Skip to main content

నేటి మోటివేషన్.... నువ్వు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది...


తూకం తప్పకూడదు
ప్రతిఫలం...

ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు  పాలు, పెరుగు,నెయ్యి,అన్నీ అమ్ముకుంటూ తన భార్యతో 
జీవనం సాగిస్తుండేవాడు. కొన్ని  పాలని ఊరిలో అమ్మి 
ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి వారానికి ఒకసారి మార్కెట్ కు వెళ్లి అమ్మేవాడు.
భార్య నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్
సంచిలో kg బ్యాగ్స్ లో వేసి ఇచ్చేది, ఒకరోజు మార్కెట్ కు వెళ్ళి రోజంతా అమ్మి,ఒక కొట్టుకు వెళ్ళి అక్కడి  యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు , పప్పు, బియ్యం అన్నీ సరుకులు ఇంటికి తీసుకొని బయలుదేరాడు. అప్పుడు కొట్టు యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగ్ ను తూకం వేసి చూశాడు ఆయనకు ఆశ్చర్యం వేసింది.. 1kg లేదు కేవలం 900 గ్రాములే ఉంది.యజమాని అన్నీ తూకం చేసి చూస్తే  అన్నీ 900gm బ్యాగులే ఉన్నాయి.ఆయనకు చాలా మనసుకు బాధ అనిపించింది
ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే. నన్ను మోసం చేశాడే అని అనుకున్నాడు..

 మళ్ళీ ఒక వారం తరువాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మటానికి వచ్చాడు
అప్పుడు యజమాని చెప్పాడు.. నా కొట్టుకు ఇకపై కాలు పెట్టకు నీవు మోసగాడివి నమ్మకద్రోహివి.. నెయ్యి 1kg అని 900gm ఇస్తావా.. ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు అని గొడవ చేశాడు...

అప్పుడు ఆ పెద్దాయన వినయంతో యజమానితో ఇలా చెప్పాడు, అయ్యా నేను బీదవాడినే కానీ మోసగాణ్ణి కాదు.. నా దగ్గర తక్కెడ కొనే అంత డబ్బు లేదు మీ దగ్గర తీసుకెళ్లిన 1kg చక్కెర  ఆధారంగా ఇంట్లో తక్కెడ లా చేసుకొని తూకం చేస్తాను అని చెప్పాడు..
అందుకు యజమాని తల వంచుకుని తన తప్పు తనకు తెలిసి సిగ్గు పడ్డాడు..

    మిత్రులారా.. మనం వేరేవారికి ఏం చేస్తామో
తిరిగి అదే మళ్ళీ మనకు జరుగుతుంది. అది మంచి కానీ చెడు కానీ, .గౌరవం కాని అవమానం కానీ,  దుఃఖం కానీ సంతోషంకాని,  మోసగించటం కానీ మోసపోవటం కానీ,  తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది.

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺