భారత దేశంలో రైల్వే వ్యవస్థ కొరకు 1832లో ప్రణాళిక రూపొందించినా, తరువాతి దశాబ్ద కాలం వరకూ ఆ దిశలో ఒక్క అడుగూ పడలేదు. భారతదేశంలో మొదటి రైలు 1837 లో రెడ్ హిల్స్ నుండి చింతప్రేట్ వంతెన వరకు నడిచింది. దీనిని రెడ్ హిల్ రైల్వే అని పిలుస్తారు , విల్లియం అవేరీచే తయారు చేయబడిన రోటరీ స్టీమ్ లోకోమోటివ్ని ఉపయోగించారు. ఈ రైల్వే సర్ ఆర్థర్ కాటన్ చే నిర్మించబడింది , ప్రధానంగా మద్రాసులో రహదారి నిర్మాణ పనుల కొరకు గ్రానైట్ రాళ్ళను రవాణా చేయడానికి ఉపయోగించబడింది. 1844 లో, అప్పటి గవర్నరు జనరలు, లార్డు హార్డింజ్ రైల్వే వ్య్వస్థ నెలకొల్పేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చాడు. రెండు కూత రైల్వే కంపెనీలను స్థాపించి, వాటికి సహాయపడవలసిందిగా ఈస్ట్ ఇండియా కంపెనీని అదేశించారు. ఇంగ్లండు లోని పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా తరువాతి కొద్ది సంవత్సరాలలో రైల్వే వ్యవస్థ త్వరిత గతిన ఏర్పడింది. 1845 లో గోదావరిలో ఒక డ్యామ్ నిర్మాణం కోసం రాళ్ళు సరఫరా చేయడానికి ఉపయోగించే రాజమండ్రిలో దోల్స్లేవమ్ వద్ద గోదావరి డాం కన్స్ట్రక్షన్ రైల్వేను నిర్మించారు. 1851 లో సోలాని అక్విడక్ట్ రైల్వేను రూర్కీలో నిర్మించారు, దీనిని ఒక బ్రిటీష్ అధికారి పేరు మీద ఉన్న "థామస్సన్" అని పిలిచే ఆవిరి లోకోమోటివ్లచే నడపబడుతుంది. సోలానీ నదిపై ఒక కాలువ కోసం నిర్మాణ పదార్థాలను రవాణా చేసేందుకు ఉపయోగించబడింది. కొన్నేళ్ళ తరువాత, 1853 ఏప్రిల్ 16 న బాంబే లోని బోరి నందర్, ఠాణాల మధ్య -34 కి.మీ.దూరం - మొట్టమొదటి ప్రయాణీకుల రైలును నడిపారు.
ఆంగ్ల ప్రభుత్వం ఎల్లపుడూ రైల్వే సంస్థలను స్థాపించమంటూ ప్రైవేటు రంగ పెట్టుబడుదారులను ప్రోత్సాహించేది. అలా సంస్థలను స్థాపించేవారికి మొదటి సంవత్సరాలలో సంవత్సరానికి లాభం ఐదు శాతానికి తక్కువ కాకుండా ఉండేలా ప్రణాళికను తయారుచేసింది. అలా పూర్తి అయిన తరువాత ఆ సంస్థ ప్రభుత్వానికి అప్పగించేది, కానీ సంస్థ యొక్క కార్యాకలాపాల పర్యవేక్షణ బాధ్యతలను మాత్రం తమ ఆధీనంలోనే ఉంచుకొనేవి. 1880 సం నాటికి ఈ రైలు మార్గాల మొత్తం దూరం సుమారుగా 14,500 కి.మీ (9000 మై) వరకు విస్తరించింది. ఈ మార్గాలలో ఎక్కువ శాతం మహా నగరాలైన బొంబాయి, మద్రాస్, కలకత్తాలకు చేరుకునేలా వుండేవి. 1895 నుండి భారత దేశం తన సొంత లోకోమోటివ్స్ (locomotives) స్ద్డాపించడం మొదలుపెట్టింది. తరువాత 1896లో తమ ఇంజనీర్లను , locomotive లను ఉగాండా రైల్వే నిర్మాణానికి పంపింది.
తరువాత భారత రాజ్యాలులు తమ సొంత రైల్వేలను ఏర్పాటు చేసుకొని తమ రాజ్యమంతా విస్తరించారు. అవి నవీన రాష్ట్రాలు అయిన అస్సాం, రాజస్థాన్ , ఆంధ్ర ప్రదేశ్. 1901లో రైల్వే బోర్డు ఏర్పాటు చేయబడింది కాని దాని మొత్తం అధికారం భారత వైస్రాయ్ (లార్డ్ కర్జన్) దగ్గర ఉండేది. రైల్వే బోర్డును కామర్స్ డిపార్ట్ మెంటు పర్యవేక్షంచేది. ఇందులో ముగ్గురు సభ్యులు ఉండేవారు. వారు ఒక ప్రభుత్వ అధికారి (ఛైర్మెన్), ఇంగ్లండు నుండి ఒక రైల్వే మానేజర్ , , రైల్వే కంపెనీలలో నుండి ఒక కంపెని ఏజెంట్. భారతీయ రైల్వే చరిత్రలో మొదటిసారిగా రైల్వే సంస్థలు చిన్నపాటి లాభాలను ఆర్జించటం మొదలైంది. ప్రభుత్వము 1907లో అన్ని రైల్వే కంపేనీలను స్వాధీనము చేసుకొన్నది.
ఆ తరువాతి సంలో విద్యుత్ లోకోమోటివ్ దేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది. కానీ ఇంతలో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ రైల్వేలు బ్రిటిష్ వారి యుద్ధ అవసరాలకు దేశం వెలుపల కూడా ఉపయోగించడ్డబడ్డాయి. దీంతో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే సరికి రైల్వేలు భారీగా నష్టపోయి ఆర్థికంగా చతికిల పడ్డాయి. ఆ తరువాత 1920 సంలో ప్రభుత్వం రైల్వే సంస్థల నిర్వహణను హస్తగతం చేసుకొని ఇతర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల పరిధి నుండి రైల్వే ఆర్థిక వ్యవహారాలను తప్పిస్తూ నిర్ణయం తీసుకొంది
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అన్ని రైళ్ళను మధ్య-ఆసియాకు తరలించి , రైల్వే కర్మాగారాలను ఆయుధ కర్మాగారాలగా ఉపయోగించడంతో రైల్వే రంగం దారుణంగా చచ్చుబడి పోయింది. స్వాతంత్ర్య పోరాట సమయంలో (1947)రైల్వేలోని పెద్ద భాగం అప్పట్లో కొత్తగా నిర్మించబడిన పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళిపోయింది. నలభై రెండు వేర్వేరు రైల్వే సంస్థలు, అందులోని ముప్పై రెండు శాఖలు అప్పటిలోని భారత రాజరిక రాష్ట్రముల యొక్క సొత్తు, అన్నీ ఒకే సముదాయంలో కలిసి ఏకైక సంస్థగా రూపొందుకొంది. ఆ సంస్థకు "భారతీయ రైల్వే సంస్థ"గా నామకరణ చేసారు. సం 1952 లో అప్పటి వరకు వివిధ సంస్థల ఆధీనంలో వున్న రైల్వే మార్గాలను ప్రాంతాల వారీగా విభజిస్తూ మొత్తం ఆరు ప్రాంతీయ విభాగలను ఏర్పాటు చేయటం జరిగింది. భారత దేశపు ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా చక్కపడటంతో అన్ని రైల్వే ఉత్పత్తులూ దేశీయంగానే తయారు చేయటం మొదలయ్యింది. 1985 సం నాటికి బొగ్గుతో నడిచే ఆవిరి యంత్రాలను తొలగించి డీజిల్ , విద్యుత్ ఇంజిన్లను వాడటం మొదలయ్యింది. 1995 సం నాటికి రైల్వే రిజర్వేషన్ సదుపాయాన్ని కంప్యుటరైజ్ చేసారు.
లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ
Comments
Post a Comment