పాపమయ్యేలా
సంపాదించకండి
అప్పు అయ్యేలా
ఖర్చుచేయకండి
అజీర్తి అయ్యేలా
తినకండి
మనస్పర్ధలొచ్చేలా
మాట్లాడకండి
ఆలస్యమయ్యేలా
నడవకండి
చితికి చేరేలా
చింతించకండి
ఆలస్యం చేస్తూ
కాలాన్ని నిందించకండి
అర్థం చేసుకోకుండా
అవమానపర్చకండి
నాదే లోకం అనుకోకుండా
ప్రపంచాన్ని చూడండి
ద్వేషాన్ని వదిలేసి
ప్రేమను ఆహ్వానించండి
కోపంగా 10 మాటలు కాదు
ప్రేమగా ఒక్క మాట చాలు
ముందు ఎంతున్నది కాదు
వెనక ఎంత ఖ్యాతి ఉందో తెలియాలి
ఎంత సీనియారిటి అన్నది కాదు
ఎంత సిన్సియారిటి అన్నది ముఖ్యం
ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు
ఎన్ని లోతులు తెలిసాయన్నది ముఖ్యం
ఏమి సాధించామన్నది కాదు
ఏమి కోల్పోలేదన్నది ముఖ్యం
ఎంత మంది స్నేహితులన్నది కాదు
ఒక్క శత్రువు లేరన్నది ముఖ్యం
లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ
Comments
Post a Comment