Skip to main content

నేటి మోటివేషన్... నువ్వెందో చేతల్లో చూపించు...


చేయాల్సిన పని ఏదైనా....

చేసే పని ఏదైనా....
గాలికొదిలేసి ఎక్కడెక్కడో ఏవేవో ఆలోచనల్లో, ఆందోళనల్లో, ముచ్చట్లలో...మునిగి తేలితే ఎన్ని ఇన్‌స్పైరింగ్ కొటేషన్లు బ్రెయిన్‌లో ఉన్నా నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావు...

జీవితం దర్జాగా జీవించి చూపించాల్సింది... కబుర్లు చెప్పుకుంటూ దాటవేసేది కాదు...!

పనిచేయాలంటే అలసిపోయినట్లుంటుంది.... :) అంటే తెలీని బద్ధకం వంటి నిండా ఎక్కేసిందన్నమాట...

కళ్లూ, కాళ్లూ, చేతులూ, కదలికలూ లేని వాళ్లే గొప్పగా జీవించేసి మనల్ని ఎగతాళిగా చూస్తుంటే మనకు ఏమాత్రం సిగ్గేయట్లేదు... కానీ అవసరం లేని పంతాలకూ, రోషాలకూ, ఇగోలకు మాత్రం చాలా బాధపడిపోతాం...

ఎక్కడ ఇరుక్కుపోయిందో లైఫ్ ఆగి గమనించి... ముందుకు సాగకపోతే ఎలా...?

కాలక్షేపం అవ్వక దారిన పోయే వాళ్లతో కబుర్లు చెప్తూ ఎలాగోలా బ్రతికేసే ముసలమ్మకూ.... మనకూ తేడా లేకుండా చేసేసుకుంటున్నాం....

కొన్ని కోట్ల పిండాలు రకరకాల కారణాలతో తల్లి గర్భం నుండి లోకాన్ని చూడలేకపోతున్నాయి...

అదృష్టం బాగుండీ లోకంలోకి వచ్చి పడ్డ మనమూ ఎందుకూ పనికిరాని జీవితాన్ని జీవించేస్తే.... అడుగడుగుకీ కారణాలు కావాలి... ఎస్కేపిజాన్నీ సమర్థించుకోవడానికీ!

నేనింతే బ్రతుకుతాను.... నా లైఫ్ నా ఇష్టం... అని అందరితో మొండిగా చెప్పేసుకుంటూ లోపల్లోపల చేతకానితనానికి ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌లు పెంచుకోవడం ఇబ్బందిగా లేదూ...

రేపుంటుందో లేదో తెలీదు.. ఇవ్వాళా, ఈ క్షణం మాత్రం ఉంది.... ఏం ఊడబొడవగలమో చేసి చూపిద్దాం....

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

🎒బ్యాగ్ లేని రోజు (No Bag Day) – ఆనందభరిత అభ్యాస శనివారాలు (Joyful Learning Saturdays )

📖 పరిచయం SCERT ఆంధ్రప్రదేశ్ 2026–27 విద్యా సంవత్సర శిక్షణా ప్రణాళిక ప్రకారం "నో బ్యాగ్ డే" కార్యక్రమం విద్యార్థులకు పుస్తకాల భారం లేకుండా, ఆనందదాయకమైన, అనుభవాధారితమైన మరియు సృజనాత్మకమైన అభ్యాస అవకాశాలను కల్పించడానికి రూపొందించబడింది. ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం (NEP–2020) మరియు పునాది దశ జాతీయ పాఠ్య ప్రణాళిక (NCF-FS–2022) లక్ష్యాలకు అనుగుణంగా అమలవుతుంది. 🎯 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు 📚 విద్యాపరమైన లక్ష్యాలు ✔ పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం (FLN) బలోపేతం చేయడం ✔ భాషా వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడం ✔ పరిశీలన, తార్కిక ఆలోచన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను అభివృద్ధి చేయడం 🌱 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ✔ సృజనాత్మకత పెంపొందించడం ✔ ఊహాశక్తి వికాసం ✔ సామాజిక-భావోద్వేగ నైపుణ్యాల అభివృద్ధి ✔ శారీరక దృఢత్వం ✔ బాధ్యత మరియు పౌరసత్వ విలువల పెంపకం 🔍 అనుభవాధారిత అభ్యాస లక్ష్యాలు ✔ జీవిత అనుభవాలతో విద్యను అనుసంధానం చేయడం ✔ పరిశోధనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ✔ చేతితో చేసే కార్యకలాపాల ద్వారా నేర్చుకోవడం 🎯 ఆశించిన ఫలితాలు (Expected Outcomes) 👦 విద్యార్థి స్థాయిలో వి...

⚡⚡Flash Flash Ap 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి (SSC) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఫలితాలను ప్రకటించనుంది. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన  విద్యార్థులు కూడా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. https://resultsbie.ap.gov.in https://results.apcfss.in https://manabadi.co.in https://schools9.com  అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in మనమిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది. ఫలితాలు విడుదలైన ప్రారంభ సమయంలో ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు వెబ్‌సైట్లను సందర్శించే అవకాశం ఉండటంతో కొంతసేపు వెబ్‌సైట్లు నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కొద్దిసేపు వేచి ఉండి మళ్లీ ప్రయత్నించాలి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర గుర్తింప...