Skip to main content

నేటి మోటివేషన్... ఒక చిన్న ప్రేమ కథ...


ఒక మిడిల్ క్లాస్ సంసారం..
ఒకతల్లి ఆ తల్లికి ఒక కొడుకు..

తల్లి అనారోగ్యంతో బాధపడుతుండేది.
కొడుకు చిన్న ఉద్యోగి.
తన సంపాదన అమ్మ మందులకు ఇంటి అవసరాలకు అడికాడికే సరిపడేవి...

కొడుకు:తోటి స్నేహితులు ,పక్కవాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ పెద్దపెద్ద మొబైల్స్ వాడుతున్నారు నేను ఒక మొబైల్ తీసుకుంటానే అమ్మా...
అమ్మ:నాయనా నీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు తీసుకో నానా...మరి డబ్బులున్నాయా..?

కొడుకు: లేదమ్మా..

అమ్మ:మారేలా రా నానా కొంటావు..?

కొడుకు:అప్పు చేసి తీసుకుంటా నే..

అమ్మ:అప్పు చేస్తే ఎలా తీరుస్తావు..?
ఇవిగో నా చెవుల్లో దిద్దులున్నాయి తీసుకెళ్లి అమ్మేసి తెచ్చుకో...

కొడుకు: అమ్మా నువ్వు చాల మంచిదానివే... 
నీకు మళ్ళీ నెల రోజుల్లో మంచి కమ్మలు తెస్తానే...

అమ్మ: ముందు నువ్వు వెళ్లి సెల్లు తెచ్చుకోరా అయ్యా..

కొడుకు మొబైల్ తెచ్చాడు..

వాట్సాప్ పేస్ బుక్ అకౌంట్స్ తెరిచాడు..
కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు ,
చాటింగులు, మీటింగులు,

అమ్మాయితో ప్రేమ పుస్తకం తెరిచాడు.

అమ్మని మరిచారు..

అమ్మాయి ఎలా ఉంటుందో ఎక్కడ ఉందో ఇలా సతమతమై పోతున్నాడు..

ఆ అమ్మాయి ఎప్పుడు బావుండాలి పచ్చగా ఉండాలి అని ఆ అమ్మాయి గుర్తుగా ఒక పూలమొక్కను పెంచుతున్నాడు.
ఆ మొక్కలో తనని చూసుకుంటూ రోజు కాలం వెళ్లదీస్తున్నాడు..

రోజు రాత్రిళ్లు ఒక మంచం లో అతడు అమ్మాయితో చాటింగ్..
ఒక మంచంలో అతని అమ్మ ఆయాసం దగ్గు అనారోగ్యంతో రోజులు లెక్కపెడుతోంది...

ఒకరోజు ఉదయం నిద్రలేచి మొక్కదగ్గరికి వెళ్లి చూసేసరికి ఆ మొక్క వాడిపోయి చచ్చిపోయే స్థితిలో ఉంది..
 
అతడు కంగారుగా వెళ్లి మొబైల్ తీసి టెన్షన్తో ఆ అమ్మాయికి మెసేజ్ కాల్ ఇలా అన్నిటికి ప్రయత్నించా సాగాడు...

అలా ఇలా అలా ఇలా తిరుగుతుంటే అతనికి ఎదో వినిపించలేదే నాకు ఏంటదీ ..ఏంటదీ...ఏంటదీ...?
 అమ్మ ఆయాసం దగ్గు.. రెండు ఆగిపోయాయి..

ఎలా..?

అమ్మ ఆయాసం దగ్గు తో పాటు గుండె కూడా ఆగిపోయింది...

విగతాజీవిలా పడివున్న అమ్మను చూసి నన్ను వంటరిని చేసి వెళ్లిపోయావా అమ్మా....అని గుండెలు పగిలేలా ఏడ్చాడు..

నిజానికి వంటరిని చేసింది అమ్మ కాదు..
 అతడే అమ్మని వంటరిని చేశాడు...
 మొబైల్ మాయలో పడి...

మొక్కలో ఉండేది అమ్మాయి కాదురా
మొక్కలో ఉండేది అమ్మ..
ఆ మొక్కకు నీరు పోసేది రోజు అమ్మే..
అమ్మ లేని రోజు ఆ మొక్కకూడా లేదు...😰😰😰😰😰
విచిత్రం అంటే ఇదే ప్రేమ విఫలం అయితే 
మనసు ఎందుకు రోదిస్తుంది....??👇
జ్ఞాపకాలు పదే పదే బాధిస్తాయి కనుక....
 
వాస్తవం వాదిస్తుంది 
రోజులు ముగిసి పోయాయి 
ప్రేమ బంధం సమసి పోయింది అనీ....

కాలం కలిపిన బంధంలో నీతో గడిచిన క్షణాలు మాత్రమే మిగిలిపోయాయి....

ఇప్పుడు కర్తవ్యం ఎంటి....?
👇
నాకు ఈ బాధించే గతం వద్దు....
నాకు ఈ వేదన మిగిల్చిన రోదన వద్దు....
ఇప్పుడు మనం కాదు నీకు నువ్వే నాకు నేనే....
అందుకే .... నా భవిష్యత్తు నాకు ముద్దు....

మొదలెట్టాలి నీ జ్ఞాపకాలు దూరలేని కొత్త రోజుని వెతుకుతూ.....
మనసుకు నీ నీడ కూడా తగలకుండా తాళం వేస్తూ.......

ప్రేమ విఫలం అయిన ఇష్టమైన వాళ్ళు దూరం అయిన ఒకటి గుర్తుంచుకోవాలి.... ,👉మనం కలుపుకున్న బంధాలు మనతో వుండచ్చు వుండకపోవచ్చు.... దేవుడు కలిపిన బంధాలు వద్దన్న మనతోనే వుంటాయి....fact to Accept and move for Life race....

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ