Skip to main content

నేటి మోటివేషన్ ......తప్పక చదవండి ....



ఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా
ఆలోచించకూడదు.🙏

🌹 ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి.

☀అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే,
దీనివల్ల చాలా లాభాలున్నాయి.

☀నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటంవల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది. అది అవతలవారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కాని, ముందు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది అనిచెప్పటంలో తిరుగు లేదు.
దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి.

☀రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం అదుపు తప్పుతుంది.మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడంటారు. చెడుగా ఆలోచించి, ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దయ్యంలా చెడు పట్టుకుంటుంది.
అది అవతలవారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం.

☀నేడు చాలామంది తనలోనిమంచిని వదిలేసి ఎదుటివారిలో చెడుని చూస్తున్నారు-చూపిస్తున్నారు.
దీనివలన ఎదుటివారికి చెందవలసిన అశుభపరిణామాలను ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని వీరు అనుభవిస్తున్నారు.

☀దుర్యోధనుడు ఒకసారి వెదికితే ఎక్కడా అతడికి ఒక్క మంచివాడు కూడా కనపడలేదట.
చెడ్డవాడికి మంచి ఎక్కడ కనిపిస్తుంది?
ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది.

☀ఉదయం లేవగానే ఈ లోకం బాగుండాలి, అందరూ బాగుండాలి అని హృదయపూర్వకంగా పది నిమిషాలపాటు కోరుకోవాలి. ఇలా చేస్తే...
మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నా యి. గురువులు బోధిస్తున్నారు.

☀మనం కూడా ఆలోచించాలి, ఆచరించాలి. మంచి చెడుల మిశ్రమమే జీవితం. సుఖదుఃఖాల సంగమమే జీవనం. త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడున్నాడు. మంచికి, ధర్మానికి మారుపేరు ఆయన. ఆ యుగంలోనే అతి దురాత్ముడు, మహా పాపి అయిన రావణాసురుడూ ఉన్నాడు. ఏ యుగమూ చెడ్డను తప్పించుకోలేదు.
మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు. చెడ్డను నిరసించే శక్తి కావాలి. చెడుభావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి.

☀అంతేకాని మీకు సంబంధం లేని ఎదుటివారి పాపకర్మలను నిందించి లేదా ప్రచారం చేసి వారికి చెందవలసిన చెడు ను మీరు అనుభవించకండి.

☀పుట్టుకతో ఎవరూ దుర్మార్గులుకాదు, పాపాత్ములుకాదు ప్రతివారిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి.
కానీ మన దురదృష్టమేమిటంటే నేటి సమాజం చెడును చూసినంత ఎక్కువగా మంచిని చూడటంలేదు దీనివల్ల అలాంటివారిపై దుష్ప్రభావం ఎక్కువగా ఉండి అనేకరకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారు.

☀ దయచేసి అంతా క్షమాగుణం కలిగి, ఎదుటివారిలోగల చెడుని వదిలేసి మంచిని మాత్రమే చూద్దాం, మంచిగురించిమాత్రమే చెబుదాం!

🙏 సర్వేజనా సుఖినోభవంతు🙏

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...

TET and DSC Very important topics...

Lakshya Educational Groups