Skip to main content

నేటి మోటివేషన్... టైటిల్ మీరే పెట్టండి...

జయపురానికి చెందిన కేదారయ్యకు ఏదైనా మంచి వ్యాపారం పెట్టి బాగా డబ్బుగడించాలని ఆశ. వివిధ వ్యాపారాలను గురించి అనుభవజ్ఞులను అడిగాడు. వారిలో చాలామంది-జయపురంలో సరైన పూటకూళ్ళ ఇల్లు లేక, వచ్చే వారికి మంచి తిండి దొరకడంలేదనీ, అందువల్ల మంచి పూటకూళ్ళ వ్యాపారం ప్రారంభించమనీ సూచించారు.
 
జయపురం ముఖ్య రహదారిలో ఒక పెద్ద ఇల్లు తీసుకుని కేదారయ్య పూటకూళ్ళ వ్యాపారం ప్రారంభించాడు. అయినా అనుకున్నంత వ్యాపారం జరగలేదు. ఇద్దరు ముగ్గురు వంటగాళ్ళను మార్చాడు. కాని వ్యాపారం పుంజుకోలేదు. ఏం చేయడమా అని ఆలోచిస్తున్న సమయంలో మైలవరం నుంచి సునందుడనే వంటవాడు పనివెతుక్కుంటూ వచ్చాడు. సునందుడు వంటవాడుగా చేరినప్పటి నుంచి వంటకాల రుచి అద్భుతంగా ఉండడంతో, భోజనానికి వచ్చేవారి సంఖ్య క్రమక్రమంగా పెరగసాగింది.
 
రుచి, శుచి రెండూ ఉండడంతో వ్యాపారం పూటపూటకూ అభివృద్ధి చెందసాగింది. కేదారయ్య పూటకూళ్ళ ఇల్లు కొన్నాళ్ళకే జయపురంలో మంచి పేరు తెచ్చుకున్నది. ఇలా వుండగా ఒకనాడు ఏదో ముఖ్య అవసరం ఏర్పడి, సునందుడు కేదారయ్యను వందవరహాలు అప్పు అడిగాడు. ఇప్పుడు వంద వరహాలు ఇస్తే, మరలా వెయ్యి వరహాలు అప్పు అడగగలడని భావించిన కేదారయ్య లేదనేశాడు. ఆ రోజునుంచే వంటకాల రుచి లోపించసాగింది. భోజనానికి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గసాగింది.

రోజూ భోజనం చేయడానికి వచ్చే మహీపతి అనే ఉపాధ్యాయుడు కూడా రుచి లోపించడం గమనించి, ‘‘ఈ మధ్య వంటలు మునుపటిలా అంత బావుండడం లేదు ఎందుకని?'' అని అడిగాడు కేదారయ్యను. ‘‘అదే నాకూ అంతుబట్టడం లేదు పంతులుగారూ. వంట సరుకులూ అదే చోట కొంటున్నాం. ఎప్పుడూ వంటచేసే సునందుడే ఇప్పుడు కూడా చేస్తున్నాడు,'' అన్నాడు కేదారయ్య విచారంగా. మహీపతి కొంతసేపు ఆలోచించి, ‘‘సునందుడు నిన్నేదైనా సాయం కోరాడా?'' అని అడిగాడు. కేదారయ్య ఏదో జ్ఞాపకం చేసుకుంటున్నట్టు, ‘‘అవును, పంతులుగారూ. సునందుడు వంద వరహాలు అప్పు అడిగాడు. నేను ఇవ్వలేదు,'' అన్నాడు.
 
‘‘ఎందుకు ఇవ్వలేదు?'' అని అడిగాడు మహీపతి. ‘‘ఒకసారి ఇస్తే అదే అలవాటవుతుందని భావించాను,'' అన్నాడు కేదారయ్య. ‘‘అలా ఎందుకు అనుకోవాలి? అన్నిటికీ ఒకే సూత్రం పాటిస్తే ఎలా? ఒక్కొక్క వ్యాపారం ఒక్కొక్క విధంగా ఉంటుంది గనక, ఆయూ వ్యాపారాలకు తగ్గ సూత్రాలనే పాటించాలి. అతడు ఏ అవసరంలో ఉండి అడిగాడో ఏమో! దాని మీది బాధతో చేసే వంట మీద శ్రద్ధ కనబరచలేక పోవచ్చు. నీ దగ్గర పనిచేస్తూ వేరొక చోటికి వెళ్ళి సాయం అర్థించలేడు కదా? ఇంతకూ అతడు అడిగింది అప్పుగానే కదా? వెంటనే వంద వరహాలు ఇచ్చి చూడు. ఫలితం నీకే తెలుస్తుంది. మన దగ్గర పని చేసే వాళ్ళను మంచిగా చూస్తేనే, వాళ్ళ దగ్గరి నుంచి ఆశించిన పనిని రాబట్టగలం,'' అని సలహా ఇచ్చాడు మహీపతి. 

కేదారయ్య ఆ రోజే సునందుడికి వంద వరహాలు ఇచ్చాడు. ఆ క్షణం నుంచి సునందుడి ముఖంలో ఆనందం, పనుల్లో ఉత్సాహం కనిపించాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయని భోజనానికి వచ్చినవాళ్ళు మెచ్చుకోసాగారు. వ్యాపారం మునుపటి కన్నా ఎక్కువ అభివృద్ధి చెందింది.

---సేకరణ.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

భారత రాజ్యాంగములో మొత్తం ఆర్టికల్స్ వివరాలు ...

ఆర్టికల్ సంఖ్య మరియు పేరు ఆర్టికల్ 1 - యూనియన్ పేరు మరియు భూభాగం ఆర్టికల్ 2 - కొత్త రాష్ట్రాల ప్రవేశం లేదా స్థాపన ఆర్టికల్ 3 - రాష్ట్రం యొక్క సృష్టి మరియు సరిహద్దులు లేదా పేర్ల మార్పు ఆర్టికల్ 4 - మొదటి షెడ్యూల్డ్ మరియు నాల్గవ షెడ్యూల్స్కు సవరణలు మరియు రెండు మరియు మూడు కింద చేసిన శాసనాలు ఆర్టికల్ 5 - రాజ్యాంగం ప్రారంభంలో పౌరులు ఆర్టికల్ 6 - పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తున్న కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 7 - భారతదేశం నుండి పాకిస్తాన్ వెళ్లేవారికి కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 8 - భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తుల పౌరసత్వ హక్కులు ఆర్టికల్ 9 - స్వచ్ఛందంగా విదేశీ రాష్ట్ర పౌరసత్వం తీసుకుంటే భారత పౌరుడు కాదు ఆర్టికల్ 10 - పౌరసత్వ హక్కుల నిలకడ ఆర్టికల్ 11 - పౌరసత్వం కోసం చట్టాన్ని పార్లమెంట్ నియంత్రిస్తుంది ఆర్టికల్ 12 - రాష్ట్ర నిర్వచనం ఆర్టికల్ 13 - ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే లేదా అవమానించే చట్టాలు ఆర్టికల్ 14 - చట్టం ముందు సమానత్వం ఆర్టికల్ 15 - మతం, కులం, లింగం, సంతతి లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించడం ఆర్టికల్ 16 - ...