Skip to main content

నేటి మోటివేషన్.... జ్ఞాపకశక్తి మందు!

సాయంత్రం బడి నుంచి ఇంటికి వచ్చింది హేమ.

వచ్చీ రాగానే నానమ్మ చుట్టూ తిరగసాగింది. 'నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?' అని అడిగింది నానమ్మ. 'అవును నానమ్మా! ఈ మధ్య ఎంత చదివినా.. నాకు పాఠాలు గుర్తుండటం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు' అంది హేమ.

'నాలుగో తరగతి నుంచి అయిదో తరగతికి వచ్చావు కదా. చదవాల్సిన పాఠాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కంగారు పడకుండా ప్రతిదాన్నీ ఒకటికి రెండుసార్లు చదువు. అప్పుడు మర్చిపోవడం అనేది ఉండదు. తప్పక గుర్తుంటాయి.. అలా చెయ్యి' అంది నానమ్మ.
నాలుగు రోజుల తర్వాత 'నువ్వు చెప్పినట్లే ప్రతి పాఠాన్నీ ఒకటికి రెండుసార్లు చదువుతున్నాను. అయినా గుర్తుండటం లేదు! జ్యోతి, రమ్య, మౌనికల కంటే నేను చదువులో వెనకబడిపోతానని భయంగా ఉంది నానమ్మా' అంది హేమ బాధగా.

'బాధపడకమ్మా. రేపు సాయంత్రానికల్లా నీ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను. ధైర్యంగా ఉండు' అంది నానమ్మ. మర్నాడు సాయంత్రం బడి నుంచి ఇంటికి రాగానే నానమ్మ దగ్గరకు వెళ్లింది హేమ. 'రా తల్లీ, నీ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఇది జ్ఞాపకశక్తిని పెంచే మందు. రోజూ రాత్రి దీన్ని ఒక స్పూను తిని పడుకుంటే చాలు. జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతుంది' అంది నానమ్మ.

ఆ మందును చూడగానే హేమ ముఖంలో ఎంతో సంతోషం కనిపించింది. రోజూ ఆ మందును క్రమం తప్పకుండా వాడసాగింది. హేమ చదవటం కోసం కూర్చునే సమయం, ఏకాగ్రతల్లో మంచి మార్పులు వచ్చాయి. 'నీ జ్ఞాపకశక్తి ఎలా ఉందమ్మా?' అని వారం తర్వాత అడిగింది నానమ్మ. 'జ్ఞాపకశక్తి ఎంతో పెరిగింది. ఇప్పుడు నాకు అన్నీ బాగా గుర్తుంటున్నాయి. ఒక్కసారి చదివినవి కూడా గుర్తుంటున్నాయి. థ్యాంక్స్‌ నానమ్మా.. నువ్వు నాకు చాలా మంచి మందు ఇచ్చావు' అంది హేమ.

మరో వారం గడిచింది. ఒకరోజు సాయంత్రం 'నానమ్మా.. నువ్విచ్చిన జ్ఞాపకశక్తి మందు అయిపోయిందని నిన్న చెప్పాను కదా. ఇంకో మందుసీసా కొనుక్కొచ్చావా?' అడిగింది హేమ.

'ఈ రోజు ఆ మందు కోసం ఊరంతా తిరిగాను. ఎక్కడా దొరకలేదు. రెండు, మూడు రోజుల్లో తెప్పిస్తామని చెప్పారు.. అన్ని కొట్లవాళ్లు' అంది నానమ్మ.

నాలుగు రోజుల తర్వాత ఒక సాయంత్రం హేమ అని పిలిచి 'జ్ఞాపకశక్తి మందూ..' అని ఏదో అనబోయింది నానమ్మ.

'నాకు జ్ఞాపకశక్తి పెరిగింది నానమ్మా. ఆ మందు వేసుకోకపోయినా నాకు చదివినవన్నీ గుర్తుంటున్నాయి. ఇక నాకు ఆ మందుతో పనిలేదు' అంది హేమ ఆనందంగా. తర్వాత కాసేపటికి.. సీసా మూత తీసి జ్ఞాపకశక్తి మందును చెంచాతో తింటున్న నానమ్మను చూసి.. 'కొత్త సీసా కొన్నావా? ఇదేంటి నానమ్మా! నువ్వు జ్ఞాపకశక్తి మందు తింటున్నావు? నీకు కూడా జ్ఞాపకశక్తి తగ్గిందా?' అని అడిగింది హేమ.

'ఇది అసలు జ్ఞాపకశక్తి మందే కాదమ్మా. ఇది ఓ తినుబండారం. నీ మీద నీకు నమ్మకం పెంచటం కోసం దీన్ని జ్ఞాపకశక్తి మందు అని నీకు ఇచ్చాను' అంది నానమ్మ నవ్వుతూ. హేమ ముందు ఆశ్చర్యపోయింది. తర్వాత నానమ్మ తెలివికి ఎంతో సంతోషించింది. 'ఆసక్తిగా, ఇష్టంతో అర్థం చేసుకుంటూ చదివితే ఏదైనా గుర్తుంటుంది' అంది నానమ్మ. నానమ్మ మాటలు హేమకు ఎంతగానో నచ్చాయి. తర్వాత ఇంకెప్పుడూ తనకు జ్ఞాపకశక్తి మందు అవసరం రాలేదు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺