Skip to main content

కె. వి. కృష్ణారావు



కోటికాలపూడి వెంకట కృష్ణారావు, (కె.వి.కృష్ణారావుగా సుపరిచితులు) (జూలై 16, 1923 - జనవరి 30, 2016), భారత సైనిక దళాల మాజీ ఛీప్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణీపూర్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసారు. ఆయన జమ్మూ కాశ్మీరు గవర్నరుగా మొదటిసారి 1989 జూలై 11 నుండి 1990 జనవరి 19, రెండవసారి 1993 మార్చి 13 నుండి 1998 మే 2 వరకు పనిచేసారు.

జననం
జూలై 16, 1923
విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ భారత దేశం

మరణం
2016 జనవరి 30 (వయసు 92)
న్యూఢిల్లీ, భారతదేశం

సేవా కాలము
1942–1983

ర్యాంకు
జనరల్

పనిచేసే దళాలు
జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC-in-C), వెస్టర్న్ కమాండ్, ఇండియా

పోరాటాలు / యుద్ధాలు
1971 - ఇండియా పాకిస్తాన్ యుద్ధం

పురస్కారాలు
పరమ విశిష్ట సేవా మెడల్
డాక్టర్ ఆఫ్ లెటర్స్

ఇతర సేవలు
జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణిపూర్ , త్రిపుర గరర్నర్.

నాలుగు దశాబ్దాలపాటు సేవలు.. నాలుగు దశాబ్దాల పాటు ఆర్మీకి సేవలందించిన కేవీ స్వాతంత్య్రానికి ముందే 1942 ఆగస్టు 9న సైన్యంలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మా, బెలూచిస్తాన్‌లలో పనిచేశారు. దేశ విభజన సమయంలో తూర్పు, పశ్చిమ పంజాబ్‌ల్లో విధులు నిర్వర్తించారు. ఆయన ఆర్మీ ఛీఫ్ గా 1983 లో పదవీవిరమణ చేసారు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణీపూర్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసారు.

జీవిత విశేషాలు

జనరల్‌ కె.వి. కృష్ణారావుగా ఖ్యాతినందిన ఆయన పూర్తి పేరు కొటికలపూడి వెంకట కృష్ణారావు జూలై 16 1923న విజయవాడలో కె.ఎస్‌. నారాయణరావు, కె. లక్ష్మీరావు దంపతులకు జన్మించారు. ఆయన కె.రాధారావును వివాహమాడారు. ఆయనకు ఒక కుమారుడు నారాయణ్, ఒక కుమార్తె లలిత ఉన్నారు. ఆయన ఆగష్టు 9 1042 న ఇండియన్ ఆర్మీలో చేరారు. యువ అధికారిగా ఉన్నపుడే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నార్త్‌ వెస్ట్‌ ఫ్రాంటియర్‌, బెలూచిస్తాన్‌లలో ఆయన పనిచేశారు. దేశ విభజన సమయంలో తూర్పు, పశ్చిమ పంజాబ్‌ల్లో విధులు నిర్వర్తించారు

1947-48లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపక శిక్షకులలో కృష్ణారావు ఒకరు. 1949-51 మధ్య ఆయన డిఫెన్స్ అకాడమీలో పనిచేశారు. 1965-66లో లడఖ్‌లో ఒక దళానికి, 1969-70లో జమ్మూ ప్రాంతంలో ఇన్‌ఫాంట్రీ విభాగానికి కమాండర్‌గా వ్యవహరించారు. 1970-72 మధ్య నాగాలాండ్, మణిపూర్‌లలో తిరుగుబాట్ల అణచివేత దళాలకు నేతృత్వం వహించారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించారు. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్, ఈశాన్య బంగ్లాదేశ్ ప్రాంతాలకు విముక్తి కల్పించడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ యుద్ధంలో కృష్ణారావు చూపిన ధైర్యం, సాహసోపేత నిర్ణయాలు, నాయకత్వ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించింది.

గవర్నర్ గా

కృష్ణారావు సేవలను గుర్తించిన కేంద్రం ఆర్మీ చీఫ్‌గా రిటైరైన అనంతరం ఆయనకు గవర్నర్‌గా అవకాశం కల్పించింది. 1984-89 మధ్య నాగాలాండ్, మణిపూర్, త్రిపుర గవర్నర్‌గా ఆయన పనిచేశారు. మధ్యలో 1988లో కొంతకాలం పాటు మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తించారు. 1989-90 మధ్య, 1993-1998 మధ్య జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పనిచేశారు. ఉగ్రవాదం, తిరుగుబాట్లతో అట్టుడికిన కశ్మీర్‌లో తిరిగి శాంతి నెలకొనేందుకు కృషి చేశారు.


లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ