తెలంగాణా పునర్నిర్మాణం కోసం ఉద్యమించిన కవులలో దామెర రాములు ప్రముఖుడు.ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'వచన కవిత'విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు
జననం
దామెర రాములు
1954 జూలై 19
భారతదేశం హవేలి శాయంపేట గ్రామం,గీసుకొండ మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణా రాష్ట్రం
వృత్తి
వైద్యుడు
మతం
హిందూ
భార్య / భర్త
శోభారాణి
జీవిత విశేషాలు
ఇతడు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట్ గ్రామంలో 1954, జూలై 19 తేదీన మెట్టయ్య, నరసమ్మ దంపతులకు జన్మించాడు[2]. దళిత కుటుంబంలో పుట్టిన ఇతడు సమాజం నుండి వివక్షను, అవమానాలను ఎదుర్కొని వాటిని అధిగమించడానికి విద్యార్థి దశనుండే వామపక్ష భావాలకు ఆకర్షితుడై ఉద్యమాలవైపు మళ్లి అక్షరాన్నే ఆయుధంగా మలుచుకున్నాడు. విప్లవ విద్యార్థి సంఘాలలో చురుకుగా పాల్గొన్నాడు. గాంధీ వైద్యకళాశాల నుండి ఎం.బి.బి.యస్ చేసి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.డి.చదివాడు. కొంతకాలం ప్రభుత్వ డాక్టరుగా పనిచేసి ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో స్థిరపడి అక్కడే స్వంతంగా నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నాడు. విరసం సిటీయూనిట్ కన్వీనర్‌గా, కాకతీయ యూనివర్శిటీ బోర్డు మెంబర్‌గా, నిర్మల్ ఐ.ఎం.ఎ. అధ్యక్షుడిగా, తెలంగాణా రచయితల వేదిక రాష్ట్రకార్యదర్శిగా వివిధ పదవులు నిర్వహించాడు.
రచనలు
కోరస్
నెత్తుటి వెన్నెల
జయహే తెలంగాణా
కొర్రాయి
అసలు ముఖం
దామెర కవితాసర్వస్వం
దామెర కవితానుశీలన
అక్షరకవాతు
నిప్పులు
గంగమ్మ కథలు
సాహిత్యవ్యాసాలు
పురస్కారాలు
రంజని-కుందుర్తి అవార్డు
కళాలయ అవార్డు
ఎక్స్‌రే అవార్డు
సి.నా.రె. సాహిత్యపురస్కారం
చికిత్సారత్న బిరుదు
లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ
Comments
Post a Comment