడు"
అంతే! ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది.
ఇతనికి చాలా ఆనందం వేసింది....వెంటనే అతనికి ఏదో అర్థం అయినట్లు...కానీ ఇంకా సరిగా కానట్లు వింత భావన కలిగింది....
ఆ పై ఇంక ఏ  మంచి కనిపించినా " దేవుడున్నాడు " 
మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతో.....
ఏదైనా చెడు కనిపిస్తే
" దేవుడున్నాడు" అన్నీ గమనిస్తున్నాడనే అర్థంతో..
అన్యాయం జరుగుతోందని ఎవరైనా అంటే 
 "  దేవుడున్నాడు" శిక్షిస్తాడనే
అర్థంతో 
పూజలు అనే విషయం వస్తే
" దేవుడున్నాడు" అని భక్తివిశ్వాసాలు వ్యక్తపరుస్తూ
అనేవాడు.
తొమ్మిది రోజులు గడిచాయి.
అంతా నెమరువేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు...
సాధువు అన్నాడు," నువ్వు ఎప్పుడు ,ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకనవసరం.
నువ్వు అలా అంటూ గ్రహించిదేమిటో నాకు చెప్పు ."
భక్తుడు తెల్లబోయాడు..అయినా వెంటనే తేరుకుని అన్నాడు...
" నాకు తెలిసింది ఏమిటంటే...
దైవం సర్వాంతర్యామి.....అంతటా వున్నాడు... సర్వజ్ఞుడు...... అతనికి తెలియనిది....మనం దాచగలిగేది ఏమీ లేదు...
నిష్పక్షపాతంగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తాడు..
దయాసాగరుడు.......ఆనందస్వరూపుడు.......... అతనిని మధ్యలో ఆపి సాధువు అన్నాడు " ఇప్పుడు చెప్పు... నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు?????"
భక్తుడు తన్మయత్వం తో కళ్ళు మూసుకుని అన్నాడు "ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులోనుండి 
 " దేవుడున్నాడు" అనే భావం చెదరకుండా స్థిరంగా  ఉండేలా చూడు చాలు💐

నీతి.....
            కర్మఫలం . స్వర్గం- నరకం , పాపభీతి.. త్యాగం... కరుణ సానుభూతి.. ప్రేమ.. సేవ ..మానవత్వం.. సత్యం.. ధర్మం... మొదలైన ఉదాత్తమైన భావాలకి ఆలంబన , ఆధారం...
" దేవుడున్నాడు " అని మనసారా విశ్వసించటమే !!

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺