Skip to main content

ఆగస్ట్ 21 కరెంట్ ఎఫైర్స్... తెలుగులో..



✍ సీనియర్‌ జర్నలిస్టు, సాహితీవేత్త కె.శ్రీనివాస్‌కు 2020 సంవత్సరానికిగాను డా.దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని ప్రదానం చేయాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. 

✍ ఈ నెల 25న డా.దేవులపల్లి రామానుజరావు 103వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రజ్యోతి సంపాదకుడు శ్రీనివాస్‌కు ఈ పురస్కారం ప్రదానం చేస్తామని పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్యలు వెల్లడించారు. 

✍ పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపిక అందజేస్తామన్నారు.

✍ సాహిత్య అకాడమి మాజీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొంటారన్నారు.

🇷🇺 రష్యాలో అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపకుడు, విపక్ష నేత అలెక్సే నావల్నీ(44) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనపై విషప్రయోగం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

🇷🇺  యాంటీ కరప్షన్‌ ఫౌండేషన్‌తో పాటు ‘రష్యా ఆఫ్ ది ఫ్యూచర్’‌ పార్టీ నేతగా ఉన్న నావల్నీ ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెడుతున్నారు.

🇷🇺 వీటితోపాటు పుతిన్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగారు. ఆయన గతంలో అధ్యక్షుడిపై విమర్శలు చేశారు.

🇷🇺 ఈ క్రమంలో అతడు పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. అయితే అతనిపై పెట్టిన కేసులు రాజకీయ కక్షసాధింపు చర్యలేనని తేలడంతో జైలు నుంచి విడుదలయ్యారు. 

🧹 కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ప్రకటించిన 5వ విడత స్వచ్ఛర్యాంకుల్లో లక్షకుపైబడిన జనాభా ఉన్న 100 నగరాల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వరుసగా నాలుగోసారి తొలిర్యాంక్‌ సాధించింది.

🧹 కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్‌దీప్‌సింగ్‌ వెల్లడించిన 2020 స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫలితాల్లో గుజరాత్‌లోని సూరత్‌-2వ, నవీ ముంబయి 3వ స్థానంలో నిలిచాయి.

🧹 లక్ష లోపు జనాభా నగరాల్లో మొదటి మూడు ర్యాంకులను మహారాష్ట్రలోని కరాడ్‌, సస్వాడ్‌, లోనావాలా దక్కించుకున్నాయి.

🧹 పరిశుభ్ర గంగానగరంగా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి నిలిచింది. 

🧹 40 లక్షలకు పైబడిన జనాభా ఉన్న నగరాల్లో శుభ్రమైన నగరంగా అహ్మదాబాద్‌ నిలిచింది. ఈ కేటగిరీలో బెస్ట్‌ స్వయం సమృద్ధ నగర గౌరవం బెంగళూరుకు దక్కింది.

🧹 స్వచ్ఛ సర్వేక్షణ్‌ మొదలైన 2016లో కేవలం 73 స్థానిక సంస్థలు పాల్గొనగా ఈ ఏడాది 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్‌ బోర్డులు, 92 గంగా పరీవాహక ప్రాంత పట్టణాలు పోటీలో పాల్గొన్నాయి.

🧹 స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో ఈ సంవత్సరం తెలంగాణ ప్రభ తగ్గింది.

🧹 లక్షకుపైబడిన జనాభా ఉన్న 100 నగరాల్లో ఈసారి హైదరాబాద్‌కు 65వ ర్యాంకు దక్కింది. 

🧹 గత ఏడాది 35వ స్థానంలో నిలిచిన మహానగరం ఈసారి 30 ర్యాంకులు కోల్పోయింది. పది లక్షల జనాభాకు పైబడిన నగరాల ర్యాంకుల్లో మాత్రం  23వ స్థానంలో నిలిచింది.

🧹 ప్రజా స్పందనలో గ్రేటర్‌ హైదరాబాద్‌కు బెస్ట్‌ మెగా సిటీ ఇన్‌ సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ అవార్డు దక్కింది.

🧹 గత ఏడాది లక్షకు పైబడిన జనాభా గల జాతీయస్థాయి 100 నగరాల్లో వరంగల్‌ 81వ ర్యాంకు, కరీంనగర్‌ 99వ ర్యాంకు దక్కించుకోగా, ఈసారి రెండూ అందులో స్థానాన్ని కోల్పోయాయి.

🧹 1 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో కరీంనగర్‌ 72, వరంగల్‌ 144వ స్థానాలకు పరిమితమయ్యాయి.

🧹 లక్ష లోపు జనాభా పట్టణాల జాబితాలో గత ఏడాది సిద్దిపేట జాతీయస్థాయిలో 84వ ర్యాంకు చేజిక్కించుకోగా ఈసారి ఆ స్థానాన్ని కోల్పోయింది. 

🧹 కంటోన్మెంట్‌ బోర్డుల్లో సికింద్రాబాద్‌కు 31వ ర్యాంకు దక్కింది.ఓవరాల్‌ కేటగిరీలో లక్షకుపైబడిన జనాభా నగరాలకు ప్రకటించిన 100 ర్యాంకుల్లో తెలంగాణకు ఒక్క ర్యాంకే దక్కింది.

🧹 లక్షలోపు జనాభా గల పట్టణాల కేటగిరీలో ఒక్కటీ రాలేదు. మొత్తమ్మీద పనితీరులో 100లోపు పట్టణ స్థానిక సంస్థలున్న రాష్ట్రాల్లో ఝార్ఖండ్‌ తొలి ర్యాంకును కైవసం చేసుకోగా, తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది.

🧹 గత ఏడాది దక్షిణాది జోన్‌ స్థాయిలో రెండోస్థానంలో నిలిచిన సిద్దిపేట ఈసారి 27కి పరిమితమైంది.

🧹 50 వేలు-1 లక్షలోపు జనాభా విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన సిరిసిల్ల స్థానం ఈసారి 16కి పడిపోయింది.

D.Rajesh ✍️ ️:
🚰 కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్వహించిన అధ్యయనంలో.. ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా రక్షిత తాగునీటి సరఫరాలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది.

👉 నిఫ్టీ-50 సూచీలోకి దివీస్‌ ల్యాబ్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లను చేర్చనున్నారు.

👉 ప్రస్తుతం సూచీలో ఉన్న భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లను తొలగించి వీటి స్థానంలో దివీస్‌, ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లు రానున్నాయి.

👉 ఈ మార్పు చేర్పులు వచ్చే నెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి.

🏦 ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 

🏦 అందులో పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, యూకో బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంకులున్నాయి

🏦 వీటిల్లో ప్రభుత్వానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మెజారిటీ వాటాల ఉన్నాయి. 

🏦 ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి ఈ వ్యవహారాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. అదే జరిగితే కేవలం 5 పెద్ద బ్యాంకులే ప్రభుత్వ బ్యాంకులుగా ఉంటాయి. 

🏦 మనదేశంలో బ్యాంకులను జాతీయం చేయడం (ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వ బ్యాంకులుగా మార్చటం...) 1969లో ఒకసారి, 1980లో రెండోసారి జరిగింది. 

🏦 మూడేళ్ల క్రితం ఎస్‌బీఐలో దాని ఏడు అనుబంధ బ్యాంకులను విలీనం చేశారు. ఆ తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా బ్యాంకు, దేనా బ్యాంకు కలిశాయి. 

🏦 మలిదశ విలీనం ఇంకా పెద్దది. ఒకేసారి 10 బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మార్చారు. దీంతో ప్రస్తుతం 5 పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నట్లు అయింది.

🏅 జాతీయ క్రీడా పురస్కారాల ప్రైజ్‌మనీని భారీగా పెంచేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 

🏅ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడితే రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డీకి రూ.25 లక్షలు, అర్జున అవార్డీకి రూ.15 లక్షలు నగదు బహుమతిగా లభించనున్నాయి.

🏅 ప్రస్తుతం ఖేల్‌రత్నకు రూ.7.5 లక్షలు, అర్జునకు రూ.5 లక్షలు నగదు బహుమతిగా అందజేస్తున్నారు.

🏅 ధ్యాన్‌చంద్‌, ద్రోణాచార్య (లైఫ్‌టైమ్‌) అవార్డుల ప్రైజ్‌మనీని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచనున్నారు. 

🏅ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున క్రీడా పురస్కారాలు అందజేస్తారు. అంతలోపే నూతన నగదు బహుమతుల్ని ప్రకటించాలని క్రీడల శాఖ భావిస్తోంది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RRB JE Recruitment: రైల్వేలో 2,570 జూనియర్ ఇంజినీర్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు

భారతీయ రైల్వే (Indian Railway).. 2,570 పోస్టులతో మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2,570 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్ఆర్బీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 31వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆఫీసియల్ వెబ్సైటు లింక్ https://www.rrbcdg.gov.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ