Skip to main content

నేటి మోటివేషన్... లక్ష్యం సాధించాలంటే... నువ్వేం చేస్తున్నావ్...



జీవితంలో లక్ష్యాలను సాధించి, ఉన్నత స్థానాలను పొందినవారిని చూసినప్పుడల్లా,  వీరికి ఎలా సాధ్యమవుతోందని అనుకోవడం సహజం. మనకంటూ ఓ పట్టికను తయారుచేసుకుని దాన్ని రోజూ అనుసరించగలిగితే విజయం మన సొంతం  కావడానికి ఎక్కువ సమయం పట్టదు.‌
 అవకాశాలను చేజిక్కించుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే దొరికిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో జారవిడుచుకోకుండా చూసుకోవాలి. సూర్యోదయాన్ని చూడటానికి ఆలస్యం చేస్తే... మళ్లీ మర్నాటి కోసం ఆగాల్సిందే. అవకాశం కూడా అలాంటిదే. ఒకసారి వదిలేస్తే మరోసారి వచ్చేవరకూ ఎదురు చూస్తుండాలి. 
ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మానసికంగానూ దృఢంగా ఉంటారు. అప్పుడే లక్ష్యసాధనలో శారీరక, మానసిక బలం మీ వద్ద ఉన్నట్లే. 
సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి. యోగాతో దీనిని సాధించవచ్చు. ప్రతికూలంగా ఆలోచించడం మానేయడం, అలా చెప్పేవారిని దూరంగా ఉంచడం ఎంతో అవసరం. అప్పుడే విజయం మీ వైపు ఉంటుంది. 
రోజూ చేయవలసిన పనులను ఓ  పట్టికలా రూపొందించి, అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేసేలా చూడాలి. అప్పుడే లక్ష్యంవైపు వెళ్లే మార్గం సుగమం అవుతుంది. 
కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించాలి. వారితో అన్ని విషయాలను పంచుకోవాలి. మీ   ఆలోచనలకు వారి చేయూత మీలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. 
లక్ష్యం వెంట పరుగులు వద్దు. మీకు నచ్చినట్లు, నమ్మకంతో ప్రయత్నించండి. మీరు చేరుకోవలసిన లక్ష్యం మిమ్మల్ని వెతుక్కుంటూ అదే వస్తుంది. 
ఒకే దిశగా ఆలోచిస్తే పరిష్కారం  దొరకదు. దీనికోసం ఆలోచనాశక్తిని పెంపొందించుకుంటే, ఫలితం మీకే తెలుస్తుంది.
ఎవరైనా లక్ష్యం చేరుకోలేకపోతున్నారంటే, కారణం వారికి తగినంత శక్తి లేకపోవడం కాదు, కావలసినంత విజ్ఞానం లేకపోవడం కూడా. కాబట్టి విజ్ఞానాన్ని పెంచుకుంటూ, సాధించాలనే తపనా, కోరిక ఉండాలి. అప్పుడే అనుకున్నది సొంతమవుతుంది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

TET and DSC Very important topics...

Lakshya Educational Groups