పలకరింపు..
మనుషులకు మాత్రమే వున్న వరమిది.
మానవీయ సంబంధాల వారధి.
మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది.
పలకరింపులు లేని సమాజం, సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి.
ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది.
పలకరింపు అనేది మనిషితనానికి, కలిసి బతికే మనిషితనానికి
నిదర్శనంగా నిలుస్తుంది.
నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న
కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు.
ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు.
ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు.
మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు.
పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది.
పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి
దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ
వుంటుంది. ఇవి కేవలం మనుషులు సాధించేవి.
డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు
మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమై పోయి
ఈ పరిస్థితులు దాపురించాయి. దీన్ని మార్చకపోతే
మనమూ ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం.
అందుకే ...
పలకరించండి. గ్రూప్లోకి
అందరు రండి, పలుకులేమీ బంగారం కాదు. మనిషి మంచి తనానికి ఆనవాళ్ళు..
లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ
Good message sir
ReplyDelete