Skip to main content

నేటి మోటివేషన్... ఎదురయ్యే ప్రతి చిన్న సంఘటన నుంచి ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు!


మన నిత్య జీవితంలో
ఎదురయ్యే ప్రతి చిన్న సంఘటన నుంచి ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు!

ఉదాహరణకి మీరు నడిచి వెళ్తున్నారు
ఒక జంక్షన్ దాటుకునేటప్పుడు నాలుగు వైపుల నుంచి ఏదో ఒక వాహనం వస్తోంది..

అవి మీదకు వస్తాయని వెంటనే...
మీరు ముందుకో...
వెనక్కో.. పక్కకో... ఆటో ఇటో...
ఎలా అనిపిస్తే అలా తప్పించుకుంటారు!

వాహనాలు వస్తుంటే మీరు ఆవేశానికి గురయ్యారా లేదు కదా?

Junction అన్నాక వాహనాలు రావడం మామూలే కదా...
ఒకవేళ ఆవేశానికి గురై భీష్మించుకుని అలాగే నిలబడి ఉంటే???

ఎవరో ఒకరు వచ్చి..
గుద్దినా గుద్దుతారు!
ఇక నష్టపోయేది మనమే కదా???

ఏ విధంగా అయితే
జంక్షన్లో తప్పించుకొని ముందుకు వెళ్లే నేర్పును పాటించామో...

జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు కూడా..
ఇవి జీవితంలో మామూలే కదా..
అని భావించి 
ఆవేశపడకుండా తెలివిగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి!

జీవితం అన్నాక..
సమస్యలు లేకుండా ఎలా ఉంటాయి..
Just వాటి పట్ల మనం స్పందించే తీరు మారాలి!
అంతా..
మనలోనే వుంది!

Change Your Style!!

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

క్యాలిక్యులేటర్ లో ఉండే ఈ GT, MU, M+, M-, MRC బటన్ల అర్థాలు, ఎందుకు వాడుతారో తెలుసా..?

ఇప్పుడంటే అన్నీ కంప్యూటర్ మయం అయిపోయాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. ప్రతీ దానికి యాప్ లు వచ్చేసాయి. ఇప్పుడంటే మనం సులభం గా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడిక వెయ్యటానికి కాలిక్యులేటర్ యాప్ లను వాడుతున్నాం. అయితే ఫిజికల్ కాలిక్యులేటర్ వాడకం మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ షాపుల్లో, ఆఫీసుల్లో అకౌంట్స్ సెక్షన్స్ లో దీని అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాలిక్యులేటర్ ను సరిగా చూసినట్లయితే అందులో కొన్ని ప్రత్యేకమైన బటన్స్ ఉంటాయి. GT, MU, M+, M-, MRC ఇలా కొన్ని స్పెషల్ బటన్లు ఉంటాయి. కాలిక్యులేటర్ ను వాడే చాలా మందికి అవేంటో ఎందుకు వాడతారో తెలియదనే చెప్పాలి. అసలు ఆ బటన్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందామా... 1. GT - గ్రాండ్ టోటల్ (Grand Total) GT బటన్ మీకు గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. అంటే ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఒకసారి ట్రై చ...

సైన్స్ లో ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు....

ప్రశ్న: కాంతి వేగం ఎంత? జవాబు: 3 లక్షలు కి.మీ/సెకండ్ ప్రశ్న: విద్యుత్ యొక్క ప్రమాణం ఏమిటి? జవాబు: వాట్ (Watt) ప్రశ్న: అత్యంత తేలికపాటి వాయువు ఏది? జవాబు: హైడ్రోజన్ ప్రశ్న: DNA డబుల్ హెలికల్ నిర్మాణాన్ని ఎవరు కనిపెట్టారు? జవాబు: వాట్సన్ మరియు క్రిక్ ప్రశ్న: పెనిసిలిన్‌ను ఎవరు కనిపెట్టారు? జవాబు: అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ప్రశ్న: ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? జవాబు: ఎముక మజ్జ (Bone Marrow) ప్రశ్న: సూర్యుని నుండి శక్తి ఏ రూపంలో లభిస్తుంది? జవాబు: ప్రకాశం మరియు ఉష్ణం ప్రశ్న: రక్త శుద్ధి ఎక్కడ జరుగుతుంది? జవాబు: మూత్రపిండం (Kidney) ప్రశ్న: మనిషి కంటి లెన్స్ ఏ రకం? జవాబు: కుంభాకారం కటకం (Convex Lens) ప్రశ్న: పాలను పెరుగుగా మారడానికి ఏ బాక్టీరియా సహాయం చేస్తాయి? జవాబు: లాక్టోబాసిల్లస్ ప్రశ్న: ఇన్సులిన్ ఏ అవయవం నుండి ఉత్పత్తి అవుతుంది? జవాము: క్లోమం (Pancreas) ప్రశ్న: హీమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్‌ను ఎవరు తీసుకెళ్తారు? జవాబు: ఎర్ర రక్త కణాలు ప్రశ్న: ప్రపంచంలో అత్యంత కఠిన పదార్థం ఏది? జవాబు: వజ్రం (Diamond) 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Latest Job Notifications

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺