*🔸ముంబయి: భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)లో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధనలు వచ్చాయి. బ్యాంకు శాఖల్లో పరిమితికి మించి లావాదేవీలు నిర్వహిస్తే ఇకపై రుసుము కట్టాల్సి ఉంటుంది. కాగా చిన్న, నో ఫ్రిల్ ఖాతాలకు ఈ నిబంధనలు వర్తించవు.*
*🎯సగటు నెలవారీ మొత్తం (ఏఎంబీ) రూ.25000 వరకు ఉండే ఖాతాదారుడు బ్యాంకు శాఖల్లో రెండుసార్లు మాత్రమే నగదు ఉపసంహరించుకొనేందుకు అవకాశం ఉంటుంది. రూ.25,000-50000 అయితే 10 విత్‌డ్రావల్స్ ఉచితం. రూ.50,000-100,000 ఉంటే 15, రూ.లక్షకు మించి ఏఎంబీ ఉంటే అపరిమితంగా నగదు వెనక్కి తీసుకోవచ్చు. పరిమితి దాటిన వారుమాత్రం ఒక్కో లావాదేవీకి రూ.50+జీఎస్‌టీ చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో మాత్రం ఉచితంగా అపరిమిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.*
*🍁ఏటీఎం నిబంధనలు*
*1) రూ.25వేలలోపు సగటు నెలవారీ మొత్తం ఉన్న వినియోగదారుడు ఏటీఎంలో ఉచితంగా ఎనిమిది లావాదేవీలు చేసుకోవచ్చు. ఎస్‌బీఐలో ఐదు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మూడు లావాదేవీలు ఉచితం. ఇవి ఆరు మెట్రో నగరాలకే వర్తిస్తాయి. ఇతర నగరాల్లో ఎస్‌బీఐలో 5, ఇతర ఏటీఎంలలో 5 వరకు చేసుకోవచ్చు.*
*2) రూ.25,000-లక్ష వరకు ఏఎంబీ ఉన్న ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఎనిమిది వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. మెట్రోల్లో 3, ఇతర నగరాల్లో 5 చేసుకోవచ్చు. సొంత బ్యాంకు ఏటీఎంలలో ఉచితంగా అపరిమిత లావాదేవీలు చేసుకోవచ్చు.*
*3) నిర్దేశించిన పరిమితిని దాటి ఏటీఎంలలో లావాదేవీలు నిర్వహిస్తే ఒక్కోదానికి రూ.10-20 వరకు జీఎస్‌టీని కలిపి రుసుముగా వసూలు చేస్తారు.*
*🎯ఇక సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటులో 5 బేసిస్ పాయింట్ల కోత విధించడంతో 31, మే నుంచి 2.7శాతం వడ్డీ మాత్రమే లభించనుంది.*
🍁🍃🍁🍃🍁🍃🍁🍃
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment