Skip to main content

ఆచార్య చాణక్య తెలిపిన ఈ 10 అమూల్య విషయాలను ఎప్పటికీ గుర్తుంచుకోండి.



🌷1. ఆవుల మందలో ప్రవేశించిన దూడ తన తల్లిని ఎలా అనుసరిస్తుందో, అదే విధంగా ఒక వ్యక్తి చేసే మంచి, చెడు కర్మలు అతనిని అనుసరిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ మంచి పనులు చేస్తుండాలి.

🌷2. తెలివిగల మనిషి తన ఇంద్రియాల అదుపు విషయంలో కొంగలా ప్రవర్తించి, స్థలం, సమయం, తన సామర్థ్యాలను అర్థం చేసుకుని తన పనితనాన్ని నిరూపించుకోవాలి.

🌷3. కష్టపడి పనిచేసేవారిని చూస్తే పేదరికం పారిపోతుంది. ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించే వారు పాపపు పనులు చేయలేరు. ఇటువంటి మనసు కలిగినవారు ఎల్లప్పుడూ నిర్భయంగా ఉంటారు.

🌷4. రాజు యొక్క బలం అతని శక్తివంతమైన బాహువులలో ఉంటుంది. బ్రాహ్మణుని బలం అతని ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉంటుంది. స్త్రీ యొక్క బలం ఆమె అందం, యవ్వనం, మధురమైన మాటలలో ఉంటుంది.

🌷5. మీరు త్వరగా విజయం సాధించాలనుకుంటే, మీరు నైపుణ్యం సంపాదించిన పనిలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండండి.

🌷6. ఐశ్వర్యం, స్నేహితులు, భార్య, రాజ్యం తిరిగి పొందవచ్చు. కానీ ఈ శరీరాన్ని తిరిగి పొందలేము. కాబట్టి కాలాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకోండి.

🌷7మనం ఎవరి ద్వారానైతే ఏదైనా పని పూర్తిచేయించాలనుకుంటున్నామో.. వారు ఇష్టపడే రీతిలో మాట్లాడాలి. 

🌷8. తన కుటుంబంతో విపరీతమైన అనుబంధం కలిగిన వ్యక్తిని భయం, దుఃఖం వెంటాడుతుంటాయి. అన్ని బాధలకు అనుబంధమే ప్రధాన కారణం. అందుకే సంతోషంగా ఉండాలంటే పరిధికి మించిన అనుబంధాలను వదులుకోవడం అవసరం.

🌷9. బంగారంతో పూత వేస్తే వెండి కూడా బంగారంలానే కనిపిస్తుంది. సత్సంగం ప్రభావం ఖచ్చితంగా మానవులపై పడుతుందని దీని అర్థం.

🌷10. పనులు చేపట్టాక ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే మూర్ఖులు తప్పులు కనుగొంటారు. తెలివైన వ్యక్తి పని ప్రారంభించే ముందే ప్రణాళికతో ఉంటాడు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📢 టెట్ (TET) సిలబస్ తెలుగులో (Direct PDF Download Links) 📄

మీరు టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే సిలబస్ కోసం వెతకాల్సిన అవసరం లేదు! క్రింది డైరెక్ట్ లింక్స్ పై క్లిక్ చేసి, సిలబస్‌ను తెలుగులో నేరుగా మీ మొబైల్‌లో PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోండి. 👇 సిలబస్ డౌన్లోడ్ లింకులు ఇవే: 📄 టెట్ పేపర్-1(ఎ) 📥 https://drive.google.com/uc?export=download&id=1SVUkSkRXt9E97-TLazh2P8MAPMwyUOSe 📄 టెట్ పేపర్-1(బి) 📥 https://drive.google.com/uc?export=download&id=1IN2yDR7F8b71wM-iP1cMT-Q8ZSTxCmOT 📄 టెట్ పేపర్-2(ఎ) మ్యాథ్స్ & సైన్స్ 📥 https://drive.google.com/uc?export=download&id=1ztvQ-kCs1N1IgBsJXeCAgiMUxPTdZgMr 📄 టెట్ పేపర్-2(ఎ) సోషల్ స్టడీస్ 📥 https://drive.google.com/uc?export=download&id=1jI-sVBtAhBENkfs5v4oMU3LpGjR1kv6R 📄 టెట్ పేపర్-2(ఎ) తెలుగు 📥 https://drive.google.com/uc?export=download&id=1GlZVJyH4i5BkWg3UlkvsJeWWW1-cRAh5 📄 టెట్ పేపర్-2(బి) స్పెషల్ ఎడ్యుకేషన్ 📥 https://drive.google.com/uc?export=download&id=1wz4e_jAXwmZoKpHdyyowz2BeMcgOzz_7 Lakshya Educational Groups