మన నిత్య జీవితంలో
ఎదురయ్యే ప్రతి చిన్న సంఘటన నుంచి ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు!
ఉదాహరణకి మీరు నడిచి వెళ్తున్నారు
ఒక జంక్షన్ దాటుకునేటప్పుడు నాలుగు వైపుల నుంచి ఏదో ఒక వాహనం వస్తోంది..
అవి మీదకు వస్తాయని వెంటనే...
మీరు ముందుకో...
వెనక్కో.. పక్కకో... ఆటో ఇటో...
ఎలా అనిపిస్తే అలా తప్పించుకుంటారు!
వాహనాలు వస్తుంటే మీరు ఆవేశానికి గురయ్యారా లేదు కదా?
Junction అన్నాక వాహనాలు రావడం మామూలే కదా...
ఒకవేళ ఆవేశానికి గురై భీష్మించుకుని అలాగే నిలబడి ఉంటే???
ఎవరో ఒకరు వచ్చి..
గుద్దినా గుద్దుతారు!
ఇక నష్టపోయేది మనమే కదా???
ఏ విధంగా అయితే
జంక్షన్లో తప్పించుకొని ముందుకు వెళ్లే నేర్పును పాటించామో...
జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులకు కూడా..
ఇవి జీవితంలో మామూలే కదా..
అని భావించి
ఆవేశపడకుండా తెలివిగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి!
జీవితం అన్నాక..
సమస్యలు లేకుండా ఎలా ఉంటాయి..
Just వాటి పట్ల మనం స్పందించే తీరు మారాలి!
అంతా..
మనలోనే వుంది!
Change Your Style!!
సూపర్
ReplyDelete